Amazon : అమెజాన్ సేల్‌లో సగం ధరకే బ్రాండెడ్ వాషింగ్ మెషీన్లు.. కరెంట్ ఆదా చేసే 5-స్టార్ మోడళ్లపై భారీ ఆఫర్లు

శామ్‌సంగ్, ఎల్‌జీ, బాష్, ఐఎఫ్‌బీ వంటి దిగ్గజ కంపెనీలు తమ 5-స్టార్ రేటింగ్ వాషింగ్ మెషీన్లపై కనీవినీ ఎరుగని డిస్కౌంట్లను ప్రకటిస్తున్నాయి.

Amazon :  అమెజాన్ సేల్‌లో సగం ధరకే బ్రాండెడ్ వాషింగ్ మెషీన్లు.. కరెంట్ ఆదా చేసే 5-స్టార్ మోడళ్లపై భారీ ఆఫర్లు

Photo Credit: Amazon

Cash on delivery and same-day delivery are available during Amazon Great Summer Sale 2026

ముఖ్యాంశాలు
  • శామ్‌సంగ్, ఎల్‌జీ, బాష్, ఐఎఫ్‌బీ వాషింగ్ మెషీన్లపై భారీ డిస్కౌంట్లు
  • రూ.60,990 బాష్ ప్రీమియం మెషీన్ రూ.31,990కే లభిస్తోంది
  • అమెజాన్ ఈసారి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌తో జతకట్టింది.
ప్రకటన


Amazon : వేసవి ఎండలతో పాటు అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2026 ఆఫర్లు కూడా దంచికొడుతున్నాయి. కొత్త వాషింగ్ మెషీన్ కొనాలన్నా లేదా పాత దానిని అప్‌గ్రేడ్ చేయాలన్నా ఇదే సరైన సమయం. శామ్‌సంగ్, ఎల్‌జీ, బాష్, ఐఎఫ్‌బీ వంటి దిగ్గజ కంపెనీలు తమ లేటెస్ట్ 5-స్టార్ రేటింగ్ వాషింగ్ మెషీన్లపై కనీవినీ ఎరుగని డిస్కౌంట్లను ప్రకటిస్తున్నాయి. కేవలం ధర తగ్గించడమే కాకుండా, విద్యుత్ ఆదా చేసే అధునాతన మోడళ్లను సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ సేల్ కొనసాగుతోంది.  

సగం ధరకే బాష్ ప్రీమియం మెషీన్ 
ఈ సేల్‌లో అందరినీ ఆశ్చర్యపరుస్తున్న డీల్ బాష్ 9 కేజీల ఫ్రంట్ లోడ్ మెషీన్‌ది. రూ.60,990 విలువైన ఈ ప్రీమియం మెషీన్ ఏకంగా రూ.31,990కే లభిస్తోంది. అంటే దాదాపు 50 శాతం డిస్కౌంట్ అన్నమాట. అలాగే శామ్‌సంగ్ 8 కేజీల టాప్ లోడ్ మెషీన్ రూ.27,000 నుంచి రూ.19,490కి తగ్గింది. ఫ్రంట్ లోడ్ ఇష్టపడే వారి కోసం ఎల్‌జీ 7 కేజీల స్మార్ట్ ఛాయిస్ మెషీన్ రూ.26,990కే అందుబాటులో ఉంది. బడ్జెట్ ధరలో కావాలనుకుంటే వర్ల్‌పూల్ 7 కేజీల మ్యాజిక్ క్లీన్ మోడల్ కేవలం రూ.15,490కే సొంతం చేసుకోవచ్చు. ఐఎఫ్‌బీ 7 కేజీల ఫ్రంట్ లోడ్ మెషీన్ రూ.28,989కి లభిస్తుండగా, పెద్ద కుటుంబాల కోసం శామ్‌సంగ్ 12 కేజీల భారీ మెషీన్ రూ.46,489కే అందుబాటులో ఉంది.

బ్యాంక్ ఆఫర్లు, అదనపు ప్రయోజనాలు 
అమెజాన్ ఈసారి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌తో జతకట్టింది. క్రెడిట్ కార్డులు లేదా ఈఎంఐ లావాదేవీల ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. దీనికి తోడు పాత మెషీన్లను ఎక్స్ఛేంజ్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది, దీనివల్ల వేల రూపాయల అదనపు తగ్గింపు పొందవచ్చు. అమెజాన్ పే రివార్డ్స్, కూపన్ డిస్కౌంట్లు కూడా అదనం. ముఖ్యంగా అమెజాన్ ప్రైమ్ మెంబర్ల కోసం స్పెషల్ డీల్స్, ఫాస్ట్ డెలివరీ ఆప్షన్లు ఉన్నాయి. క్యాష్ ఆన్ డెలివరీ, ఈజీ రిటర్న్స్ వంటి సదుపాయాలతో షాపింగ్ మరింత సులభతరం అవుతోంది.

కరెంట్ బిల్లు టెన్షన్ లేని 5-స్టార్ టెక్నాలజీ 
చాలామంది వాషింగ్ మెషీన్ కొంటే కరెంట్ బిల్లు బాదుతుందని భయపడతారు. కానీ ఈ సేల్‌లో ఉన్నవన్నీ దాదాపు 5-స్టార్ ఎనర్జీ రేటింగ్ ఉన్నవే. ఇవి తక్కువ నీటిని, తక్కువ విద్యుత్తును వాడుకుంటూ బట్టలను శుభ్రంగా ఉతుకుతాయి. ఇన్వర్టర్ టెక్నాలజీ వల్ల మోటార్ శబ్దం కూడా చాలా తక్కువగా ఉంటుంది. వ్యాక్యూమ్ క్లీనర్లు, రిఫ్రిజిరేటర్లపై కూడా ఇలాంటి భారీ ఆఫర్లు ఉన్నప్పటికీ, వాషింగ్ మెషీన్ల విభాగంలో మాత్రం పోటీ తీవ్రంగా ఉంది. స్టాక్ అయిపోకముందే మీకు నచ్చిన మోడల్‌ను ఇతర వెబ్‌సైట్లతో పోల్చుకుని బెస్ట్ డీల్‌ను బుక్ చేసుకోవడం మంచిది.

Amazon Great Summer Sale 2026: Best Deals on 5-Star Washing Machines

Product Name List Price Effective Sale Price Buying Link
Samsung Smart Choice 8Kg, Fully-Automatic Top Load Washing Machine (WA80BG4441BGTL) Rs. 27,000 Rs. 19,490 Buy Now
IFB 7Kg 5 Star, Fully Automatic Front Load Washing Machine Rs. 36,590 Rs. 28,989 Buy Now
Whirlpool 7Kg Magic Clean 5 Star Fully Automatic Top-Load Washing Machine Rs. 19,550 Rs. 15,490 Buy Now
Bosch 9kg 5 Star Front Load Fully-Automatic Washing Machine (WGA14200IN) Rs. 60,990 Rs. 31,990 Buy Now
LG Smart Choice, 7Kg, 5 Star, Fully-Automatic Front Load Washing Machine (FHB1207Z2W) Rs. 42,490 Rs. 26,990 Buy Now
Samsung 12Kg, 5-star, Fully-Automatic Front Load Washing Machine (WW12DG6B24ASTL) Rs. 60,990 Rs. 46,489 Buy Now
#తాజా కథనాలు
  1. Aadhaar : ఆధార్ కొత్త యాప్ వచ్చేసింది.. ఫేస్ లాక్, క్యూఆర్ షేరింగ్ వంటి అదిరిపోయే ఫీచర్లు
  2. Moto Buds 2 : 48 గంటల బ్యాటరీ లైఫ్, నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్.. మ్యూజిక్ లవర్స్‌కు మోటరోలా అదిరిపోయే గిఫ్ట్
  3. Amazon Great Summer Sale 2026 : రూ.10 వేల స్మార్ట్ స్పీకర్ కేవలం రూ.5 వేలకే.. పిచ్చెక్కిస్తున్న అమెజాన్ ఆఫర్లు
  4. Instagram : ఫొటో చూడగానే మాయమైపోతుంది.. ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఇన్‌స్టెంట్ మ్యాజిక్
  5. HMD Vibe 2 : బడ్జెట్ ధరలో పవర్ ఫుల్ 5G ఫోన్.. 6000mAh బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లు!
  6. Samsung : గూగుల్ జెమిని మాయాజాలం.. శామ్సంగ్ ఫోల్డ్ 8తో స్మార్ట్‌ఫోన్ చరిత్రే మారిపోతోంది
  7. Amazon Great Summer Sale 2026: అమెజాన్ సేల్‌లో డాష్‌క్యామ్‌లపై భారీ డిస్కౌంట్లు.. రూ.11 వేల వరకు ఆదా చేసే ఛాన్
  8. Amazon : అమెజాన్ సేల్‌లో సగం ధరకే బ్రాండెడ్ వాషింగ్ మెషీన్లు.. కరెంట్ ఆదా చేసే 5-స్టార్ మోడళ్లపై భారీ ఆఫర్లు
  9. Moto G37 Power: ఒక్కసారి ఛార్జ్ చేస్తే మూడు రోజులు వాడుకోవచ్చు.. మోటో G37 పవర్ వస్తోంది
  10. Google Shocking Decision: గూగుల్ షాకింగ్ నిర్ణయం.. జీమెయిల్ ఫ్రీ స్టోరేజీపై కత్తెర.. కొత్త రూల్స్ ఇవే
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »