Instagram : ఫొటో చూడగానే మాయమైపోతుంది.. ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఇన్‌స్టెంట్ మ్యాజిక్

ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారుల కోసం ఇన్‌స్టంట్స్ ఫీచర్‌ను పరిచయం చేసింది. స్నాప్‌చాట్ తరహాలో ఉండే ఈ ఫీచర్ ద్వారా మీ స్నేహితులకు ఫొటోలను వేగంగా పంపవచ్చు.

Instagram : ఫొటో చూడగానే మాయమైపోతుంది..  ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఇన్‌స్టెంట్ మ్యాజిక్

Photo Credit: Meta

The company says its new feature prioritises minimal editing

ముఖ్యాంశాలు
  • చూడగానే ఫొటో మాయమయ్యే ఇన్ స్టంట్ ఫీచర్ తెచ్చిన ఇన్ స్టాగ్రామ్
  • స్నాప్ షాట్ తరహాతో ఈ ఫీచర్ ఉంటుంది.. స్క్రీన్‌షాట్ తీయడం కుదరదు
  • టీనేజర్లు ఇన్‌స్టంట్స్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే తల్లిదండ్రులకు మెసేజ్
ప్రకటన

Instagram :  ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా, తన ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారుల కోసం అదిరిపోయే ఫీచర్‌ను పరిచయం చేసింది. అదే ఇన్‌స్టంట్స్. స్నాప్‌చాట్ తరహాలో ఉండే ఈ ఫీచర్ ద్వారా మీ స్నేహితులకు ఫొటోలను చాలా వేగంగా పంపవచ్చు. విశేషం ఏంటంటే, అవతలి వ్యక్తి ఆ ఫొటోను చూడగానే అది ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోతుంది. కేవలం ఫీచర్ మాత్రమే కాదు, దీని కోసం ప్రత్యేకంగా ఒక  స్టాండలోన్ యాప్‎ను కూడా మెటా సిద్ధం చేసింది. ప్రస్తుతం ఈ ఫీచర్, యాప్ ఎంపిక చేసిన కొన్ని దేశాల్లో ప్రయోగాత్మకంగా అందుబాటులోకి వచ్చాయి.

ఇన్‌స్టంట్స్ ఫీచర్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే.. మీరు ఆ క్షణంలో ఎలా ఉన్నారో అలాగే మీ స్నేహితులకు చూపించడం. అందుకే ఇందులో ఎడిటింగ్ చేయడానికి ఎలాంటి ఆప్షన్లు ఉండవు. మీరు ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌బాక్స్‌లో కింద వైపున ఉండే ఒక బటన్ ద్వారా వెంటనే ఫొటో తీసి పంపవచ్చు. కేవలం ఒక క్యాప్షన్ మాత్రమే రాసే అవకాశం ఉంటుంది. ఇలా పంపిన ఫొటోలు అవతలి వారికి ఒక స్టాక్ లాగా కనిపిస్తాయి. ఒకసారి చూసిన తర్వాత అవి మాయమైపోతాయి. మీరు ఒకవేళ తప్పుగా పంపితే, అన్‌డూ చేసుకునే అవకాశం కూడా ఉంది.

ఈ ఫొటోలు చూసిన తర్వాత డిలీట్ అయిపోయినా, పంపిన వ్యక్తికి మాత్రం ఒక సంవత్సరం పాటు వారి ఆర్కైవ్‌లో కనిపిస్తాయి. మీరు ఏడాది చివరలో ఆ ఫొటోలన్నింటినీ కలిపి ఒక రీక్యాప్ స్టోరీగా కూడా పోస్ట్ చేసుకోవచ్చు. ఇక సెక్యూరిటీ విషయానికి వస్తే.. ఇన్‌స్టంట్స్ ఫీచర్‌లో స్క్రీన్‌షాట్లు తీయడం లేదా స్క్రీన్ రికార్డింగ్ చేయడం కుదరదు. దీనివల్ల ప్రైవసీకి ఎలాంటి భంగం కలగదు. మీ సన్నిహిత మిత్రులు లేదా మ్యూచువల్ ఫాలోవర్లకు మాత్రమే ఈ ఫొటోలను పంపే వెసులుబాటు ఉంది.

టీనేజ్ పిల్లల సేఫ్టీ కోసం మెటా కొన్ని ప్రత్యేక నిబంధనలను పెట్టింది. టీనేజర్లు ఈ ఇన్‌స్టంట్స్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే వారి తల్లిదండ్రులకు వెంటనే నోటిఫికేషన్ వెళ్తుంది. అలాగే రాత్రి 10 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ఇది స్లీప్ మోడ్‎లో ఉంటుంది. అంటే ఆ సమయంలో పిల్లలు ఈ ఫీచర్‌ను వాడలేరు. ఇన్‌స్టాగ్రామ్ ఫ్యామిలీ సెంటర్ ద్వారా తల్లిదండ్రులు తమ పిల్లలు ఎంత సమయం ఈ యాప్‌లో గడుపుతున్నారో కూడా పర్యవేక్షించవచ్చు.

ఇన్‌స్టాగ్రామ్ లోపల కాకుండా, నేరుగా కెమెరా ఓపెన్ అయ్యేలా ఒక సపరేట్ యాప్‌ను కూడా మెటా లాంచ్ చేసింది. మీరు ఇన్‌స్టాగ్రామ్ ఐడీతోనే ఇందులో లాగిన్ అవ్వొచ్చు. ఈ యాప్ ద్వారా తీసిన ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌బాక్స్‌లో కూడా సింక్ అవుతాయి. ప్రస్తుతం ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు ఇది అందుబాటులోకి వస్తోంది. స్నాప్‌చాట్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకే మార్క్ జుకర్‌బర్గ్ ఈ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. 

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. Redmi Note 17 : 10,100mAh మెగా బ్యాటరీ.. 200MP కెమెరా..ఈ నెలలోనే మార్కెట్లోకి రెడ్‌మి నోట్ 17 సిరీస్
  2. Mobile Tariff : మొబైల్ యూజర్లకు షాక్.. త్వరలోనే భారీగా పెరగనున్న జియో, ఎయిర్‌టెల్ రీఛార్జ్ ప్లాన్ల ధరలు
  3. HP : కేవలం 30 నిమిషాల్లో 50% ఛార్జింగ్.. భారత్‌లో పవర్‌ఫుల్ ల్యాప్‌టాప్ లాంచ్ చేసి హెచ్‌పీ
  4. Red Magic : గేమర్లకు పండగే.. అదిరిపోయే ఫీచర్లతో కొత్త రెడ్ మ్యాజిక్ గేమింగ్ టాబ్లెట్ 5 ప్రో లాంచ్
  5. Redmi : ఏకంగా 72 గంటల నాన్‌స్టాప్ బ్యాటరీ బ్యాకప్.. రెడ్‌మి సరికొత్త వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్ ప్రత్యేకతలివే
  6. WhatsApp : వాట్సాప్ కొత్త యూజర్‌నేమ్ ఫీచర్‌పై దేశంలో పెద్ద చర్చ.. లాభాల కంటే నష్టాలే ఎక్కువనా?
  7. Vivo Pad 5c : టెక్ మార్కెట్లోకి వివో సరికొత్త పవర్‌ఫుల్ టాబ్లెట్.. అద్భుతమైన ఫీచర్లతో వివో ప్యాడ్ 5సి లాంచ్
  8. Vivo : కెమెరా రంగంలో సరికొత్త విప్లవం.. డిఎస్‌ఎల్‌ఆర్ రేంజ్ ఫీచర్లతో వస్తున్న వివో X500 ప్రో మాక్స్
  9. Tata Motors : భారత ఈవీ మార్కెట్లో టాటా మోటార్స్ నయా రికార్డ్.. జూన్ అమ్మకాల్లో ఏకంగా 183 శాతం జంప్
  10. NASA : అంతరిక్ష చరిత్రలోనే కనవినీ ఎరుగని మిషన్.. కూలిపోతున్న పాత టెలిస్కోప్‌ను కాపాడనున్న నాసా
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »