అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2026లో ప్రముఖ బ్రాండ్లు అయిన క్యూబో, 70mai, బ్లౌపంక్ట్ వంటి వాటిపై ఏకంగా రూ.11,000 వరకు ధరలు తగ్గాయి.
Amazon Great Summer Sale is offering Qubo Trio at a discounted price
Amazon Great Summer Sale 2026: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2026 ప్రస్తుతం జోరుగా సాగుతోంది. స్మార్ట్‌ఫోన్లు, లాప్‌టాప్‌లే కాకుండా మీ కారు సేఫ్టీ కోసం ఉపయోగపడే డాష్‌క్యామ్‌ల పై ఈసారి అమెజాన్ అదిరిపోయే డీల్స్ ప్రకటించింది. ఈ రోజుల్లో రోడ్డు ప్రమాదాలు, రోడ్ రేజ్ గొడవలు పెరుగుతున్న నేపథ్యంలో డాష్‌క్యామ్ అనేది లగ్జరీ కాదు, ప్రతి కారుకి ఒక అవసరంగా మారింది. ప్రముఖ బ్రాండ్లు అయిన క్యూబో, 70mai, బ్లౌపంక్ట్ వంటి వాటిపై ఏకంగా రూ.11,000 వరకు ధరలు తగ్గాయి. మీరు కొత్త డాష్‌క్యామ్ కొనాలని చూస్తుంటే, దీనికి మించిన మంచి సమయం మరొకటి ఉండదు.
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఆఫర్లు
డైరెక్ట్ ప్రైస్ కట్‌లతో పాటు, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉన్నవారికి అదనంగా రూ.9,500 వరకు తక్షణ డిస్కౌంట్ లభిస్తోంది. ఒకవేళ మీరు అమెజాన్ ప్రైమ్ మెంబర్ అయితే, అదనపు క్యాష్‌బ్యాక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అంటే ఆఫర్లన్నీ కలిపితే మీరు ఎంతో తక్కువ ధరకే ప్రీమియం క్వాలిటీ డాష్‌క్యామ్‌ను సొంతం చేసుకోవచ్చు. సింగిల్ ఛానల్ (ముందు వైపు), డ్యూయల్ ఛానల్ (ముందు, వెనుక), ట్రిపుల్ ఛానల్ (క్యాబిన్ లోపల కూడా) ఇలా అన్ని రకాల వేరియంట్లు 4K రికార్డింగ్ సదుపాయంతో అందుబాటులో ఉన్నాయి.
క్యూబో డాష్‌క్యామ్‌లపై సంచలన ధరలు
టాప్ బ్రాండ్ అయిన క్యూబో లో ట్రియో మోడల్ అంటే మూడు వైపులా రికార్డ్ చేసే కెమెరాను ఇప్పుడు కేవలం రూ.9,990కే కొనుగోలు చేయవచ్చు. దీని అసలు ధర దాదాపు 20 వేల వరకు ఉంటుంది. అలాగే క్యూబో ప్రో 3K డ్యూయల్ ఛానల్ వేరియంట్ రూ.10,990కి, 4K మోడల్ రూ.12,989కి లభిస్తున్నాయి. హై-క్వాలిటీ వీడియో రికార్డింగ్ కోరుకునే వారికి ఈ బ్రాండ్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. కారు పార్కింగ్‌లో ఉన్నప్పుడు కూడా ఇది నిఘా ఉంచడం దీని ప్రత్యేకత.
తక్కువ బడ్జెట్‌లో 70mai, బ్లౌపంక్ట్
మీ బడ్జెట్ రూ.3,000 లోపు ఉంటే, 70mai M310 2K సింగిల్ ఛానల్ డాష్‌క్యామ్‌ను కేవలం రూ.2,799 కే దక్కించుకోవచ్చు. దీని లిస్ట్ ప్రైస్ రూ.7,999 కాగా, సేల్‌లో భారీగా తగ్గింది. అలాగే బ్లౌపంక్ట్ DC 4050 డ్యూయల్ ఛానల్ కెమెరా రూ.5,499కే అందుబాటులో ఉంది. ఎర్రటి ఎండల్లో కూడా కరాబవ్వకుండా పనిచేసే డైలెక్ట్ సెన్స్ 4K ట్రిపుల్ ఛానల్ కెమెరా రూ.11,999కి లభిస్తోంది. అలాగే రెడ్ టైగర్ 4K ట్రిపుల్ ఛానల్ మోడల్‌పై ఏకంగా రూ.12,000 వరకు డిస్కౌంట్ లభిస్తోంది.
ఎందుకు డాష్‌క్యామ్ కొనాలి?
రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఏదైనా పొరపాటు జరిగితే అది మీది కాదని నిరూపించుకోవడానికి ఈ వీడియో ఫుటేజ్ ఒక బలమైన సాక్ష్యంగా మారుతుంది. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడంలో కూడా ఇది ఎంతో సహాయపడుతుంది. ప్రయాణంలో అందమైన దృశ్యాలను రికార్డ్ చేసుకోవడమే కాకుండా, ప్రమాదకరమైన పరిస్థితుల్లో మీకు రక్షణ కవచంలా నిలుస్తుంది. అమెజాన్ సేల్ ముగిసేలోపే మీకు నచ్చిన బ్రాండ్‌ను తక్కువ ధరకే ఆర్డర్ చేసేయండి.
| Model | List Price | Sale Price | Buy Now |
|---|---|---|---|
| Qubo Car Dashcam Pro 3K (dual-channel) | Rs. 21,990 | Rs. 10,990 | Buy Now |
| Qubo Dashcam Pro 4K (dual-channel) | Rs. 22,990 | Rs. 12,989 | Buy Now |
| Qubo Dashcam Trio (triple-channel) | Rs. 19,990 | Rs. 9,990 | Buy Now |
| 70mai M310 2K (single-channel) | Rs. 7,999 | Rs. 2,799 | Buy Now |
| 70mai A510 HDR 3K (dual-channel) | Rs. 21,999 | Rs. 11,999 | Buy Now |
| Blaupunkt DC 4050 2K (dual-channel) | Rs. 12,990 | Rs. 5,499 | Buy Now |
| CP Plus CP-F34 (single-channel) | Rs. 8,290 | Rs. 4,899 | Buy Now |
| RedTiger F17 4K (triple-channel) | Rs. 27,990 | Rs. 15,290 | Buy Now |
| DDPAI 2K dashcam (single-channel) | Rs. 12,999 | Rs. 4,199 | Buy Now |
| Dylect Sense 4K (triple-channel) | Rs. 21,999 | Rs. 11,999 | Buy Now |
ప్రకటన
ప్రకటన
PS Plus Monthly Games for July Include Call of Duty: Modern Warfare 3, For the King 2 and CrossCode
Garmin Forerunner 70, Forerunner 170, Forerunner 170 Music Launched in India With 1.2-Inch Display, Up to 13 Days Battery Life