Cuktech CP25 Power Bank : ఇన్‌బిల్ట్ కేబుల్స్, స్మార్ట్ ఎల్‌సీడీ డిస్‌ప్లే.. కుక్‌టెక్ CP25 పవర్ బ్యాంక్ ప్రత్యేకతలివే

Cuktech CP25 పేరుతో విడుదలైన ఈ డివైజ్ ఏకంగా 20,000mAh భారీ బ్యాటరీ కెపాసిటీతో అందుబాటులోకి వచ్చింది.

Cuktech CP25 Power Bank : ఇన్‌బిల్ట్ కేబుల్స్, స్మార్ట్ ఎల్‌సీడీ డిస్‌ప్లే.. కుక్‌టెక్ CP25 పవర్ బ్యాంక్ ప్రత్యేకతలివే

Photo Credit: JD.com

Cuktech CP25 पावर बैंक 20,000mAh बैटरी कैपिसिटी से लैस किया गया है।

ముఖ్యాంశాలు
  • మార్కెట్లోకి సరికొత్త కుక్‌టెక్ (Cuktech) 20,000mAh పవర్ బ్యాంక్
  • ఇన్‌బిల్ట్ కేబుల్స్, స్మార్ట్ ఎల్‌సీడీ డిస్‌ప్లే
  • రెండు వైపులా చార్జింగ్ సపోర్ట్.. అదిరిపోయే టెక్నాలజీ
ప్రకటన

Cuktech CP25 Power Bank : ప్రస్తుత స్మార్ట్‌ఫోన్ యుగంలో బ్యాకప్ కోసం పవర్ బ్యాంక్ అనేది ప్రతి ఒక్కరికీ ఒక నిత్యావసర వస్తువుగా మారిపోయింది. ఈ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రముఖ యాక్సెసరీస్ తయారీ సంస్థ కుక్‌టెక్ మార్కెట్లోకి సరికొత్త పవర్ బ్యాంక్‌ను లాంచ్ చేసింది. Cuktech CP25 పేరుతో విడుదలైన ఈ డివైజ్ ఏకంగా 20,000mAh భారీ బ్యాటరీ కెపాసిటీతో అందుబాటులోకి వచ్చింది. ప్రయాణాల్లో ఉన్నప్పుడు లేదా కరెంట్ లేనప్పుడు మొబైల్స్, టాబ్లెట్లను వేగంగా చార్జ్ చేసుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది.

స్మార్ట్ ఎల్‌సీడీ డిస్‌ప్లే దీని ప్రత్యేకత
ఈ పవర్ బ్యాంక్ అత్యంత ఆకర్షణీయమైన ఫీచర్ ఏంటంటే, ఇందులో కంపెనీ ఒక అడ్వాన్స్డ్ LCD డిస్‌ప్లేను అమర్చింది. సాధారణ పవర్ బ్యాంకుల్లో బ్యాటరీ ఎంత ఉందో కేవలం చిన్న లైట్ల ద్వారా మాత్రమే తెలుస్తుంది. కానీ, ఈ కుక్‌టెక్ CP25 మోడల్‌లో ఉన్న స్క్రీన్ పై పవర్ బ్యాంక్‌లో ఇంకా ఎంత శాతం బ్యాటరీ మిగిలి ఉంది, మీ ఫోన్ ఎంత స్పీడ్‌తో చార్జ్ అవుతోంది వంటి లైవ్ సమాచారాన్ని కస్టమర్లు చాలా సులభంగా చూసుకోవచ్చు.

ఇన్‌బిల్ట్ డ్యూయల్ యూఎస్‌బీ-సి కేబుల్స్
చాలా మంది పవర్ బ్యాంక్ తీసుకువెళ్లినా, కేబుల్స్ మరిచిపోవడం వల్ల ఇబ్బంది పడుతుంటారు. ఆ సమస్యకు చెక్ పెడుతూ కుక్‌టెక్ ఇందులో 13 సెంటీమీటర్ల పొడవున్న రెండు ఇన్‌బిల్ట్ USB-C కేబుళ్లను ఇచ్చింది. ఇవి టూ-వే చార్జింగ్ టెక్నాలజీని సపోర్ట్ చేస్తాయి. అంటే, ఈ కేబుల్స్ ద్వారానే మీరు మీ స్మార్ట్‌ఫోన్‌లను చార్జ్ చేసుకోవచ్చు, అలాగే అదే కేబుల్‌ను అడాప్టర్‌కు కనెక్ట్ చేసి పవర్ బ్యాంక్‌ను కూడా చార్జ్ చేసుకోవచ్చు. దీని రేటెడ్ అవుట్‌పుట్ కెపాసిటీ 12,000mAh (5V/3A వద్ద) గా ఉంది.

Realme : ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మి ధమాకా ఆఫర్.. సగం ధరకే లగ్జరీ కెమెరా ఫోన్!

భద్రతకు పెద్ద పీట.. 9 లేయర్ ప్రొటెక్షన్
ఎలక్ట్రానిక్ డివైజ్ కాబట్టి భద్రత విషయంలో కుక్‌టెక్ ఎక్కడా రాజీ పడలేదు. ఈ పవర్ బ్యాంక్‌లో కస్టమర్ల సేఫ్టీ కోసం ప్రత్యేకంగా 9 లేయర్ల ప్రొటెక్షన్ సిస్టమ్‌ను అందించారు. ఇది డివైజ్లను షార్ట్ సర్క్యూట్, ఓవర్ చార్జింగ్, ఓవర్ వోల్టేజ్ వంటి ప్రమాదాల నుంచి కాపాడుతుంది. దీనితో పాటు ఇందులో రియల్ టైమ్ టెంపరేచర్ మానిటరింగ్ ఫీచర్ కూడా ఉంది. ఇది పవర్ బ్యాంక్ హీట్ ఎక్కినప్పుడు గ్రహించి చార్జింగ్‌ను కంట్రోల్ చేస్తుంది. ఈ బ్యాటరీ 74Wh రేటింగ్‌ను కలిగి ఉంది. యూఎస్‌బీ సి పోర్ట్ ద్వారా గరిష్టంగా 55W వరకు అవుట్‌పుట్ పవర్‌ను అందిస్తుంది.

రేటు ఎంత ? 
కుక్‌టెక్ CP25 పవర్ బ్యాంక్ బరువు 385 గ్రాములు ఉంటుంది. దీని సైజ్ లేదా డైమెన్షన్స్ 126.8 x 73.7 x 34 మిమీగా ఉన్నాయి. కలర్ ఆప్షన్ల విషయానికి వస్తే కంపెనీ దీనిని క్లాసీ వైట్, సిల్వర్ షేడ్స్‌లో ప్రవేశపెట్టింది. చైనా మార్కెట్లో దీని ధరను 199 యువాన్లుగా నిర్ణయించారు. అంటే మన భారతీయ కరెన్సీలో దీని విలువ సుమారు రూ.2,800 వరకు ఉంటుంది. ప్రస్తుతం ఇది కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ప్రముఖ ఈ-కామర్స్ సైట్ JD.comలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.

#తాజా కథనాలు
  1. Xiaomi 17T : భారత మార్కెట్లోకి షావోమి 17T ఎంట్రీ.. శాంసంగ్, వన్‌ప్లస్‌లకు గట్టి పోటీ
  2. Xiaomi Pad 8 : టాబ్లెట్ కొనాలనుకునే వారికి షాక్.. గుట్టుచప్పుడు కాకుండా ధరలు పెంచేసిన షావోమి
  3. NASA Space Alert : భూమి వైపు దూసుకొస్తున్న భారీ గ్రహశకలం.. నాసా శాస్త్రవేత్తల హై అలర్ట్
  4. Moolyam OTT Release : ఓటీటీలోకి వచ్చేసిన పవర్‌ఫుల్ సోషల్ డ్రామా మూల్యం.. ఎక్కడ చూడాలంటే?
  5. Cuktech CP25 Power Bank : ఇన్‌బిల్ట్ కేబుల్స్, స్మార్ట్ ఎల్‌సీడీ డిస్‌ప్లే.. కుక్‌టెక్ CP25 పవర్ బ్యాంక్ ప్రత్యేకతలివే
  6. Realme : ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మి ధమాకా ఆఫర్.. సగం ధరకే లగ్జరీ కెమెరా ఫోన్!
  7. Iran Crypto Ban : ఇరాన్‌కు అమెరికా గట్టి షాక్.. అతిపెద్ద క్రిప్టో ఎక్స్ఛేంజ్‌ నోబిటెక్స్ పై నిషేధం!
  8. Tata Motors : టాటా ఈవీ కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. జూన్ నెలలో ఏకంగా లక్షల్లో డిస్కౌంట్
  9. Big Battery Phones : ఇక రోజూ చార్జింగ్ పెట్టే తలనొప్పి లేదు.. 10,000mAh బ్యాటరీతో వచ్చిన టాప్ ఫోన్లు ఇవే!
  10. VI Plan : ఏడాది పొడవునా నో రీఛార్జ్ టెన్షన్.. రోజుకు 2జీబీ డేటాతో పాటు అమెజాన్ ప్రైమ్ ఉచితం
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »