Photo Credit: Flipkart
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ Flipkart ఏటా నిర్వహించే బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024 తేదీలు వచ్చేశాయి. సెప్టెంబర్ 27 నుంచి ఈ మెగా సేల్ ప్రారంభం కానున్నట్లు Flipkart ప్రకటించింది. అయితే, Flipkart Plus వినియోగదారులకు మాత్రం ఒకరోజు ముందుగా సేల్ అందుబాటులోకి రానుంది. అంటే, సెప్టెంబర్ 26 నుంచి వీరికి బిగ్ బిలియన్ డేస్ వచ్చేస్తాయన్న మాట. అందుకే, Flipkart బిగ్ బిలియన్ డేస్ సేల్‌కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలతోపాటు Flipkart Plus మెంబర్‌షిప్ ఎలా పొందాలో కూడా తెలుసుకుందాం.
ఈ ఏడాది Flipkart బిగ్ బిలియన్ డేస్ సేల్ గతంతో పోల్చుకుంటే కాస్త ముందుగానే వచ్చాయని చెప్పొచ్చు. కంపెనీ ప్రకటనను బట్టీ Flipkart Plus మెంబర్‌ల కోసం సెప్టెంబర్ 26, 2024 నుండి ముందస్తు యాక్సెస్‌కు అవకాశం కల్పించారు. అలాగే, సాధారణ వినియోగదారుల కోసం Flipkart సేల్ సెప్టెంబర్ 27న ప్రారంభమవుతుంది. సాధారణంగా BBD భారతీయ పండుగ సీజన్‌తో ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, 2023 ఫ్లిప్‌కార్ట్ BBD సేల్ అక్టోబర్ 8న ప్రారంభమైంది. కానీ ఈసారి కొంచెం ముందుగానే ప్రకటించడం కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్ అనే చెప్పాలి.
Flipkart Plus మెంబర్‌షిప్ పొందడం ఎంతో సలుభతరం. ఇందుకోసం వినియోగదారు గత 365 రోజుల్లో 4 విజయవంతమైన లావాదేవీలు పూర్తి చేస్తే సరిపోతుంది. అలాగే, Flipkart Plus Premium మెంబర్‌షిప్ కోసం అయితే.. గడిచిన 365 రోజుల్లో 8 విజయవంతమైన లావాదేవీలు చేసి ఉండాలి. వీటిని పొందడం ద్వారా ఇలాంటి సేల్ ఈవెంట్‌లకు ముందస్తు యాక్సెస్‌కు అర్హులవుతారు. అలాగే, Flipkart Plus సభ్యులు ప్రతి కొనుగోలుపై 2x సూపర్ కాయిన్‌లతోపాటు ప్రత్యేక ప్రోత్సాహకాలను పొందవచ్చు.
బిగ్ బిలియన్ డేస్ సేల్ డీల్స్ ఇవే?!
బిగ్ బిలియన్ సేల్ డీల్‌కు సంబంధించిన వివరాలను Flipkart ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే, గత సంవత్సరం సేల్ డీల్స్ ఆధారంగా మర్కెట్ వర్గాలు పలు ఉపకరణాలపై తగ్గింపును అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ సంబంధిత ఉపకరణాలపై 50-80 శాతం వరకూ డిస్కౌంట్ ఉండవచ్చు. అలాగే, టీవీలతోపాటు ఇతర ఉపకరణాలపై 80 శాతం వరకు తగ్గింపు ఉండవచ్చని అంచనా వేస్తున్నాయి. 4K టీవీలు, రిఫ్రిజిరేటర్‌లపై గరిష్టంగా 75 శాతం వరకూ డిస్కౌంట్ ఆఫర్‌లు ఉంటాయని ఊహిస్తున్నాయి. ఎక్సేంజ్ ఆఫర్‌లు, నో-కాస్ట్ EMI, బ్యాంక్ ఆఫర్‌లు, క్యాష్‌బ్యాక్, కూపన్‌లతోపాటు ఇతర కొనుగోలు మార్గాలకు అవకాశం ఉంటుంది.
అంతేకాదు, ఈ బిగ్ బిలియన్ సేల్ డీల్‌ను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే Flipkart పెద్ద ఎత్తున సీజనల్ ఉద్యోగులను నియమించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నియామకాల సంఖ్య లక్ష వరకు ఉండే అవకాశం ఉందని అంచనా. మరో ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ కూడా త్వరలోనే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ తేదీలను ప్రకటించ వచ్చు. ఈ సేల్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే.
ప్రకటన
ప్రకటన