Huge discount on Samsung Galaxy S25 in Amzon: ప్రస్తుతం అమేజాన్‌లో శామ్‌సంగ్ గెలాక్సీ S25 5Gకి సంబంధించిన 8GB RAM / 256GB స్టోరేజ్ వేరియంట్ రూ.65,000 ధరకు లిస్ట్ అయ్యింది.
Photo Credit: Samsung
Samsung Galaxy S25 5G
Huge discount on Samsung Galaxy S25 in Amzon: మీరు ప్రీమియం క్వాలిటీతో ఉండే ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నట్లయితే ఇదే మంచి అవకాశం. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమేజాన్‌లో శామ్‌సంగ్ గెలాక్సీ S25 5G ఫోన్‌పై ఆకర్షణీయమైన డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. నేరుగా ధర తగ్గింపుతో పాటు క్రెడిట్ కార్డు ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు కలగలిపి ఈ ఫోన్‌ను అత్యంత తక్కువ ప్రభావవంతమైన ధరకు కొనుగోలు చేసే వెసులుబాటును కల్పిస్తున్నారు.
ధర, బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్ల వివరాలు..
ప్రస్తుతం అమేజాన్‌లో శామ్‌సంగ్ గెలాక్సీ S25 5Gకి సంబంధించిన 8GB RAM / 256GB స్టోరేజ్ వేరియంట్ రూ.65,000 ధరకు లిస్ట్ అయ్యింది. కొనుగోలుదారులు DBS బ్యాంక్ క్రెడిట్ కార్డు ట్రాన్సాక్షన్ ఉపయోగించి కొనుగోలు చేస్తే 7% తక్షణ డిస్కౌంట్ (గరిష్టంగా రూ.1,500 వరకు) పొందవచ్చు, దీంతో దీని ధర రూ.63,500కు తగ్గుతుంది. దీనికి తోడు మీ వద్ద ఉన్న పాత లేదా ప్రస్తుతం వాడుతున్న స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా గరిష్టంగా రూ.36,050 వరకు అదనపు తగ్గింపు పొందవచ్చు. అయితే, ఎక్స్ఛేంజ్ విలువ అనేది మీరు ఇచ్చే పాత ఫోన్ మోడల్, దాని వర్కింగ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ ఫోన్ గతంలో రూ.80,999 లాంచ్ ధరతో రాగా, ఇప్పుడు దాదాపు రూ.17,499 వరకు తగ్గింపుతో లభిస్తోంది.
డిస్‌ప్లే, పవర్‌ఫుల్ ప్రాసెసర్..
శామ్‌సంగ్ గెలాక్సీ S25 5G స్మార్ట్‌ఫోన్ 6.2 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డైనమిక్ అమోలెడ్ 2X డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 1080×2340 పిక్సెల్స్ రెజ్యూల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 2600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల ఎండలో కూడా డిస్‌ప్లే అత్యంత స్పష్టంగా కనిపిస్తుంది. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. ఇందులో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలీట్ ఆక్టా కోర్ ప్రాసెసర్‌ను అందించారు. దీనివల్ల గేమింగ్, మల్టీటాస్కింగ్ చాలా స్మూత్‌గా సాగుతాయి.
అద్భుతమైన కెమెరా సెటప్..
ఫోటోగ్రఫీ ప్రియుల కోసం శామ్‌సంగ్ గెలాక్సీ S25 5G ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను అందించారు. ఇందులో OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్ట్, f/1.8 అపర్చర్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, f/2.4 అపర్చర్‌తో 10 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా మరియు f/2.2 అపర్చర్‌తో 12 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందూ వైపు f/2.2 అపర్చర్‌తో కూడిన 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అమర్చారు.
Samsung Galaxy Unpacked 2026 : శాంసంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ నేడే.. మార్కెట్‌ను షేక్ చేసే కొత్త ఫోన్లు వస్తున్నాయి
బ్యాటరీ, సాఫ్ట్‌వేర్ ఫీచర్లు..
శామ్‌సంగ్ గెలాక్సీ S25 5G ఫోన్‌లో 4,000mAh సామర్థ్యం గల బ్యాటరీని అందించారు, ఇది 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే.. ఆండ్రాయిడ్ 16 పై ఆధారపడిన ఆండ్రాయిడ్ వన్ UI 7 సాఫ్ట్‌వేర్‌పై పనిచేస్తుంది. ఈ డివైజ్ కొలతలు 146.9 మిమీ పొడవు, 70.5 మిమీ వెడల్పు, 7.2 మిమీ మందం కలిగి ఉండి కేవలం 162 గ్రాముల బరువుతో చాలా తేలికగా ఉంటుంది. కనెక్టివిటీ పరంగా 5G, వై-ఫై 7, బ్లూటూత్ 5.4, NFC, డ్యూయల్ సిమ్ సపోర్ట్, USB టైప్-సి 3.2 పోర్ట్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి.
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹44,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Haier M70 Mini LED 65-inch
Starts from ₹74,990
CMF Buds Neo True Wireless Stereo (TWS) Earphones
Starts from ₹2,199
Xiaomi TV FX Mini LED 65
Starts from ₹64,999
IFA 2026: Lenovo Unveiled New IdeaPad, Yoga and ThinkBook Laptops
IFA 2026: Nvidia RTX Spark PCs, Local AI Tools Announced With October Launch Planned
Luna Band Now Available Globally: Check Price in India, Specifications and Features