Samsung Galaxy Unpacked 2026: శాంసంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ నేడే.. మార్కెట్‌ను షేక్ చేసే కొత్త ఫోన్లు వస్తున్నాయి!

Galaxy Z Fold, 8 Flip, 8 Watch, Ultra 2 launched in Yesterday's Samsung Galaxy Unpacked event 2026 : శాంసంగ్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ నేడు మధ్యాహ్నం 2 గంటలకు BST (భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6:30 గంటలకు) లండన్‌లో ప్రారంభమవుతుంది.

Samsung Galaxy Unpacked 2026: శాంసంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ నేడే.. మార్కెట్‌ను షేక్ చేసే కొత్త ఫోన్లు వస్తున్నాయి!

Photo Credit: Pexels/Aibek Skakov

Samsung

ముఖ్యాంశాలు
  • నేడే శామ్‌సంగ్ 'గెలాక్సీ అన్‌ప్యాక్డ్ 2026' ఈవెంట్
  • గెలాక్సీ Z ఫోల్డ్8, ఫ్లిప్8 సహా పలు డివైజ్‌ల గ్రాండ్ లాంచ్
  • లండన్ వేదికగా కొత్త ఫోల్డబుల్స్, స్మార్ట్‌వాచ్‌ల సందడి
ప్రకటన

Galaxy Z Fold, 8 Flip, 8 Watch, Ultra 2 launched in Yesterday's Samsung Galaxy Unpacked 2026 Event: టెక్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న శాంసంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ 2026 ఈవెంట్ నేడు (జూలై 22) ఘనంగా ప్రారంభం కానుంది. యూకేలోని లండన్ వేదికగా జరగనున్న ఈ కార్యక్రమంలో శాంసంగ్ తన సరికొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లు, అల్ట్రా ఎడిషన్‌లు, శక్తివంతమైన స్మార్ట్‌వాచ్‌లను ప్రపంచానికి పరిచయం చేయనుంది. ఇప్పటికే భారతదేశంలోనూ ఈ ఫోన్ల ప్రీ-రిజర్వేషన్లు ప్రారంభమయ్యాయి. టెక్ ప్రియులను ఉర్రూతలూగించే ఈ ఈవెంట్‌ను ఎక్కడ, ఎలా లైవ్‌లో చూడాలి? ఇందులో ఏయే డివైజెస్‌ విడుదల కానున్నాయి? అనే పూర్తి వివరాలు చూద్దాం. 

లైవ్ స్ట్రీమింగ్ వివరాలు..

శాంసంగ్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ నేడు మధ్యాహ్నం 2 గంటలకు BST (భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6:30 గంటలకు) లండన్‌లో ప్రారంభమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ అభిమానులు ఈ ఈవెంట్‌ను నేరుగా వీక్షించేందుకు శాంసంగ్ తన అధికారిక వెబ్‌సైట్, యూట్యూబ్ ఛానెల్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాటు చేసింది. గ్యాజెట్ ప్రపంచంలో జరిగే ఈ అద్భుతమైన ఆవిష్కరణను ఎవరూ మిస్ కాకుండా చూసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8, అల్ట్రా ప్రత్యేకతలు..

ఈవెంట్లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్న గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 శక్తివంతమైన ఫీచర్లతో వస్తోంది. ఇందులో 7.6 అంగుళాల డైనామిక్ AMOLED 2X ఇన్నర్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉండగా, బయటి వైపు 5.5 అంగుళాల డిస్‌ప్లే ఇవ్వనున్నారు. ఇది అత్యాధునిక క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 అల్ట్రా చిప్‌సెట్, 12GB RAMతో పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. అలాగే దీనికి తోడుగా వచ్చే గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 అల్ట్రా మోడల్ 5,000mAh బ్యాటరీ, 50-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరాతో మరింత అడ్వాన్స్‌డ్‌గా రానుంది.

Nokia Lumia Phone : మళ్లీ రాబోతున్న లూమియా ఫోన్లు? మైక్రోసాఫ్ట్‌తో హెచ్‌ఎమ్‌డీ డీల్

గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 8, కొత్త వాచ్‌లు..

ఫ్లిప్ ఫోన్ ప్రియులను ఆకట్టుకునేందుకు గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 8 కూడా రంగంలోకి దిగుతోంది. ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలీట్ జెన్ 5 ప్రాసెసర్ ఆప్షన్లతో రానుందని సమాచారం. దీనితో పాటు ఆరోగ్య స్పృహ ఉన్న వారి కోసం గెలాక్సీ వాచ్ 9 (40mm, 44mm వేరియంట్లు), అత్యంత రగ్డ్ డిజైన్‌తో గెలాక్సీ వాచ్ అల్ట్రా 2 (47mm LTE మోడల్) స్మార్ట్‌వాచ్‌లు కూడా ఈ వేదికపై లాంచ్ కానున్నాయి.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »