Massive Discount on Samsung Galaxy S25 FE: అమెజాన్‌లో భారీ ఆఫర్.. రూ.22,000 కంటే ఎక్కువ తగ్గింపుతో శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్

Get Rs 22,000 Instant discount on Samsung Galaxy S25 FE in Amazon: శాంసంగ్ గెలాక్సీ S25 FE 5G 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ గత ఏడాది సెప్టెంబర్ 2025లో భారత మార్కెట్లో రూ.65,999 ప్రారంభ ధరతో లాంచ్ అయింది.

Massive Discount on Samsung Galaxy S25 FE: అమెజాన్‌లో భారీ ఆఫర్.. రూ.22,000 కంటే ఎక్కువ తగ్గింపుతో శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్

Photo Credit: Samsung

Samsung Galaxy S25 FE 5G

ముఖ్యాంశాలు
  • సామ్‌సంగ్ ప్రేమికులకు పండగే
  • గెలాక్సీ S25 FE 5G స్మార్ట్‌ఫోన్‌పై ఊహించని ధ‌ర తగ్గింపు
  • రూ. 22,000 కంటే ఎక్కువ తగ్గింపుతో సామ్‌సంగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్
ప్రకటన

Get Rs 22,000 Instant Discount on Samsung Galaxy S25 FE in Amazon: మీరు కొత్త ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లయితే ఇది నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ శాంసంగ్ గెలాక్సీ S25 FE 5G ఫోన్‌పై భారీ ఆఫర్లను ప్రకటించింది. లాంచ్ ధరతో పోలిస్తే ఏకంగా వేలల్లో తగ్గింపు ఇస్తూ కస్టమర్లకు బంపర్ ఛాన్స్ ఇస్తోంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో పాటు పవర్‌ఫుల్ శాంసంగ్ ఎక్సినోస్ 2400  ప్రొసెసర్‌ కలిగిన ఈ ఫోన్ ఇప్పుడు అత్యంత తక్కువ ధరకే లభిస్తోంది.

అమెజాన్‌లో బంపర్ ఆఫర్..

శాంసంగ్ గెలాక్సీ S25 FE 5G  8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ గత ఏడాది సెప్టెంబర్ 2025లో భారత మార్కెట్లో రూ.65,999 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. అయితే ప్రస్తుతం అమెజాన్ సైట్‌లో ఈ ఫోన్ డైరెక్ట్‌గా రూ.45,299 ధరకు లిస్ట్ అయింది. అంటే ఎలాంటి ఆఫర్లు లేకుండానే లాంచ్ ధర కంటే సుమారు రూ.20,700 వరకు తగ్గింపు లభిస్తోంది. దీనికి తోడు అదనపు బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లతో వినియోగదారులు మరింత తక్కువ ధరకే ఈ ఫ్లాగ్‌షిప్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే ఫోన్‌ను దక్కించుకోవచ్చు.

బ్యాంక్ డిస్కౌంట్, అదనపు ఎక్స్ఛేంజ్ ఆఫర్ల వర్షం..

కొనుగోలుదారులు అమెజాన్ పే బ్యాలెన్స్ ద్వారా పేమెంట్ చేస్తే రూ.1,358 అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. దీంతో ఈ ఫోన్ ఎఫెక్టివ్ ధర రూ.43,941కి తగ్గుతుంది. ఇది ఒరిజినల్ ధర కంటే దాదాపు రూ.22,300 తక్కువ కావడం గమనార్హం. అంతేకాకుండా మీ వద్ద ఉన్న పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా గరిష్టంగా రూ.35,050 వరకు అదనపు తగ్గింపు పొందవచ్చు. అయితే ఈ ఎక్స్ఛేంజ్ వాల్యూ అనేది మీరు ఇచ్చే పాత ఫోన్ మోడల్, దాని వర్కింగ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది.

50MP కెమెరా, AI ఫీచర్లు..

ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే, గెలాక్సీ S25 FE మోడల్ 6.7 అంగుళాల డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 1080x2340 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 1,900 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో అద్భుతమైన విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత One UI 8 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. రోజువారీ వాడకంలోనూ, హెవీ గేమింగ్‌లోనూ వేగవంతమైన పనితీరు కోసం ఇందులో శక్తివంతమైన Exynos 2400 ప్రాసెసర్‌ను అమర్చారు.

Airtel : ఎయిర్‌టెల్ అన్‌లిమిటెడ్ 5G హాట్‌స్పాట్‌ వివాదంపై క్లారిటీ.. కస్టమర్లకు ఊరటనిచ్చే అప్‌డేట్!

120Hz డైనమిక్ AMOLED డిస్‌ప్లే, 4,900mAh బ్యాటరీ..

కెమెరా విభాగానికి వస్తే శాంసంగ్ గెలాక్సీ S25 FE 5G ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ మరియు 12 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందూ భాగంలో 12 మెగాపిక్సెల్ కెమెరాను ఇచ్చారు. ఫోన్‌లో 4,900mAh సామర్థ్యం గల బ్యాటరీ ఉండి, ఇది 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 190 గ్రాముల బరువు, 7.4 మిమీ మందంతో చాలా స్లిమ్‌గా డిజైన్ చేశారు.

వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ IP68 రేటింగ్..

కనెక్టివిటీ పరంగా 4G, 5G, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్‌లను అందిస్తున్నారు. నీరు, దుమ్ము నుంచి రక్షణ కోసం ఈ ఫోన్‌కు IP68 రేటింగ్ లభించింది. వీటితో పాటు జనరేటివ్ ఎడిట్ వంటి AI ఎడిటింగ్ టూల్స్, గూగుల్ సర్కిల్ టు సెర్చ్, జెమిని లైవ్ వంటి లేటెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »