ఎంటర్టైన్మెంట్ బండిల్ కోసం ఎయిర్టెల్ కస్టమర్లు రూ. 399 ను నెలవారీ లేదా ముందస్తు పేమెంట్ చేయడం ద్వారా ఎన్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ నెలవారీ చెల్లింపును సెలెక్ట్ చేసుకుంటే రూ. 2,500ను నాన్-రిఫండబుల్ యాక్టివేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది
Photo Credit: Airtel
ఎయిర్టెల్ తన IPTV సేవలను మార్చి 2025లో భారతదేశంలో ప్రారంభించింది, ఢిల్లీ మరియు ఎంపిక చేసిన ఇతర మార్కెట్లతో ప్రారంభించి
ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్టెల్ మొబైల్ నెట్వర్క్ తో పాటు, DTH, ఇంటర్నెట్ సర్వీసెస్ కూడా అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తమ కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు నూతన ప్లాన్లను పరిచయం చేస్తూ వాళ్లకి సర్వీసెస్ అందిస్తూ ఉంటుంది. తాజాగా తమ బ్రాడ్ బాండ్, DTH, ల్యాండ్ లైన్ కస్టమర్ల కొరకు ఎగ్జిస్టింగ్ ఎయిర్టెల్ బ్లాక్ ప్లాన్ కి కొన్ని చేంజెస్ చేసి కొత్తగా పరిచయం చేసింది. రూ.399 కి ఒక బండిల్ గా ఈ సర్వీసెస్ అన్ని అందిస్తుంది. ఇప్పుడు వీటికి అదనంగా IPTV సర్వీస్ లను జత చేసింది. కస్టమర్లు డిమాండ్ మేరకు 29 OTT ఛానల్స్ లో ప్రసారమయ్యే టీవీ షోస్, సినిమాలు అని ఈ ప్లాన్ లో భాగంగా వీక్షించవచ్చు.
ఎయిర్టెల్ వెబ్సైట్లో ఈ ప్లాన్ వల్ల కస్టమర్లకు అందుతున్న బెనిఫిట్స్ గురించి వివరించడం జరిగింది. ఈ ఎయిర్టెల్ బ్లాక్ ప్లాన్ ని చూజ్ చేసుకోవడం ద్వారా ఒక కస్టమర్ ల్యాండ్ లైన్ కనెక్షన్తో అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. అలాగే ఎయిర్టెల్ బ్రాడ్ బాండ్ సర్వీస్ ద్వారా 10 MBPS వరకు అన్లిమిటెడ్ ఇంటర్నెట్ సర్వీసెస్ పొందవచ్చు. ఈ ప్లాన్ ఎంచుకున్న సబ్స్క్రైబర్లు ఎయిర్టెల్ డిజిటల్ టీవీ కనెక్షన్ ద్వారా 260 ఛానల్స్ యాక్సెస్ అదనంగా పొందవచ్చు.
ఎంట్రీ లెవల్ ప్లాన్ లో IPTV సేవలు కూడా ఉన్నాయి. ఈ సంవత్సరం మార్చిలో ప్రారంభించబడిన ఈ ప్లాన్ ద్వారా Amazon Prime Video, Apple TV+, Netflix, ZEE5 మొదలైన 29 OTT స్ట్రీమింగ్ యాప్స్ లో అందుబాటులో ఉన్న కంటెంట్ లైబ్రరీని డిమాండ్ పై అందిస్తుంది. అయితే, కొన్ని యాప్స్ సెలెక్ట్ చేసుకున్న ప్లాన్లకు పరిమితంగా ఉండవచ్చు.రూ. 399 ఎయిర్టెల్ బ్లాక్ ప్లాన్‌తోవినియోగదారులు 350కి పైగా టీవీ ఛానళ్లకు యాక్సెస్ పొందే అవకాశం ఉంది. సాధారణ కేబుల్ లేదా సెటప్ బాక్స్ కనెక్షన్లతో పోల్చితే, IPTV ఎటువంటి హార్డ్‌వేర్ లేదా కనెక్షన్లు అవసరం లేకుండా ఇంటర్నెట్‌కి కనెక్ట్ అయిన స్మార్ట్ ఫోన్, టాబ్లెట్ లేదా స్మార్ట్ టీవీ వంటి డివైస్లలో కంటెంట్‌ను స్ట్రీమ్ చేయగలదు.
ఇది ఎయిర్టెల్ బ్లాక్ ప్లాన్లో భాగమైనప్పటికీ ఈ పోస్ట్ పెయిడ్ ప్లాన్ పూర్తిస్థాయి బెనిఫిట్లను అందించదు. ఓకే బిల్, ఓకే కాల్ సెంటర్ సౌకర్యం కూడా లేదు.
ఎంటర్‌టైన్‌మెంట్ బండిల్ కోసం ఎయిర్టెల్ కస్టమర్లు రూ. 399 ను నెలవారీ లేదా ముందస్తు పేమెంట్ చేయడం ద్వారా ఎన్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ నెలవారీ చెల్లింపును సెలెక్ట్ చేసుకుంటే రూ. 2,500ను నాన్-రిఫండబుల్ యాక్టివేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.ఇదే సమయంలో ముందస్తు పేమెంట్ ను సెలెక్ట్ చేసుకున్న కస్టమర్లు మొత్తం రూ. 3,300 చెల్లించాల్సి ఉంటుంది. అందులో రూ. 2,800 బిల్లులో జత చేస్తారు, మిగిలిన రూ. 500 నాన్-రిఫండబుల్ ఇన్‌స్టాలేషన్ ఫీజు కింద తీసుకుంటారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే, ఎయిర్టెల్ బ్లాక్ కస్టమర్లకు పోస్ట్‌పెయిడ్, DTH, ఫైబర్ సేవలను ఒకే బిల్లులో కలపుకునే అవకాశాన్ని ఇస్తుంది. ఇందులో ఒకే కస్టమర్ కేర్ నంబర్, ప్రత్యేక రిలేషన్‌షిప్ టీమ్ ద్వారా తమ సమస్యలు సంస్కరించుకునేందుకు కష్టమర్లకు అవకాశం ఉంటుంది. కస్టమర్లు తమకు ఉన్న ఏవైనా రెండు లేదా అంతకంటే ఎక్కువ సేవలను ఎంపిక చేసుకొని తమకిష్టమైన ఎయిర్టెల్ బ్లాక్ ప్లాన్ ను ఎంపిక చేసుకోవచ్చు, లేదా ఇండియాలో రూ. 399 నుంచి ప్రారంభమయ్యే ఫిక్స్‌డ్ ప్లాన్‌ను కూడా ఎంచుకోవచ్చు.
ces_story_below_text
ప్రకటన
ప్రకటన
Rockstar Games Said to Have Granted a Terminally Ill Fan's Wish to Play GTA 6
Oppo K15 Turbo Series Tipped to Feature Built-in Cooling Fans; Oppo K15 Pro Model Said to Get MediaTek Chipset