ఈ రీఛార్జ్ ప్లాన్‌తో వినియోగదారులు ఇప్పటికే మొదలైన క్రికెట్ టోర్నమెంట్‌తో పాటు సినిమాలు, షోలు, anime, డాక్యుమెంటరీలతోపాటు ఇతర లైవ్ క్రీడా కార్యక్రమాలను వీక్షించవచ్చు.
Photo Credit: Reuters
ఈ ప్లాన్ 90 రోజుల చెల్లుబాటుతో 15GB హై స్పీడ్ ఇంటర్నెట్‌ను అందిస్తుంది
తమ ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం రిలయన్స్ జియో సరికొత్త రీఛార్జ్ ప్లాన్‌ను పరిచయం చేసింది. ముఖ్యంగా మన దేశంలోని ICC మెన్స్ ఛాంపియన్స్ ట్రోఫీ వీక్షకులను లక్ష్యంగా చేసుకుని ఈ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇది JioCinema, Disney+ Hotstar ల విలీనం తర్వాత ఇటీవల లాంఛ్ చేసిన స్ట్రీమింగ్ సర్వీస్ అయిన JioHotstar కు ఉచిత subscription అందిస్తుంది. దీని వలన వినియోగదారులు ఇప్పటికే మొదలైన క్రికెట్ టోర్నమెంట్‌తో పాటు సినిమాలు, షోలు, anime, డాక్యుమెంటరీలతోపాటు ఇతర లైవ్ క్రీడా కార్యక్రమాలను వీక్షించవచ్చు. అలాగే, ఇతర ప్రయోజనాలలో క్రికెట్ డేటా ప్యాక్ కూడా ఉంది.
జియో హాట్‌స్టార్ నెలవారీ, వార్షిక ప్లాన్‌లను అందిస్తోంది. వీటిని వినియోగదారులు స్ట్రీమింగ్ కంటెంట్ కోసం సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు. అయితే, రిలయన్స్ జియో సబ్‌స్క్రైబర్స్ ఇప్పుడు నిర్దిష్ట ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను ఎంపిక చేసుకోవడం ద్వారా ఉచిత యాక్సెస్‌ను పొందొచ్చు. రిలయన్స్ జియోలోని రూ. 195 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ 90 రోజుల కాలానికి జియో హాట్‌స్టార్‌కు ఉచిత యాడ్-సపోర్టెడ్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది. ఈ ఆఫర్ వినియోగదారులను మరింత ఆకర్షించే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
ఈ రూ.195 ప్లాన్ 90 రోజుల చెల్లుబాటు వ్యవధిని కలిగి ఉంటుంది. అయితే, డేటా ప్రయోజనాలను మాత్రమే అందిస్తుంది. వినియోగదారులు మొత్తం 15GB హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను పొందవచ్చు. అలాగే, ప్లాన్ డేటా అలవెన్స్ అయిపోయిన తర్వాత, డౌన్‌లోడ్ వేగం 64kbpsకి తగ్గించబడుతుందని ఈ టెలికమ్యూనికేషన్ ఆపరేటర్ అధికారికంగా ప్రకటించింది. ఈ ప్లాన్‌పై ఇప్పటికే మార్కెట్‌లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.
అయితే, తాజా ప్లాన్ ఒక యాడ్-ఆన్ ప్యాక్ అని, ఇది యాక్టీవ్ అయ్యేందుకు ఇప్పటికే ఉన్న రిలయన్స్ జియో ప్రీపెయిడ్ బేస్ ప్లాన్ యాక్టివ్ వాలిడిటీతో అవసరమని తెలుసుకోవాలి. జియో హాట్‌స్టార్ యాడ్-సపోర్టెడ్ ప్లాన్ నెలకు రూ. 149 నుండి ప్రారంభమవుతుంది. ఇది 720p రిజల్యూషన్‌లో ఓ మొబైల్ డివైజ్‌లో కంటెంట్ స్ట్రీమింగ్‌ను అందిస్తుంది. అలాగే, టాప్-ఎండ్ జియో హాట్‌స్టార్ ప్రీమియం ప్లాన్ ధర నెలకు రూ. 299 కాగా, సంవత్సరానికి రూ. 1,499గా ఉంది.
ఎక్కువ డేటా అవసరమయ్యే వినియోగదారుల కోసం ఈ టెలికాం కంపెనీ ఇటీవల జియో హాట్‌స్టార్‌కు సమానమైన యాడ్-సపోర్టెడ్ సబ్‌స్క్రిప్షన్‌తో రూ. 949 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను అందిస్తోంది. అయితే, మొత్తం డేటా కోటా ఉన్న రూ. 195 ప్లాన్‌లా కాకుండా, ఈ ప్లాన్ రోజుకు 2GB హై స్పీడ్ 5G డేటాను అందిస్తోంది. అంతే కాదు, ఈ ప్లాన్ ద్వారా అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 SMS వంటి ప్రయోజనాలను కూడా పొందొచ్చు. అదనంగా, ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ JioCloud, JioTV వంటి ఇతర Jio యాప్‌లను ఎంపిక చేసుకునేందుకు కూడా యాక్సెస్‌ను ఇస్తుంది.
ప్రకటన
ప్రకటన
Nandamuri Balakrishna's Akhanda 2 Arrives on OTT in 2026: When, Where to Watch the Film Online?
Single Papa Now Streaming on OTT: All the Details About Kunal Khemu’s New Comedy Drama Series
Scientists Study Ancient Interstellar Comet 3I/ATLAS, Seeking Clues to Early Star System Formation