భారతీ ఎయిర్‌టెల్ 2024 సెకెండ్ హాఫ్‌లో బెస్ట్ వీడియో స్ట్రీమింగ్ అనుభవాలతోపాటు 5G గేమింగ్‌ను తమ వినియోగదారులకు అందించింది
Photo Credit: Reuters
2024 రెండవ త్రైమాసికంలో రిలయన్స్ జియో భారతదేశంలో అత్యుత్తమ మొబైల్ నెట్‌వర్క్‌గా రేటింగ్ పొందింది
ఇండియాలోని మార్కెట్ విశ్లేషణ ప్రకారం.. అన్ని సాంకేతిక పరిజ్ఙానాలను కలిసి 2024 సెకెండ్ హాఫ్(H2)లో మన దేశంలో రిలయన్స్ Jio అత్యంత వేగవంతమైన మొబైల్ నెట్‌వర్క్ ప్రొవైడర్‌గా అవతరించింది. ఈ టెలికమ్యూనికేషన్ సర్వీస్ ప్రొవైడర్ సిటీల్లో అత్యధిక 5G నెట్‌వర్క్‌ను అందించింది. దీని వినియోగదారులలో 73.7 శాతం మంది ఎక్కువ సమయం Jio 5G నెట్‌వర్క్‌ను యాక్సెస్ చేశారు. అలాగే, భారతీ ఎయిర్‌టెల్ 2024 సెకెండ్ హాఫ్‌లో బెస్ట్ వీడియో స్ట్రీమింగ్ అనుభవాలతోపాటు 5G గేమింగ్‌ను తమ వినియోగదారులకు అందించింది.మొదటి స్థానంలో Jio,వెబ్ అనాలసిస్ సర్వీస్ Ookla's ప్రచురించిన 2024 సెకెండ్ హాఫ్ (జూలై నుండి డిసెంబర్ వరకు) స్పీడ్‌టెస్ట్ కనెక్టివిటీ నివేదిక ప్రకారం.. స్పీడ్‌టెస్ట్ ఇంటెలిజెన్స్ డేటా ఆధారంగా అత్యధిక స్పీడ్ స్కోర్ 174.89 నమోదు చేసి, మన దేశంలో అత్యంత వేగవంతమైన మొబైల్ నెట్‌వర్క్ ప్రొవైడర్‌గా Jio నిలిచింది. Jio అన్ని టెక్నాలజీలలలోనూ సగటు డౌన్‌లోడ్ స్పీడ్ 158.63 Mbps నమోదు చేసి మొదటి స్థానం, ఎయిర్‌టెల్ 100.67 Mbps డౌన్‌లోడ్ స్పీడ్‌తో రెండవ స్థానంలో నిలిచాయి. అలాగే, వోడాఫోన్ ఐడియా (Vi) 21.60 Mbps డౌన్‌లోడ్ స్పీడ్‌తో లిస్ట్‌లో మూడో స్థానంలో ఉంది.
దేశంలో 5G నెట్‌వర్క్ పరంగా చూస్తే.. Jio మళ్ళీ 258.54 Mbps సగటు 5G డౌన్‌లోడ్ స్పీడ్, 55 ms జాప్యంతో అత్యంత వేగవంతమైన మొబైల్ నెట్‌వర్క్ ప్రొవైడర్‌గా నిలిచింది. అలాగే, ఎయిర్‌టెల్ 205.1 Mbps సగటు 5G డౌన్‌లోడ్ వేగంతో రెండవ స్థానం కైవసం చేసుకుంది. ఇటీవలే భారత్‌లో 5G సేవలను అందుబాటులోకి తీసుకువచ్చిన Vi మాత్రం ర్యాంకింగ్‌లను పూర్తిగా కోల్పోయింది.
Jio ఇండియాలో అత్యధిక 5G లభ్యతను అందించడంతోపాటు 65.66 కవరేజ్ స్కోర్‌తో అత్యంత సుదూర మొబైల్ కవరేజీని అందించి, 58.17 స్కోర్‌తో ఎయిర్‌టెల్ కంటే ముందు వరుసలో నిలిచింది. అలాగే, 2024 సెకెండ్ హాఫ్‌లో 5G కంటే వీడియో అనుభవాన్ని అందించిన బెస్ట్ ప్రొవైడర్ లేనప్పటికీ, ఎయిర్‌టెల్ 65.73 వీడియో స్ట్రీమింగ్ స్కోర్‌తో దేశంలో బెస్ట్ మొబైల్ వీడియో అనుభవాన్ని అందించిన నెట్‌వర్క్‌గా చెప్పబడుతోంది. 5G గేమ్ స్కోర్ 80.17తో మార్కెట్‌లో అత్యుత్తమ 5G గేమింగ్ అనుభవాన్ని కూడా అందించినట్లు నివేదికలో తేలింది.
వినియోగదారులు Jio కంటే ఎయిర్‌టెల్‌ను ఎక్కువ రేటింగ్ ఇచ్చారు. స్పీడ్‌టెస్ట్‌లో 5 కి 3.45 స్కోరుతో మన దేశంలో టాప్ రేటింగ్ పొందిన మొబైల్ ప్రొవైడర్‌గా ఎయిర్‌టెల్‌కు ఓటు వేశారు. BSNL, Jio వరుసగా 3.34, 3.27 స్కోరుతో రెండు, మూడవ స్థానాల్లో నిలిచాయి. 2024 సెకెండ్ హాఫ్ సమయంలో ఎక్సైటెల్ భారత్‌లో అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ (ISP)గా నివేదిక సూచిస్తోంది. ఈ సగటు డౌన్‌లోడ్ స్పీడ్ 117.21 Mbps, సగటు అప్‌లోడ్ స్పీడ్ 110.96 Mbps గా ఉంది.
ప్రకటన
ప్రకటన
Paramount's New Offer for Warner Bros. Is Not Sufficient, Major Investor Says
HMD Pulse 2 Specifications Leaked; Could Launch With 6.7-Inch Display, 5,000mAh Battery