BSNL బంప‌ర్ ఆఫ‌ర్‌.. రూ.599 ప్రీపెయిడ్ రీఛార్జ్‌తో 3GB అదనపు డేటాతోపాటు మ‌రెన్నో ప్రయోజనాలు

ఇటీవల దేశంలో ఫైబర్ ఆధారిత ఇంట‌ర్‌నెట్ టీవీ, డైరెక్ట్-టు-డివైస్ శాటిలైట్ కనెక్టివిటీ పేరుతో రెండు కొత్త సేవ‌ల‌ను బీఎస్ఎన్ఎల్‌ అందుబాటులోకి తీసుకువ‌చ్చిన విష‌యం తెలిసిందే

BSNL బంప‌ర్ ఆఫ‌ర్‌.. రూ.599 ప్రీపెయిడ్ రీఛార్జ్‌తో 3GB అదనపు డేటాతోపాటు మ‌రెన్నో ప్రయోజనాలు

Photo Credit: BSNL

BSNL భారతదేశంలో 4G సేవలను వాణిజ్యపరంగా విడుదల చేయడానికి ముందు తన లోగోను ఇటీవల అప్‌డేట్ చేసింది.

ముఖ్యాంశాలు
  • సమీప భవిష్యత్తులో టారిఫ్‌లను పెంచబోమని BSNL స్ప‌ష్టం చేసింది
  • ప్రయోజనాలను రూ. 299 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌కు కూడా అందిస్తోంది
  • జూలైలో BSNL 2.9 మిలియన్‌ సబ్‌స్క్రైబర్‌లను సొంతం చేసుకుంది
ప్రకటన

ప్రభుత్వ రంగ‌ టెలికాం సర్వీస్ ప్రొవైడర్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన ప్రీపెయిడ్ మొబైల్ వినియోగ‌దారుల‌కు గుడ్‌న్యూస్ చెప్పింది. దేశంలోని బీఎస్ఎన్ఎల్ ప్రీమెయిడ్ మొబైల్‌ రీఛార్జ్ ప్లాన్‌లలో ఒకదానిపై ప్రమోషనల్ ఆఫర్‌ను విడుద‌ల చేసింది. ఈ ఆఫర్‌తో ప్రీపెయిడ్ వినియోగదారులు BSNL సెల్ఫ్‌కేర్ యాప్‌తో ప్రత్యేకంగా రీఛార్జ్ చేసేట‌ప్పుడు ప్రస్తుత ప్లాన్‌ ప్రయోజనాలతోపాటు అదనంగా 3GB డేటాను సొంతం చేసుకోవ‌చ్చు. ఇటీవల దేశంలో ఫైబర్ ఆధారిత ఇంట‌ర్‌నెట్ టీవీ, డైరెక్ట్-టు-డివైస్ శాటిలైట్ కనెక్టివిటీ పేరుతో రెండు కొత్త సేవ‌ల‌ను బీఎస్ఎన్ఎల్‌ అందుబాటులోకి తీసుకువ‌చ్చిన విష‌యం తెలిసిందే.

84 రోజుల చెల్లుబాటుతో..

BSNL ప్రీపెయిడ్ మొబైల్‌ వినియోగదారులు ఇప్పుడు రూ. 599 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌తో మరింత డేటాను ఆస్వాదించవచ్చని సంస్థ ప్ర‌క‌టించింది. ఇది 84 రోజుల చెల్లుబాటుతో వ‌స్తుంది. అలాగే, అపరిమిత లోకల్, STD కాలింగ్‌తో పాటు రోజుకు 3GB డేటా, 100 రోజువారీ SMSలను కూడా అందిస్తుంది. త‌ద్వారా వినియోగదారులు రోజువారీ ప్రయోజనాలతో పాటు, అదనంగా 3GB డేటాను కూడా అందుకోవ‌చ్చ‌న్న మాట‌.

సెల్ఫ్‌కేర్ యాప్‌తో ప్రత్యేకంగా..

ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ద్వారా జింగ్ మ్యూజిక్, వీడియో స్ట్రీమింగ్ యాప్, పర్సనల్ రింగ్ బ్యాక్ టోన్, ఆస్ట్రోటెల్, గేమ్‌ఆన్‌ సబ్‌స్క్రిప్షన్స్‌ వంటి ఇతర వాల్యూ-ఆడెడ్ సేవలను కూడా జ‌త చేస్తోంది. ఆండ్రాయిడ్, iOS ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉన్న‌టువంటి BSNL సెల్ఫ్‌కేర్ యాప్‌తో ప్రత్యేకంగా రీఛార్జ్ చేసుకోవడం ద్వారా ప్లాన్‌కు సంబంధించిన అన్ని ప్రయోజనాలు పొంద‌వ‌చ్చు. అలాగే, ఈ టెలికాం ప్రొవైడర్.. ఇలాంటి ప్రయోజనాలను రూ. 299 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌కు కూడా అందిస్తోంది. అయితే, ఇది 30 రోజులు మాత్ర‌మే చెల్లుబాటులో ఉంటుంది.

టారిఫ్‌లే ప్రధాన కారణమా?

బిఎస్‌ఎన్‌ఎల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రాబర్ట్ రవి టెలికాం ఆపరేటర్ టారిఫ్‌లను పెంచబోమని ఇటీవల ప్రకటించిన విష‌యం తెలిసిందే. అంతేకాదు, భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో వంటి టెలికాం ఆపరేటర్‌లు దేశంలో టారిఫ్‌ ధరల పెంపును ప్రారంభించిన తర్వాత కొత్తగా వ‌చ్చిన వినియోగదారులను నిలుపుకునే ప్రయత్నంలో బీఎస్ఎన్ఎన్‌ సేవల నాణ్యతను మ‌రింత‌ మెరుగుపరచడంపై దృష్టి పెడుతున్న‌ట్లు మార్కెట్ వ‌ర్గాలు భావిస్తున్నాయి. అలాగే, ప్ర‌యివేట్ టెలికాం సంస్థ‌ల టారిఫ్‌ పెంపు ఫలితంగా జూలైలో భారతదేశంలో BSNL 2.9 మిలియన్‌ సబ్‌స్క్రైబర్‌లను సొంతం చేసుకుంది. అయితే, ఇంత పెద్ద మొత్తంలో వినియోగదారుల బీఎస్ఎన్ఎల్‌కు మార‌టానికి తక్కువ ధ‌ర టారిఫ్‌లే ప్రధాన కారణమని చెబుతున్నారు.

ఈ స్థాయిలో వృద్ధి వెనుక..

అధికారిక సమాచారం మేర‌కు.. బీఎస్ఎన్ఎల్‌ 2025 నాటికి దేశంలో తన మార్కెట్ వాటాను 25 శాతానికి పెంచుకునేందుకు ప్ర‌ణాళిక‌లు చేస్తోంది. అయితే, ఈ స్థాయిలో వృద్ధి వెనుక స్పామ్ ప్రొట‌క్ష‌న్‌, ఫైబర్ -టు-ది-హోమ్ (FTTH) వినియోగదారుల కోసం Wi-Fi రోమింగ్ సేవలు, ఎనీ టైం సిమ్‌ (ATM) కియోస్క్‌లు, ఫైబర్ ఆధారిత ఇంట‌ర్‌నెట్ టీవీ సహా ఇటీవల ప్రకటించిన ఏడు సేవలు ప్రధాన కార‌ణంగా భావించ‌వ‌చ్చు.

Comments

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. హువావే నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్, 5500mAh బ్యాటరీ, డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌
  2. Huawei ఇప్పటివరకు Nova Flip S ప్రాసెసర్ లేదా RAM వివరాలను అధికారికంగా వెల్లడించలేదు
  3. అదనంగా, Vivo కంపెనీ Vivo Sans అనే కొత్త ఫాంట్‌ను ప్రవేశపెట్టింది
  4. అక్టోబర్ చివర్లో లేదా నవంబర్ ప్రారంభంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది
  5. వాట్సప్‌లో అదిరే అప్డేట్.. త్వరలోనే ప్రారంభం
  6. ఆపిల్ నుంచి కొత్త మ్యాక్ బుక్ ప్రో.. అదిరే ఫీచర్స్
  7. ఇన్ స్టాగ్రాంలో దీపావళి స్పెషల్.. ఈ ఎడిట్ గురించి మీకు తెలుసా?
  8. సామ్ సంగ్ గెలాక్సీ ఎస్26 ఎడ్జ్ మోడల్‌కి గుడ్ బై.. దాని స్థానంలో రానున్నది ఇదే
  9. ఒప్పో వాచ్ ఎస్ ప్రారంభం.. కళ్లు చెదిరే ధర, ఫీచర్స్
  10. ఈ రెండు ఫోన్లూ 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తాయి
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »