ఇది యూట్యూబ్ మ్యూజిక్‌కు ఆఫ్‌లైన్ యాక్సెస్‌తో పాటు ఆఫ్‌లైన్‌లో చూసేందుకు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి వినియోగదారులకు అవకాశం కల్పిస్తుంది
Photo Credit: Jio
జియో ఎయిర్‌ఫైబర్ సెప్టెంబర్ 2023లో భారతదేశంలో ప్రారంభించబడింది
రిలయన్స్ జియో తన జియోఫైబర్, ఎయిర్ ఫైబర్ సబ్‌స్క్రైబర్‌లలో కొంతమందికి రెండేళ్లపాటు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా యూట్యూబ్ ప్రీమియం సర్వీసులు యాక్సెస్‌ను అందించనున్నట్లు వెల్లడించింది. ఈ ఆఫర్ దేశంలోని జియోఫైబర్, ఎయిర్ ఫైబర్ పోస్ట్‌పెయిడ్ కస్టమర్‌లు వారు ఎంపిక చేసిన ప్లాన్‌లతో అందించబడుతోంది. ఈ ప్రయోజనాలను సద్వినియోగం చేసుకునేందుకు వినియోగదారులు తమ గూగుల్ అకౌంట్‌లను లింక్ చేయాల్సి ఉంటుంది. యూట్యూబ్ ప్రీమియం వినియోగదారులకు యాడ్ ఫ్రీ కంటెంట్‌ను యాక్సెస్ చేయడానికి, బ్యాగ్రౌండ్ ప్లేబ్యాక్‌కు సపోర్ట్ చేస్తుంది. అలాగే, ఇది యూట్యూబ్ మ్యూజిక్‌కు ఆఫ్‌లైన్ యాక్సెస్‌తో పాటు ఆఫ్‌లైన్‌లో చూసేందుకు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి వినియోగదారులకు అవకాశం కల్పిస్తుంది.
ఓ X పోస్ట్‌లో రిలయన్స్ జియో తన జియోఫైబర్, జియో ఎయిర్ ఫైబర్ పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా 24 నెలల YouTube ప్రీమియంను అందిస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాదు, ఇది ఇప్పటికే ఉన్న నెలవారీ, త్రైమాసిక, semi-annual, వార్షిక పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను వినియోగదారులు ఎంపిక చేసుకోవచ్చు. అలాగే, రూ. 888, రూ. 1,199, రూ. 1,499, రూ. 2,499, రూ. 3,499 ప్లాన్‌లపై సబ్‌స్క్రైబర్‌లు ఈ ఆఫర్‌ను పొందొచ్చు.
ఈ జియోఫైబర్, జియో ఎయిర్‌ఫైబర్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు వరుసగా 30Mbps, 100Mbps, 300Mbps, 500Mbps, 1Gbps వేగాన్ని అందించనున్నాయి. ఈ ప్లాన్‌లన్నీ ఇప్పటికే అపరిమిత డేటా, ఉచిత వాయిస్ కాలింగ్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్ బేసిక్, అమెజాన్ ప్రైమ్ లైట్, డిస్నీ+ హాట్‌స్టార్, సోనీ లైవ్, జీ5లకు యాక్సెస్‌ను అందిస్తున్నాయి. ఈ ఉచిత YouTube ప్రీమియం యాక్సెస్‌ను పొందేందుకు అర్హత కలిగిన JioFiber, Jio AirFiber పోస్ట్‌పెయిడ్ వినియోగదారులు ముందుగా MyJio యాప్‌లోకి లాగిన్ అవ్వాలి. లేదా Jio.comని విజిట్ చేసి, దీనికి సంబంధించిన బ్యానర్‌పై క్లిక్ చేయాల్సి ఉంటుంది.
పై విధంగా లాగిన్ అయ్యేప్పుడు వారి Google అకౌంట్‌ను లింక్ చేయాలి. లింక్ విజయవంతం అయిన తర్వాత YouTube Premium సబ్‌స్క్రిప్షన్ ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా యాక్టివేట్ చేయబడుతుంది. అలాగే, ఈ సబ్‌స్క్రిప్షన్ యాక్టివేషన్ తేదీ నుండి 24 నెలలు లేదా రెండు సంవత్సరాల వరకు చెల్లుబాటులో ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది. ఇది ముమ్మాటికీ వినియోగదారులు మంచి అవకాశమని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
YouTube ప్రీమియం కోసం వ్యక్తిగత నెలవారీ ప్లాన్ ధర ఇప్పుడు రూ. 149, స్టూడెంట్ నెలవారీ ప్లాన్, ఫ్యామిలీ ప్లాన్ ధర వరుసగా రూ. 89, రూ. 299గా ఉన్నాయి. ఈ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ యాడ్ ఫ్రీతో వీక్షించేందుకు అవకాశాన్ని కల్పిస్తోంది. అలాగే, వినియోగదారులు ఆఫ్‌లైన్ ద్వారా చూసుకునేందుకు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు కూడా. అంతేకాదు, వారి డివైజ్‌లలో మల్టీ టాస్కింగ్ చేస్తున్నప్పుడు వీడియోలను ప్లే చేసే అవకాశాన్ని అందిస్తోంది. ఇక, ఆలస్యం చేయకుండా, మీ ప్లాన్‌ను వెంటనే యాక్టీవ్ చేసుకోండి.
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹44,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Haier M70 Mini LED 65-inch
Starts from ₹74,990
CMF Buds Neo True Wireless Stereo (TWS) Earphones
Starts from ₹2,199
Xiaomi TV FX Mini LED 65
Starts from ₹64,999
Infinix Xpad 30 Pro Launched With MediaTek Helio G200 Ultimate SoC, 8,200mAh Battery: Price, Specifications