Reliance Jio Netflix prepaid plans come with 84 days validity
కాంప్లిమెంటరీ నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌లతో వచ్చే ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను Reliance Jio పెంచింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి మన దేశంలో టెలికాం కంపెనీలు తమ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల రేట్లను పెంచుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు Jio కూడా దానిని కొనసాగించేలా ఈ తరహా టారీఫ్ పెంపును ప్రకటించినట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. కంపెనీకి పోటీదారులుగా ఉన్న Vodafone Idea (Vi), భారతి Airtel ఏకకాలంలో తమ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లకు పెరిగిన టారిఫ్‌లను ప్రకటించాయి. ఉచిత నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌లతో సవరించబడిన కొత్త Jio ప్రీపెయిడ్ ప్లాన్‌లు 84 రోజుల చెల్లుబాటుతో వస్తాయి. అంతేకాదు, ఈ రెండు ప్లాన్‌లు కూడా 5G డేటా బెటిఫిట్‌తో వస్తున్నాయి.
ఉచిత నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌లతో కూడిన Reliance Jio ప్రీపెయిడ్ ప్లాన్‌లు ఇప్పుడు రూ. 1,299, రూ. 1,799లకు అందుబాటులో ఉన్నాయి. గతంలో ఈ ప్లాన్‌లు వరుసగా రూ.1099, రూ. 1499గా ఉన్నాయి. ఈ రెండు ప్లాన్‌లలో అత్యంత ఖరీదైన ప్లాన్‌గా ఉన్న రూ. 1,799 టారీఫ్ రోజుకు ఏకంగా 3 GB డేటాను వినియోగదారలకు అందిస్తుంది. అలాగే, రూ. 1,299 ప్రీపెయిడ్ ప్యాకేజీలో నెట్‌ఫ్లిక్స్ మొబైల్ ప్లాన్ ఉంటుంది. అయితే ఖరీదైన రూ. 1,799 టారీఫ్ నెట్‌ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్‌తో వస్తుంది. Jio రూ. 1,299 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా నెట్‌ఫ్లిక్స్‌ను స్మార్ట్‌ఫోన్ లేదా ట్యాబ్‌లో ఇలా ఒకేసారి ఒక్క డ్రైవ్‌లో మాత్రమే యాక్సస్ చేసే అవకాశం ఉంటుంది. అయితే, ఈ ప్లాన్ వల్ల వినియోగదారులు యాప్‌లో పొందగలిగే అత్యధిక నాణ్యత గల 480p క్వాలటీతో వీడియో స్ట్రీమింగ్‌ను ఆస్వాదించవచ్చు. ఈ ప్లాన్ నెట్‌ఫ్లిక్స్ (ఫోన్), జియోటీవీ(JioTV), జియోసినిమా (JioCinema), జియోక్లౌడ్ (JioCloud) సబ్‌స్క్రిప్షన్‌లను కూడా జోడిస్తుంది.
720p క్వాలటీ గల వీడియోలను..
నెట్‌ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్‌తో మరిన్ని ఆసక్తికరమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ప్లాన్ ద్వారా ఫోన్, ట్యాబ్, స్మార్ట్ టీవీ, ల్యాప్‌టాప్ వంటి ఏదైనా డ్రైవ్‌కు వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌ను యాక్సెస్ చేయడానికి వినియోగదారులను అవకాశం ఉంటుంది. ఈ రూ. 1,799 ప్లాన్ గరిష్టంగా 720p క్వాలటీ గల వీడియోలను కూడా సపోర్ట్ చేస్తుంది. నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌లతో కూడిన రెండు జియో ప్రీపెయిడ్ ప్లాన్‌లు 84 రోజుల వరకు చెల్లుబాటులో ఉంటాయి. సబ్‌స్క్రిప్షన్‌ల విషయానికి వస్తే.. నెట్‌ఫ్లిక్స్ (బేసిక్), జియోటీవీ, జియోసినిమా, జియోక్లౌడ్ సబ్‌స్క్రిప్షన్‌లను ఆస్వాదించవచ్చు. అలాగే, ప్రతి రీఛార్జ్‌తో వినియోగదారులు మూడు నెలల కాంప్లిమెంటరీ నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌లను పొందవచ్చు. అలాగే, వినియోగదారులకు రోజుకు 100 SMSలతో పాటు అపరిమిత టాక్ టైమ్, అపరిమిత 5G కనెక్టివిటీని కూడా లభిస్తుంది.
అయితే, ఈ ప్లాన్‌లలో అందిస్తోన్న అపరిమిత 5G కనెక్టివిటీ వినియోగదారుల ప్రాంతంలో 5G లభ్యతపై ఆధారపడి ఉంటుందని మర్చిపోవద్దు. ఎందుకంటే మన దేశంలో చాలా ప్రాంతాల్లో 5G పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. ఈ కారణంగా 5G అందుబాటులో లేని వినియోగదారులు ఇవే టారీఫ్‌లలో 4Gతో సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. రూ. 1,299, రూ. 1,799 జియో ప్రీపెయిడ్ ప్లాన్‌లు వరుసగా 2GB, 3GB రోజువారీ హై-స్పీడ్ డేటాను అందిస్తాయి. ఈ డేటా పరిమితిని దాటితే డేటా స్పీడ్ 64 Kbpsకి పరిమితం అవుతుందని కంపెనీ చెబుతోంది. అన్ని టెలికాం సంస్థల మాదిరిగానే Reliance Jio తమ టారీఫ్‌లను పెంచినప్పటికీ వినియోగదారులకు ఇస్తోన్న ఆఫర్‌ల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకుంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. మరి ఈ టారీఫ్‌లను యూజర్స్ ఎలా ఆహ్వానిస్తారో చూడాల్సి ఉంది.
ప్రకటన
ప్రకటన