ఈ కంపెనీ గతంలో వెలువరించిన కొత్త రీఛార్జ్ వోచర్‌లతో డేటా అలవెన్స్‌ను అందించకుండా, దానిని ప్రస్తుత STVలకు అనుగుణంగా సైట్‌లో అప్‌డేట్ చేసింది.
Photo Credit: Reuters
ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ల కోసం ఎయిర్‌టెల్ తన సవరించిన ధరలకు సంబంధించిన ప్రకటనను ఇంకా విడుదల చేయలేదు
గత నెలలో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ప్రకటించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఆపరేటర్‌లు వినియోగదారుల కోసం కొత్త ప్రీపెయిడ్ ఆప్షన్‌లను తీసుకువచ్చిన కొద్ది రోజులకే ఎయిర్‌టెల్ వాయిస్, SMS రీఛార్జ్ ప్లాన్ ధరలలో మార్పులు చేసింది. అయితే, కొత్తగా ప్రారంభించిన వోచర్‌లను పరిశీలిస్తామని TRAI చెప్పిన కొద్ది సమయంలోనే ఎయిర్‌టెల్ వాయిస్, SMS- స్పెషల్ టారిఫ్ వోచర్‌ల (STV) ధరలను మరింత తగ్గించింది. ఈ కంపెనీ గతంలో వెలువరించిన కొత్త రీఛార్జ్ వోచర్‌లతో డేటా అలవెన్స్‌ను అందించకుండా, దానిని ప్రస్తుత STVలకు అనుగుణంగా సైట్‌లో అప్‌డేట్ చేసింది.
ఈ వారం మొదట్లో ఎయిర్‌టెల్ రూ. 499 ధరతో కొత్త STVని ప్రకటించింది. ఇందులో అపరిమిత వాయిస్ కాల్స్, 900 ఉచిత SMSలతో ప్యాక్ 84 రోజుల చెల్లుబాటు ఉంటుంది. అదేవిధంగా, చందాదారులు 365 రోజుల ఎక్కువ చెల్లుబాటు కలిగిన రూ. 1,959 రీఛార్జ్ ప్లాన్‌ను కూడా ఎంపిక చేసుకోవచ్చు. ఈ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాల్స్, 3,600 SMSల వరకు అందించింది. అయితే, తాజాగా ఈ ప్లాన్‌లను ఇప్పుడు టెలికాం ఆపరేటర్ వెబ్‌సైట్ నుండి తొలగించింది.
తాజాగా, ఎయిర్‌టెల్ వెబ్‌సైట్ కొన్ని రోజుల క్రితం ప్రవేశపెట్టిన వాటి కంటే చౌకైన రెండు కొత్త STVలను అందుబాటులోకి తీసుకువచ్చింది. అలాగే, గతంలో రూ. 499 వోచర్ ఇప్పుడు రూ. 469కి అందుబాటులో ఉండగా, రూ. 1,959 ప్లాన్ రూ. 1,849కి అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్‌లను ఎంచుకునే సబ్‌స్క్రైబర్‌లు గతంలో తీసుకున్న STVల మాదిరిగానే ప్రయోజనాలను పొందవచ్చని కంపెనీ స్పష్టం చేసింది.
ఎయిర్‌టెల్ తన రీఛార్జ్ ప్లాన్‌ల ధరను ఎందుకు తగ్గించిందన్న విషయమై ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు. Xలో (హిందూస్తాన్ టైమ్స్ ద్వారా) ఇప్పుడు తొలగించబడిన పోస్ట్‌లో ఎయిర్‌టెల్, జియో అందించే కొత్త వోచర్‌లను పరిశీలించాలని యోచిస్తున్నట్లు TRAI పేర్కొంది. అంతేకాదు, ఇటీవల కొన్ని సర్వీస్ ప్రొవైడర్‌లు వాయిస్, SMS ప్యాక్‌లను మాత్రమే ప్రారంభించాయని TRAI దృష్టికి వచ్చిందని, వీటిని ప్రారంభించిన తేదీ నుండి ఏడు పని దినాలలో TRAIకి నివేదిస్తాయంది. ఇటీవల ప్రారంభించిన వోచర్‌లను TRAI ప్రస్తుత నియంత్రణ నిబంధనల ప్రకారం పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది.
TRAI పరిశీలనకు ముందే ఎయిర్‌టెల్ తగ్గింపు ప్రణాళికను తీసుకువచ్చింది. ఎయిర్‌టెల్ వెబ్‌సైట్‌లో కొత్తగా అప్‌డేట్ చేయబడిన వాయిస్, SMS ప్లాన్‌ల ధరల మార్పుపై TRAI ఇంకా ఎలాంటి ప్రకటనను విడుదల చేయలేదు. ఇతర టెలికాం అపరేటర్‌లు కూడా ప్లాన్ ధరలు తగ్గించే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. డేటా అలవెన్స్ ఉన్న వోచర్ కోసం చూస్తున్న ఎయిర్‌టెల్ సబ్‌స్క్రైబర్‌లు 84 రోజుల చెల్లుబాటుతో 7GB డేటాను అందించే రూ. 548 ప్లాన్‌ను లేదా 30GB డేటాతో వార్షిక ప్లాన్ రూ. 2,249ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
ces_story_below_text
ప్రకటన
ప్రకటన
Rockstar Games Said to Have Granted a Terminally Ill Fan's Wish to Play GTA 6
Oppo K15 Turbo Series Tipped to Feature Built-in Cooling Fans; Oppo K15 Pro Model Said to Get MediaTek Chipset