ఈ యాప్ ద్వారా వినియోగదారులు తమ మొబైల్ డేటా, బ్రాడ్‌బ్యాండ్ లేదా వైఫై కనెక్షన్ల తాలూకు నిజమైన ఇంటర్నెట్ వేగాన్ని, నెట్‌వర్క్ నాణ్యతను అత్యంత సులభంగా పరీక్షించుకోవచ్చు.
Photo Credit: TRAI
TRAI MySpeed App
MySpeed App : భారతదేశంలో టెలికాం రంగాన్ని నియంత్రించే ట్రాయ్ మొబైల్, బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారుల కోసం ఒక కీలకమైన అప్‌డేట్‌ను తీసుకొచ్చింది. తన అధికారిక ఇంటర్నెట్ స్పీడ్ చెకింగ్ అప్లికేషన్ ట్రాయ్ మైస్పీడ్ యాప్‌ను సరికొత్త ఫీచర్లతో అప్‌గ్రేడ్ చేసింది. ఈ యాప్ ద్వారా వినియోగదారులు తమ మొబైల్ డేటా, బ్రాడ్‌బ్యాండ్ లేదా వైఫై కనెక్షన్ల తాలూకు నిజమైన ఇంటర్నెట్ వేగాన్ని, నెట్‌వర్క్ నాణ్యతను అత్యంత సులభంగా పరీక్షించుకోవచ్చు. కేవలం డౌన్‌లోడ్, అప్‌లోడ్ స్పీడ్ మాత్రమే కాకుండా వీడియో స్ట్రీమింగ్, వెబ్ బ్రౌజింగ్, లేటెన్సీ, నెట్‌వర్క్ స్థిరత్వం వంటి అనేక ఇతర లూప్‌హోల్స్‌ను కూడా ఈ యాప్ నిమిషాల్లో కనిపెడుతుంది.
సిగ్నల్ బార్స్ చూసి మోసపోకండి
భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద టెలికాం మార్కెట్లలో ఒకటిగా ఉందని, ఇక్కడ 100 కోట్లకు పైగా ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారని ట్రాయ్ పేర్కొంది. అయితే, చాలా సందర్భాలలో ఫోన్ స్క్రీన్ పైభాగంలో నెట్‌వర్క్ సిగ్నల్స్ ఫుల్‌గా కనిపించినప్పటికీ.. వీడియోలు బఫర్ అవ్వడం, వెబ్ పేజీలు ఓపెన్ కావడానికి ఆలస్యం కావడం వంటి సమస్యలను యూజర్లు ఎదుర్కొంటున్నారు. కేవలం నెట్‌వర్క్ బార్లను చూసి ఇంటర్నెట్ క్వాలిటీని అంచనా వేయలేమని, ఎందుకంటే ఇంటర్నెట్ స్పీడ్ అనేది యూజర్ లొకేషన్, ఆ సమయంలో ఉండే నెట్‌వర్క్ ట్రాఫిక్, డివైజ్ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుందని ట్రాయ్ స్పష్టం చేసింది. అందుకే వినియోగదారులకు ఖచ్చితమైన సమాచారం అందించడానికి ఈ మైస్పీడ్ యాప్‌ను ఒక పవర్‌ఫుల్ టూల్‌గా తీర్చిదిద్దింది.
స్పీడ్ టెస్ట్ నుంచి అడ్వాన్స్‌డ్ టెస్ట్ వరకు
ఈ అప్‌డేటెడ్ అప్లికేషన్‌లో వినియోగదారుల కోసం ప్రధానంగా మూడు రకాల టెస్టింగ్ ఆప్షన్లను ట్రాయ్ ప్రవేశపెట్టింది. మొదటిది స్పీడ్ టెస్ట్. దీని ద్వారా సాధారణ ఇంటర్నెట్ వేగాన్ని తెలుసుకోవచ్చు. రెండవది వీడియో అండ్ బ్రౌజర్ టెస్ట్. ఇది యూజర్లు యూట్యూబ్ లేదా ఇతర ఓటీటీలలో వీడియోలు చూసేటప్పుడు ఎలాంటి అనుభూతి ఉంటుంది, వెబ్ బ్రౌజింగ్ స్పీడ్ ఎలా ఉందనేది లెక్కిస్తుంది. ఇక మూడవది అడ్వాన్స్‌డ్ టెస్ట్. దీని ద్వారా నిరంతరాయంగా లేదా నిర్దిష్ట సమయ వ్యవధిలో నెట్‌వర్క్ పనితీరును ట్రాక్ చేయవచ్చు. దీనివల్ల ఏ ఏ సమయాల్లో లేదా ఏ ఏ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సరిగ్గా రావడం లేదనే పూర్తి స్పష్టత యూజర్లకు వస్తుంది.
Netflix : ఓటీటీ లవర్స్‌కు బంపర్ ఆఫర్.. ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ .. ఎలా యాక్టివ్ చేసుకోవాలంటే ?
యూజర్ల ప్రైవసీకి డోకా లేదు
ట్రాయ్ మైస్పీడ్ యాప్ వినియోగదారులు గతంలో చేసిన టెస్ట్ రిజల్ట్స్‌ను కూడా భద్రపరుస్తుంది. దీనివల్ల కాలక్రమేణా మీ నెట్‌వర్క్ పర్ఫార్మెన్స్ ఎలా మారుతుందో కంపేర్ చేసుకోవచ్చు. యూజర్ల అనుమతితోనే ఈ నెట్‌వర్క్ కవరేజ్ డేటాను ట్రాయ్ సేకరిస్తుంది. ఈ డేటా ద్వారా దేశవ్యాప్తంగా టెలికాం సేవల నాణ్యతను మెరుగుపరచడానికి విశ్లేషణలు చేస్తారు. అయితే, ఈ యాప్ వినియోగదారుల వ్యక్తిగత మెసేజ్‌లు, కాల్స్ లేదా పర్సనల్ ఫైళ్లను అస్సలు యాక్సెస్ చేయదని, ప్రైవసీ పరంగా ఎలాంటి భయాలు అవసరం లేదని ట్రాయ్ గ్యారెంటీ ఇచ్చింది. ఈ యాప్‌ను ఉపయోగించాలనుకునే వారు గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యాప్ ఓపెన్ చేసి అవసరమైన పర్మిషన్లు ఇచ్చిన తర్వాత Start Test పై క్లిక్ చేస్తే నెట్‌వర్క్ రిపోర్ట్ మొత్తం స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతుంది.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Samsung Galaxy SmartTag 3 India Launch Timeline Confirmed by Company Executive
Microsoft Announces $50 Xbox Nano Controller, Launch Set for Next Month