5,230mAh బ్యాటరీతో Honor 400 Lite.. ధరతోపాటు స్పెసిఫికేషన్స్ ఇవే..
Honor కంపెనీ ఎంపిక చేసిన గ్లోబల్ మార్కెట్‌లలో తమ తాజా స్మార్ట్ ఫోన్ Honor 400 Lite ను లాంఛ్ చేసింది. ఈ చైనీస్ టెక్ బ్రాండ్ నుంచి గత ఏడాది వచ్చిన తాజా నంబర్ సిరీస్ హ్యాండ్‌సెట్ Honor 200 Lite 5G కి మంచి స్పందన వచ్చింది. తర్వాత కంపెనీ నుంచి Honor 300 Lite సిరీస్‌లో లైట్ వెర్షన్ రాలేదు. ప్రస్తుతం విడుదలైన Honor 400 Lite ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7025 అల్ట్రా ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ కీలక స్పెసిఫికేషన్స్‌లలో 108-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్, 5,230mAh బ్యాటరీ, IP65-రేటెడ్ బిల్డ్ వంటివి ఉన్నాయి.