భారత్‌లో iQOO 13 ఫోన్ లాంచ్‌కు వారం ముందే ధర తెలిసిపోయింది.. ఎంతంటే
ఇండియన్ మొబైల్ మార్కెట్‌లోకి iQOO 13 హ్యాండ్‌సెట్ డిసెంబర్ 3న లాంచ్ కానుంది. అయితే, దీని అధికారిక లాంచ్‌కు ముందే ఓ టిప్‌స్టర్ మన దేశంలో ఈ ఫోన్ ధరను వెల్లడించారు. నిజానికి, అక్టోబర్‌లోనే చైనాలో iQOO 13 స్మార్ట్ ఫోన్ విడుదలైంది. అండర్ ది హుండ్ Qualcomm అత్యాధునిక స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌ను కలిగి ఉన్న మొదటి హ్యాండ్‌సెట్‌లలో ఇదొకటి. iQOO 13 Android 15లో రన్ అవుతోంది. అలాగే, 50-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంటుంది. ఇది దుమ్ము, నీటిని నియంత్రించేందుకు IP68, IP69 రేటింగ్‌లను కలిగి ఉంది