ఇండియాలో Realme 14 Pro+ 5G ఇప్పుడు 512GB స్టోరేజీతో అందుబాటులోకి.. ధర ఎంతంటే
మన దేశంలో ఈ ఏడాది జనవరిలో Realme 14 Pro 5Gతో పాటు Realme 14 Pro+ 5G లాంఛ్ అయ్యింది. అయితే, ఈ ఫోన్ 8GB+128GB, 8GB+256GB, 12GB+256GB గల మూడు RAM, స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో పరిచయమైంది. తాజాగా, కంపెనీ ఈ స్మార్ట్ ఫోన్ 512GB వేరియంట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ Realme 14 Pro+ 5G స్నాప్‌డ్రాగన్ 7s Gen 3 ప్రాసెసర్ వస్తుంది. అలాగే, తాజా హ్యాండ్‌సెట్‌ను 6,000mAh సామర్థ్యం ఉన్న భారీ బ్యాటరీ, పెరిస్కోప్ షూటర్‌తో సహా 50-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌తో రూపొందించారు.