Galaxy Unpacked ఈవెంట్‌కు ముందే భారత్‌లో Samsung Galaxy S25 సిరీస్ ఫోన్‌ల ధరలు లీక్
ఈ జనవరి 22న Samsung Galaxy Unpacked జరగనుంది. ఈ నేపథ్యంలో Samsung Galaxy S25 సిరీస్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. ఈవెంట్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ సిరీస్‌లోని Galaxy S25, Galaxy S25+, Galaxy S25 Ultra మోడల్స్ గురించిన మరిన్ని వివరాలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా, కంపెనీ నుంచి రాబోతున్న Galaxy S సిరీస్ ఫోన్‌ల ధరలపై కొత్త లీక్ బహిర్గతమైంది. ఈ కొత్త సిరీస్ దేశంలోని Galaxy S24 సిరీస్ కంటే అన్ని కాన్ఫిగరేషన్‌లలోనూ ఖరీదైనదిగా కనిపిస్తోంది.