Vivo

Vivo - ख़बरें

  • మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెస‌ర్‌తో Vivo V50 Lite 5G లాంఛ్‌.. ధర ఎంతో తెలుసా..
    ఎంపిక చేసిన గ్లోబ‌ల్ మార్కెట్‌ల‌లో Vivo V50 Lite 5G ఆవిష్క‌రించ‌బడింది. ఇది ఈ వారం ప్రారంభంలో కొన్ని ప్రాంతాలలో విడుద‌లైన Vivo V50 Lite 4G వేరియంట్‌తో అనేక పోలిక‌ల‌ను క‌లిగి ఉంది. మ‌న దేశంలో ఫిబ్రవరిలో standard Vivo V50 లాంఛ్‌ అయిన త‌ర్వాత‌ Lite వేరియంట్‌లు ఇక్క‌డ విడుద‌ల‌ అవుతాయో లేదో కంపెనీ ఇంకా నిర్ధారించలేదు. Vivo V50 Lite 5G వెర్షన్ MediaTek Dimensity 6300 ప్రాసెస‌ర్‌, 6,500mAh బ్యాటరీ, 50-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌తో వస్తోంది.
  • 6500mAh భారీ బ్యాటరీతో Vivo T4x 5G ఇండియాలో లాంఛ్‌.. ధరతోపాటు ఫీచర్స్ ఇవే..
    ఇండియాలో Vivo T4x 5G స్మార్ట్ పోన్ లాంఛ్ అయ్యింది. ఈ హ్యాండ్‌సెట్‌ MediaTek Dimensity 7300 ప్రాసెస‌ర్‌తో 8GB వరకు RAMతో అటాచ్ చేయ‌బ‌డింది. 6,500mAh బ్యాటరీతో దీని విభాగంలో ఎక్కువ సామ‌ర్థ్యం ఉన్న మొబైల్‌గా గుర్తింపు పొందింది. ఈ హ్యాండ్‌సెట్ మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ సర్టిఫికేషన్, దుమ్ముస్ప్లాష్ నియంత్ర‌ణ‌కు IP64-రేటెడ్ బిల్డ్‌తో వస్తోంది. ఇది 50-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌తో రూపొందించబ‌డింది. ఈ ఫోన్ ఏప్రిల్ 2024లో మ‌న దేశంలో విడుద‌లైన Vivo T3x 5G హ్యాండ్‌సెట్‌కు కొన‌సాగింపుగా వ‌స్తోంది.
  • Vivo V50 హ్యాండ్‌సెట్ భార‌త్‌లో లాంఛ్‌.. ఫ్రిబ్ర‌వ‌రి 25 నుంచి అమ్మ‌కాలు
    భార‌త్‌లో Vivo V50 లాంఛ్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్‌కు స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెస‌ర్‌, 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ స‌పోర్ట్‌తో 6,000mAh బ్యాటరీని అందించారు. ఇది 50-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్‌తో పాటు రెండు 50-మెగాపిక్సెల్ వెనుక కెమెరాలను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ దుమ్ము, స్ప్లాష్ నియంత్ర‌ణ‌కు IP68+IP69 రేటింగ్‌లను, 7.39mm సన్నని ప్రొఫైల్‌ను కలిగి ఉందని వెల్ల‌డైంది. అంతేకాదు, ఈ విభాగంలో అత్యంత సన్నని స్మార్ట్ ఫోన్‌గా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఫోన్‌లో సర్కిల్ టు సెర్చ్, ట్రాన్స్‌క్రిప్ట్ అసిస్ట్, లైవ్ కాల్ ట్రాన్స్‌లేషన్ వంటి అనేక AI ఫీచర్లు ఉన్నాయి.
  • త్వరలోనే ఇండియ‌న్ మార్కెట్‌లోకి Vivo T4x 5G లాంఛ్‌.. ధ‌ర ఎంతో తెలుసా
    త్వ‌ర‌లోనే Vivo T4x 5G మొబైల్ భార‌త్‌లో లాంఛ్ అవుతుంద‌ని టీజ్ చేయబడింది. ధర, స్పెసిఫికేషన్‌లు, లాంచ్ టైమ్‌లైన్‌తోపాటు హ్యాండ్‌సెట్ గురించిన‌ అనేక వివరాలు ఆన్‌లైన్‌లో బ‌హిర్గ‌త‌మ‌య్యాయి. రానున్న‌ మార్చిలో ఈ ఫోన్ ఇండియా మొబైల్ మార్కెట్‌లోకి రావ‌చ్చ‌ని లీక్‌లు సూచిస్తున్నాయి. అయితే, అధికారిక టీజర్‌లో మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ రాబోయే కొద్ది రోజుల్లోనే దేశంలో లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్న‌ట్లు సూచిస్తోంది. అంతే కాదు, ఇది అందుబాటు ధ‌ర రేంజ్‌లోనే ఉంటుంద‌ని కూడా తెలుస్తోంది. Vivo T4x ఫోన్‌ను పెద్ద బ్యాటరీతో రూపొందించిన‌ట్లు టీజ్ చేయబడింది.
  • Vivo T4x 5G ఇండియా లాంచ్ టైమ్‌లైన్, ధర రేంజ్‌తోపాటు కీల‌క స్పెసిఫికేష‌న్స్ లీక్‌
    బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) వెబ్‌సైట్‌లో Vivo T4x 5G గతంలోనే కనిపించ‌డంతోపాటు మ‌న‌ దేశంలో దీని లాంఛ్‌ త్వరలోనే ఉంటుంద‌ని సూచించింది. తాజాగా, ఒక నివేదిక ప్ర‌కారం.. అంచనా వేసిన లాంచ్ టైమ్‌లైన్‌తోపాటు ఈ హ్యాండ్‌సెట్‌కు సంబంధించిన ప‌లు కీల‌క స్పెసిఫికేష‌న్స్ బ‌య‌ట‌కు వ‌చ్చాయి. అందుబాటు ధ‌ర రేంజ్‌తోపాటు క‌ల‌ర్ ఆప్ష‌న్‌లు, డిజైన్‌కు సంబంధించిన అంశాలు కూడా వెల్ల‌డ‌య్యాయి. రాబోయే Vivo T4x 5G స్మార్ట్ ఫోన్ గ‌త ఏడాది ఏప్రిల్‌లో స్నాప్‌డ్రాగన్ 6 Gen 1 ప్రాసెస‌ర్‌తో దేశంలో విడుద‌లైన‌ Vivo T3x 5Gకి కొన‌సాగింపుగా వ‌స్తున్న‌ట్లు చెబుతున్నారు.
  • లాంఛ్‌కు ముందే Vivo V50 స్పెసిఫికేషన్స్‌, డిజైన్ వెల్ల‌డించిన కంపెనీ
    Vivo నుంచి రాబోయే V-సిరీస్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ V50 వివరాలను కంపెనీ అధికారికంగా వెల్లడించింది. మ‌న‌దేశంలో అడుగుపెట్ట‌బోయే V50 మోడల్ గ‌త ఏడాది ఆగ‌స్టులో లాంఛ్ అయిన V40 ప్రో మోడల్ స్థానాన్ని భ‌ర్తీ చేయ‌నుంది. రాబోయే V50 గురించిన అనేక విష‌యాలు ఆన్‌లైన్‌లో చ‌క్క‌ర్లు కొడుతోన్న నేప‌థ్యంలో Vivo తన రాబోయే ప్రీమియం స్మార్ట్ ఫోన్ గురించి అనేక అంశాల‌ను కంపెనీ వెబ్‌సైట్ ద్వారా అధికారికంగ వెల్లడించాలని నిర్ణయించినట్లు స‌మాచారం. అయితే, ఇందులో ఫోన్ ప్రాసెసర్, ఛార్జింగ్ వేగం లాంటి కొన్ని వివరాలను మినహాయించ‌న‌ట్లు తెలుస్తోంది. ల్యాండింగ్ పేజీ ఫోన్ కాస్మెటిక్ డిజైన్‌తో పాటు లాంచ్ సమయంలో అందుబాటులో ఉండే క‌ల‌ర్ ఆప్ష‌న్‌ల‌ను కూడా వెల్ల‌డిస్తోంది.
  • 200-మెగాపిక్సెల్ సెన్సార్‌తో కూడిన‌ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌తో Vivo X200 అల్ట్రా సిద్ధ‌మైన‌ట్లేనా
    భార‌త్‌లో ఇటీవ‌లే Vivo X200 సిరీస్ ప‌రిచ‌యం అయిన విష‌యం తెలిసిందే. తాజాగా Vivo నుంచి X200 అల్ట్రా మోడ‌ల్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ Vivo X200 అల్ట్రా గురించిన ఎలాంటి వివారాల‌ను కూడా కంపెనీ అధికారికంగా వెల్ల‌డించ‌న‌ప్ప‌టికీ, కొత్త మోడ‌ల్ కెమెరాకు సంబంధించిన కీల‌క విష‌యాలు బ‌హిర్గ‌త‌మ‌య్యాయి. 200-మెగాపిక్సెల్ సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను Vivo X200 అల్ట్రా కలిగి ఉంటుంది. అలాగే, కెమెరా యూనిట్ గరిష్టంగా 120fps (సెకన్ పెర్‌ ఫ్రేమ్స్‌)తో 4K రిజల్యూషన్ వీడియోలను రికార్డ్ చేయగలదని ప్రచారం జ‌రుగుతోంది
  • ఇండియాలో విడుద‌లైన Vivo X200 Pro, Vivo X200 ఫోన్‌లు.. ధ‌ర చూస్తే షాక్ అవుతారు
    భార‌తీయ మొబైల్ మార్కెట్‌లోకి Vivo X200 Pro, Vivo X200 హ్యాండ్‌సెట్‌లు విడుద‌ల అయ్యాయి. ఈ కొత్త Vivo X సిరీస్ స్మార్ట్ ఫోన్‌లు MediaTek డైమెన్సిటీ 9400 ప్రాసెస‌ర్‌తో ర‌న్ అవుతాయి. నీరు, ధూళి నియంత్ర‌ణ కోసం IP68, IP69 రేటింగ్‌లను కలిగి ఉన్నాయి. Zeiss కో-ఇంజనీరింగ్‌తో కూడిన‌ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను Vivo X200 సిరీస్‌లో అందించారు. అలాగే, ప్రో మోడల్‌లో Vivo అంతర్గత V3+ ఇమేజింగ్ చిప్‌తో వ‌స్తుంది. ఇవి వరుసగా 5800mAh, 6000mAh సామ‌ర్థ్యం గ‌ల‌ బ్యాటరీలను కలిగి ఉన్నాయి. అక్టోబర్‌లో ఈ Vivo X200 సిరీస్ చైనాలో లాంచ్ చేశారు
  • 50-మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరాలతో iQOO 13 ఫోన్ లాంచ్‌.. ధ‌ర ఎంతంటే..
    భారతీయ మొబైల్ మార్కెట్‌లో Qualcomm నుండి స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెస‌ర్‌తో వ‌చ్చిన‌ రెండ‌వ స్మార్ట్ ఫోన్‌గా iQOO 13 లాంచ్ అయింది. ఈ హ్యాండ్‌సెట్ మూడు 50-మెగాపిక్సెల్ వెనుక కెమెరాలతో రూపొందించ‌బ‌డి ఉంటుంది. అలాగే, 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.82-అంగుళాల AMOLED స్క్రీన్‌తో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తుంది. ఇది Vivo Funtouch OS 15 స్కిన్‌తో పాటు Android 15పై రన్ అవుతోంది. కంపెనీ 120W వద్ద ఛార్జ్ చేయగల 6,000mAh బ్యాటరీని అందిస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ దుమ్ము, నీటిని నియంత్రించేందుకు IP68, IP69 రేటింగ్‌లను కలిగి ఉంది.iQOO 13
  • లాంచ్‌కు ముందే EEC డేటాబేస్‌లో ప్ర‌త్య‌క్ష‌మైన Vivo V50 సిరీస్, Vivo Y29 4G హ్యాండ్‌సెట్‌లు
    త్వరలోనే గ్లోబల్ మార్కెట్‌ల‌లో Vivo కంపెనీ ప‌లు మోడ‌ళ్ల‌ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. Vivo V50 సిరీస్‌లోని రెండు మోడళ్లతో సహా మూడు హ్యాండ్‌సెట్‌లు ఇప్ప‌టివ‌ర‌కూ ఈ జాబితాలో చేరాయి. Vivo V40 లైనప్‌కు కొన‌సాగింపుగా Vivo V50 స్మార్ట్ ఫోన్‌ రానున్న‌ట్లు మార్కెట్ వ‌ర్గాలు భావిస్తున్నాయి. అలాగే, దీని తాజా మోడల్ సెప్టెంబర్ 25న ప్రారంభించబడింది. ఒక నివేదిక ప్రకారం.. Vivo Y29 4G స్మార్ట్ ఫోన్‌ కూడా అదే ప్లాట్‌ఫారమ్‌లో రానున్న‌ట్లు నిర్థార‌ణ అయ్యింది
  • ఇండియాలో Vivo Y300 5G ఫోన్‌ లాంచ్ తేదీ ఇదే.. డిజైన్, క‌ల‌ర్స్ చూస్తే మ‌తిపోవాల్సిందే
    చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo భార‌త్‌లో Vivo Y300 5G స్మార్ట్‌ఫోన్‌ లాంచింగ్ తేదీని ధృవీకరించింది. రాబోయే ఈ Y సిరీస్ ఫోన్ ఫస్ట్ లుక్‌ను సోషల్ మీడియాతోపాటు దాని అధికారిక‌ వెబ్‌సైట్ పేజీ ద్వారా షేర్ చేసింది. Vivo Y300 హ్యాండ్‌సెట్ మూడు ఆక‌ర్ష‌ణీయ‌మైన‌ రంగులలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుందని చెబుతోంది. అలాగే, Y300లో డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌తో వ‌స్తున్న‌ట్లు అంచ‌నా వేస్తున్నారు. అలాగే, గతేడాది విడుదలైన Vivo Y200కి కొన‌సాగింపుగా ఇది వ‌స్తోంది. ఈ హ్యాండ్‌సెట్ సెప్టెంబర్ నెల‌లో ఎంపిక చేసిన గ్లోబల్ మార్కెట్‌లలో విడుద‌ల చేసిన Vivo V40 Liteకు రీబ్రాండ్ కావచ్చని మార్కెట్ వ‌ర్గాలు భావిస్తున్నాయి
  • త్వరలో భారత్ మార్కెట్‌లోకి Vivo X200 సిరీస్.. ధ‌ర ఎంతంటే..
    చైనాలో గ‌త నెల Vivo X200, Vivo X200 Pro, Vivo X200 Pro Mini స్మార్ట్ ఫోన్‌లు ప్రారంభించబడ్డాయి. అయితే, ఈ మోడ‌ల్స్ గ్లోబల్ మార్కెట్‌లో ఎప్పుడు లాంచ్ అవుతాయ‌న్న విష‌యాన్ని Vivo ఇంకా ధృవీకరించలేదు. తాజాగా భార‌త్‌లో వచ్చే నెల లాంచ్ ఉంటుంద‌ని లీక్ అయ్యింది. అయితే, Vivo X200 సిరీస్‌లోని అన్ని మోడ‌ల్స్‌ ఇండియా మార్కెట్‌లో అందుబాటులో ఉండవని తాజా నివేదికలో తెలుస్తోంది. Vivo X200 సిరీస్‌లోని స్మార్ట్ ఫోన్‌లు MediaTek డైమెన్సిటీ 9400 ప్రాసెస‌ర్‌, ఆరిజిన్ OS 5 UI, ఫీచర్ Zeiss-బ్రాండెడ్ కెమెరాలపై ర‌న్ అవుతాయి.
  • చైనాలో iQOO Neo 10 సిరీస్ లాంచ్ ఎప్పుడో ఫిక్స్‌.. భార‌త్‌లో మాత్రం
    చైనా మొబైల్ మార్కెట్‌లోకి త్వ‌ర‌లోనే iQOO Neo 10 సిరీస్ లాంచ్ కాబోతోంది. ఈ రాబోయే లైనప్‌కు సంబంధించిన‌ వివరాలు గత కొన్ని వారాలుగా ఆన్‌లైన్‌లో చ‌క్క‌ర్లు కొడుతోన్న విష‌యం తెలిసిందే. తాజాగా ఆ కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఈ సిరీస్ విడుద‌ల అంశాన్ని ధృవీకరించారు. అయితే లాంచ్‌కు సంబంధించిన‌ ఖచ్చితమైన తేదీని వెల్ల‌డించ‌లేదు. ఈ సిరీస్‌లో బేస్ మోడ‌ల్స్‌ iQOO Neo 10, iQOO Neo 10 Proలు ఉంటాయి. అలాగే, గత ఏడాది డిసెంబర్‌లో చైనాలో లాంచ్ చేసిన‌ iQOO Neo 9, iQOO Neo 9 ప్రోల ఈ లైనప్ మార్కెట్‌లో మంచి స్థానాన్ని కైవ‌సం చేసుకున్నాయి. తాజాగా iQOO నుంచి వచ్చే నెలలో iQOO 13ని భార‌త్‌లో లాంచ్ చేసేందుకు కంపెనీ సిద్ధంగా ఉంది
  • Vivo Y300 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.. ఇండియాలో లాంచ్ ఎప్పుడంటే
    మ‌న దేశంలో Vivo Y300 Plus స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెస‌ర్‌తో గత నెలలో లాంచ్ అయిన విష‌యం తెలిసిందే. అయితే, ఈ కంపెనీ Vivo Y300ని కూడా భార‌త్‌లో విడుదల చేసేందుకు సిద్ధంగా ఉందట‌. అంతేకాదు, రాబోయే Vivo Y సిరీస్ ఫోన్ కలర్‌వేస్, స్పెసిఫికేషన్‌లతోపాటు మ‌న దేశంలో లాంచ్ టైమ్‌లైన్ సైతం లీక్ అయ్యాయి. ఇది మూడు కలర్ ఆప్షన్‌ల‌లో రాబోతున్న‌ట్లు బ‌హిర్గ‌తం అయ్యింది. అలాగే, Vivo Y300 స్మార్ట్ ఫోన్‌ సోనీ IMX882 పోర్ట్రెయిట్ కెమెరాను కలిగి ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా బ‌య‌ట‌కు రాన‌ప్ప‌టికీ, Vivo Y300 ప్లస్ కంటే అప్‌గ్రేడ్‌లతో Vivo Y300 హ్యాండ్ సెట్‌ని ప‌రిచ‌యం చేయ‌వ‌చ్చ‌ని మార్కెట్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి
  • Vivo Y19s స్మార్ట్‌ఫోన్‌ ధరతోపాటు స్పెసిఫికేష‌న్స్ వ‌చ్చేశాయి.. ఓ లుక్కేయండి
    ప్రపంచవ్యాప్తంగా Vivo Y19sను కంపెనీ అక్టోబర్‌లో ఆవిష్కరించిన విష‌యం తెలిసిందే. అయితే, ఆవిష్క‌ర‌న‌ సమయంలో ఈ హ్యాండ్‌సెట్ ధరకు సంబంధించిన‌ వివరాలను అధికారికంగా వెల్లడించలేదు. ఇప్పుడు తాజాగా ఈ Vivo స్మార్ట్‌ఫోన్ RAM, స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లతో పాటు ధరను కూడా వెల్ల‌డించింది. ఈ బ్రాండ్ లోక‌ల్‌ వెబ్‌సైట్‌లలోని ఒక సైట్‌లో ఫోన్ వివ‌రాలు బ‌హిర్గ‌తం అయ్యాయి. ఇది 6.68-అంగుళాల 90Hz HD+ LCD స్క్రీన్, Unisoc T612 ప్రాసెస‌ర్‌, 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతోపాటు 15W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,500mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. అయితే, బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌ భార‌త్ లాంచ్ టైంను ఇంకా ధృవీకరించ‌లేదు

Vivo - वीडियो

ప్రకటన
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »