త్వరలో వాట్సాప్ నుంచి కొత్త ఫీచర్.. మీ స్టేటస్‌ను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఒకేసారి షేర్ చేసుకోవచ్చు
వినియోగదారులకు సరికొత్త ఫీచర్స్‌ను పరిచయం చేయడంలో ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పుడూ ముందుంటుంది. వాట్సాప్ త్వరలో మెటా అకౌంట్స్ సెంటర్‌తో ఆప్షనల్ అటాచ్‌మెంట్ ద్వారా మరింత ప్రయోజనం పొందనున్నట్లు కంపెనీ ప్రకటించింది. దీని ద్వారా వినియోగదారులు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ఇతర మెటా ప్లాట్‌ఫామ్‌ల యాప్‌లలో తమ వాట్సాప్ స్టేటస్‌లను ఆటోమెటిక్‌గా షేర్ చేసుకోగలుగుతారు. ఒకే సైన్-ఆన్‌తో పలు మెటా యాప్‌లకు లాగిన్ అవ్వడాన్ని సులభతరంతోపాటు వేగవంతం చేస్తుందని కంపెనీ వెల్లడించింది. అదనంగా, కంపెనీ తన సోషల్ మీడియా యాప్‌లలో మరిన్ని యూనివర్సల్ ఫీచర్‌లను ప్రవేశపెడుతుందని, రోల్ అవుట్ తర్వాత మార్పుల గురించి వినియోగదారులకు తెలియజేస్తుందని ప్రకటించింది.