ఈ ముఠాకు ప్రధాన సూత్రధారులైన తుషార్ శర్మ, అర్షద్ అనే ఇద్దరు వ్యక్తులు తమ అనుచరులతో కలిసి ఇంటర్నెట్ డొమైన్ ప్రొవైడర్ GoDaddy ద్వారా డొమైన్, హోస్టింగ్ స్పేస్ కొనుగోలు చేశారు.
Photo Credit: Unsplash
HSRP
HSRP Scam : వాహనదారులకు రవాణా శాఖ తప్పనిసరి చేసిన హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ల (HSRP) బుకింగ్ పేరుతో దేశవ్యాప్తంగా జరుగుతున్న ఒక భారీ సైబర్ దందాను ఉత్తరప్రదేశ్ లోని బిజ్నోర్ పోలీసులు గురువారం బట్టబయలు చేశారు. పక్కా ప్లాన్ ప్రకారం నెట్‌వర్క్ నడుపుతున్న ఒక ముఠాను పోలీసులు చేజిక్కించుకున్నారు. పోలీసు శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్ వై - వజ్ర ప్రత్యేక నిఘా ఆపరేషన్‌లో భాగంగా ఈ ముఠాపై దాడి చేసి ఏడుగురు కీలక సభ్యులను అరెస్ట్ చేసినట్లు ఉన్నతాధికారులు సాయంత్రం 5 గంటలకు విడుదల చేసిన ఒక అధికారిక ప్రెస్ నోట్‌లో వెల్లడించారు. వీరి నుంచి పెద్ద ఎత్తున సాంకేతిక పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.
దైనిక్ భాస్కర్ మీడియా నివేదిక ప్రకారం.. ఈ సైబర్ నేరగాళ్లు ప్రజలను నమ్మించడానికి టెక్నాలజీని విపరీతంగా వాడేసారు. ఈ ముఠాకు ప్రధాన సూత్రధారులైన తుషార్ శర్మ, అర్షద్ అనే ఇద్దరు వ్యక్తులు తమ అనుచరులతో కలిసి ఇంటర్నెట్ డొమైన్ ప్రొవైడర్ GoDaddy ద్వారా డొమైన్, హోస్టింగ్ స్పేస్ కొనుగోలు చేశారు. ఆ తర్వాత వారు bookhsrpplate.com, bookmyhsrp.com లాంటి నకిలీ వెబ్‌సైట్లను సృష్టించారు. అత్యంత షాకింగ్ విషయం ఏమిటంటే, ఈ నకిలీ వెబ్‌సైట్లు అచ్చం రవాణా శాఖ అధికారిక పోర్టల్‌ను పోలి ఉండేలా డిజైన్ చేయడం కోసం వీరు చాట్ జీపీటీ వంటి అడ్వాన్స్‌డ్ ఆన్‌లైన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ సాయంతో కోడింగ్, సాంకేతిక పనులు పూర్తి చేశారు. దీనివల్ల సామాన్య వాహనదారులు ఇది నిజమైన ప్రభుత్వ సైట్ అనుకుని మోసపోయారు.
Asus : అసూస్ సరికొత్త సంచలనం.. అదిరిపోయే ఏఐ ఫీచర్లతో వివోబుక్ 14, వివోబుక్ 15 లాంచ్
పోలీసుల ప్రాథమిక విచారణలో ఈ ముఠా వెనుక ఉన్న నేరాల నెట్‌వర్క్ చూసి అధికారులు సైతం విస్మయానికి గురయ్యారు. దేశంలోని దాదాపు 15 రాష్ట్రాలలో విస్తరించి ఉన్న హెచ్‌ఎస్‌ఆర్‌పీ బుకింగ్ మోసాలతో ఈ ముఠాకు ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్లు తేలింది. జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP)లో నమోదైన ఫిర్యాదుల ఆధారంగా దర్యాప్తు చేయగా.. ఢిల్లీ, పంజాబ్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తెలంగాణ, జమ్మూ-కశ్మీర్ సహా పలు రాష్ట్రాల ప్రజల నుంచి ఈ ముఠా ఆన్‌లైన్ పేమెంట్ల రూపంలో లక్షలాది రూపాయలు దోచుకున్నట్లు ఆధారాలు లభించాయి. దేశవ్యాప్తంగా వచ్చిన ఈ ఫిర్యాదుల లింకులను ట్రాక్ చేస్తూ వెళ్లిన బిజ్నోర్ పోలీసులకు చివరకు ఈ ముఠా అడ్రస్ దొరికింది.
ఈ భారీ సైబర్ మోసానికి సంబంధించి బాధితుల ఫిర్యాదు మేరకు నూర్పూర్ పోలీసులు జూలై 8వ తేదీనే నూతన భారతీయ న్యాయ సంహిత (BNS), ఐటీ యాక్ట్ (IT Act)లోని పలు కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పట్టుబడిన ఏడుగురు నిందితుల వద్ద నుంచి నేరానికి ఉపయోగించిన 11 స్మార్ట్‌ఫోన్లు, ఒక హై-ఎండ్ ల్యాప్‌టాప్, రూ. 12,300 నగదును పోలీసులు సీజ్ చేశారు. ప్రస్తుతం పోలీసులు నిందితుల బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేసే పనిలో పడ్డారు. అలాగే వారు వాడిన ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్లలోని డిజిటల్ డేటాను విశ్లేషించడానికి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు, దీని ద్వారా ఈ స్కామ్ వెనుక ఇంకా ఎంతమంది ఉన్నారనేది త్వరలోనే తేలనుంది.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹59,909
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Nothing Deals Revealed for Phone 4 Series, CMF Buds Lineup, More Ahead of Flipkart's Big Billion Days Sale