యాప్ స్టోర్ నుంచి టెలిగ్రామ్‌ను తొలగించినప్పటికీ ఇప్పటికే తమ ఐఫోన్లలో ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని ఉన్న వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది కలగడం లేదు.
Photo Credit: Pexels/Viralyft
Telegram
Telegram : కోట్లాది మంది వినియోగదారులు ఆదరిస్తున్న ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ టెలిగ్రామ్ ఐఫోన్ వినియోగదారులకు పెద్ద షాక్ ఇచ్చింది. యాపిల్ కంపెనీకి చెందిన ఐఓఎస్ యాప్ స్టోర్ నుంచి టెలిగ్రామ్ యాప్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నపళంగా మాయమైంది. ప్రపంచ వ్యాప్తంగా 1 బిలియన్ (100 కోట్లు) కంటే ఎక్కువ యాక్టివ్ వినియోగదారులు ఉన్న ఈ యాప్, ప్రస్తుతం ఏ ప్రాంతంలోనూ యాప్ స్టోర్ సెర్చింగులో కనిపించడం లేదు. డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో లేదు. అయితే ఈ అకస్మాత్తు చర్యపై యాపిల్ సంస్థ కానీ, టెలిగ్రామ్ కానీ ఎలాంటి అధికారిక ప్రకటన లేదా వివరణ విడుదల చేయకపోవడం విశేషం.
పాత యూజర్లకు పనిచేస్తోంది
యాప్ స్టోర్ నుంచి టెలిగ్రామ్‌ను తొలగించినప్పటికీ ఇప్పటికే తమ ఐఫోన్లలో ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని ఉన్న వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది కలగడం లేదు. వారు ఎప్పటిలాగే మెసేజ్‌లు పంపడం, స్వీకరించడం, పుష్ నోటిఫికేషన్‌లను అందుకోవడంలో ఎలాంటి అంతరాయం లేదని నివేదికలు చెబుతున్నాయి. ఈ తొలగింపు ప్రభావం కేవలం కొత్తగా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలనుకునే వారిపై మరియు పాత యాప్‌ను అప్‌డేట్ చేయాలనుకునే వారిపై మాత్రమే పడింది.
గతంలోనూ ఇలాగే జరిగిందా?
యాపిల్ యాప్ స్టోర్ నుంచి టెలిగ్రామ్ మాయమవ్వడం ఇది మొదటిసారేమీ కాదు. గతంలో 2018 సంవత్సరంలో కూడా వేదికపై ఉన్న కొన్ని అనుచితమైన కంటెంట్‌కు సంబంధించి టెలిగ్రామ్ ఫౌండర్ పావెల్ దురోవ్‌ను హెచ్చరించిన అనంతరం యాపిల్ ఈ యాప్‌ను తాత్కాలికంగా తొలగించింది. అయితే ఆ తర్వాత కంటెంట్ మోడరేషన్‌లో మార్పులు చేర్పులు చేయడంతో యాప్ మళ్లీ తిరిగొచ్చింది. అలాగే ఏప్రిల్ 2024లో చైనా ఇంటర్నెట్ రెగ్యులేటర్ ఆదేశాల మేరకు జాతీయ భద్రతా కారణాలను చూపుతూ చైనా యాప్ స్టోర్ నుంచి టెలిగ్రామ్, వాట్సాప్, సిగ్నల్, థ్రెడ్స్ యాప్‌లను యాపిల్ తొలగించింది.
Elon Musk : నెల రోజుల్లోనే ఎలాన్ మస్క్ ఆస్తి మటాష్.. ఏకంగా 600 బిలియన్ డాలర్ల సంపద ఆవిరి
యాపిల్ నిబంధనలు ఏం చెబుతున్నాయి?
యాపిల్ డెవలపర్ నిబంధనల ప్రకారం.. యూజర్లు తయారుచేసే కంటెంట్ ఉండే యాప్‌లు కొన్ని కఠినమైన నియమాలను తప్పనిసరిగా పాటించాలి. అనుచితమైన, అభ్యంతరకరమైన కంటెంట్‌ను ఫిల్టర్ చేసే ఆటోమేటిక్ వ్యవస్థలు, అభ్యంతరకరమైన మెసేజ్‌లను రిపోర్ట్ చేసే టూల్స్, నిబంధనలు ఉల్లంఘించే యూజర్లను బ్లాక్ చేసే సదుపాయం, సపోర్ట్ టీమ్‌ను సంప్రదించే వివరాలు యాప్‌లో ఉండటం తప్పనిసరి. ఈ నియమాలను పాటించడంలో విఫలమైతే యాప్‌ను స్టోర్ నుంచి తొలగించే హక్కు యాపిల్‌కు ఉంటుంది. అయితే ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా యాప్‌ను తీసివేయడం వెనుక అసలు సాంకేతిక లేదా నిబంధనల కారణం ఏంటనేది త్వరలోనే స్పష్టమయ్యే అవకాశముంది.
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹44,652
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Haier M70 Mini LED 65-inch
Starts from ₹74,990
CMF Buds Neo True Wireless Stereo (TWS) Earphones
Starts from ₹2,199
Xiaomi TV FX Mini LED 65
Starts from ₹64,999
iPhone 18 Pro Series’ A20 Pro Chipset Appears on Multiple Benchmarking Platforms Showing Performance Gains