Cab Rules : ఓలా, ఉబర్, రాపిడోలకు కొత్త రూల్స్..ఇకపై మగవారితో కలిపి ప్రయాణించే పనిలేకుండా కొత్త ఆప్షన్

క్యాబ్ పూలింగ్ లేదా రైడ్ షేరింగ్ సేవల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన నిబంధనలు విధించింది.

Cab Rules : ఓలా, ఉబర్, రాపిడోలకు కొత్త రూల్స్..ఇకపై మగవారితో కలిపి ప్రయాణించే పనిలేకుండా కొత్త ఆప్షన్

Photo Credit: Unsplash

Ola, Uber, Rapido

ముఖ్యాంశాలు
  • క్యాబ్ ప్రయాణాల్లో మహిళల భద్రతకు మహారాష్ట్ర కీలక నిర్ణయం
  • ఓలా, ఉబర్, రాపిడోలకు కొత్త రూల్స్
  • మహిళలకు మాత్రమే ప్రత్యేక రైడ్ పూలింగ్ ఆప్షన్
ప్రకటన

Cab Rules : ఓలా, ఉబర్, రాపిడో వంటి క్యాబ్ బుకింగ్ సేవలను వినియోగించుకునే మహిళా ప్రయాణికుల భద్రతను పెంపొందించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఒక విప్లవాత్మకమైన అగ్రిగేటర్ పాలసీని అందుబాటులోకి తెచ్చింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం.. మహిళా ప్రయాణికులకు క్యాబ్‌లలో కేవలం ఇతర మహిళా ప్రయాణికులతో మాత్రమే ప్రయాణించే (ఫిమేల్ ఓన్లీ షేరింగ్) ఆప్షన్ ఎంచుకునే వెసులుబాటు లభిస్తుంది. దీనివల్ల మహిళలు పురుష ప్రయాణికులతో కలిసి ప్రయాణించాల్సిన నిర్బంధం తప్పడమే కాకుండా, వారి రక్షణ, సౌకర్యానికి మరింత భరోసా లభిస్తుంది.

రైడ్ పూలింగ్‌కు కేవైసీ తప్పనిసరి, రూట్ నిబంధనలు
క్యాబ్ పూలింగ్ లేదా రైడ్ షేరింగ్ సేవల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన నిబంధనలు విధించింది. కొత్త నిబంధనల ప్రకారం.. తమ కేవైసీ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న ప్రయాణికులకు మాత్రమే రైడ్ పూలింగ్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. కేవైసీ పూర్తికాని వినియోగదారులకు కార్ పూలింగ్ ఆప్షన్ లభించదు. అంతేకాకుండా ఒకే మార్గంలో ప్రయాణించే ప్రయాణికులకు మాత్రమే షేరింగ్ వీలవుతుంది. అయితే ప్రయాణికుల పికప్ లేదా డ్రాప్ స్టాపేజీలు వేర్వేరుగా ఉండవచ్చు. ప్రయాణ సమయంలో రూట్ మార్చేందుకు డ్రైవర్లకు వీలుండదు. ముందే యాప్‌లో నమోదు చేసిన లొకేషన్ల ఆధారంగా మాత్రమే వాహనం వెళ్లాల్సి ఉంటుంది. రూట్ మార్చాల్సి వస్తే, ఆ రైడ్‌ను మొదట బుక్ చేసిన ప్రయాణికుడితో పాటు మిగిలిన అందరి సమ్మతి తప్పనిసరి.

రైడ్ క్యాన్సిలేషన్‌పై భారీ జరిమానాలు
షేరింగ్, సాధారణ క్యాబ్ సేవల్లో రైడ్ క్యాన్సిలేషన్ల వల్ల కస్టమర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను నివారించేందుకు ప్రభుత్వం కఠినమైన ఫైన్లు ప్రకటించింది:
డ్రైవర్ల నిర్లక్ష్యానికి ఫైన్: క్యాబ్ బుక్ అయిన తర్వాత డ్రైవర్ నిర్ణీత సమయం కంటే 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా లేదా రైడ్ క్యాన్సిల్ చేసినా డ్రైవర్‌పై రూ.100 జరిమానా విధిస్తారు.

Vivo X300 Pro : వివో ఫ్లాగ్‌షిప్ ఫోన్‌పై ధమాకా ఆఫర్.. వివో X300 ప్రోపై ఏకంగా రూ.10,000 డిస్కౌంట్

ఎయిర్‌పోర్ట్, ఆసుపత్రుల రూట్లలో 5 రెట్ల ఫైన్: విమానాశ్రయం, రైల్వే స్టేషన్, ఆసుపత్రులకు వెళ్లే అత్యవసర రైడ్‌లను డ్రైవర్ క్యాన్సిల్ చేస్తే, సాధారణ జరిమానా కంటే 5 రెట్లు అంటే ఏకంగా రూ.500 వరకు ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది.
కస్టమర్లకు కూడా వర్తింపు: ఎలాంటి సరైన కారణం లేకుండా ప్రయాణికులు రైడ్‌ను రద్దు చేస్తే, మొత్తం ఛార్జీలో 5 శాతం లేదా గరిష్టంగా రూ.100 జరిమానా పడుతుంది. ఈ మొత్తాన్ని నష్టపోయిన సదరు డ్రైవర్‌కు పరిహారంగా జమ చేస్తారు.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »