Reany N1 GT Electric Bike Launched with 100KM Range: సాధారణ ఎలక్ట్రిక్ బైకులతో పోలిస్తే ఈ రియానీ ఎన్1 జీటీ మోడల్లో ఒక విభిన్నమైన టెక్నాలజీని ఉపయోగించారు
Photo Credit: Reany
Reany N1 GT
Reany N1 GT Electric Bike launched with 100KM range: ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో రోజురోజుకూ సరికొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఈవీ తయారీ సంస్థ రియానీ అర్బన్ రైడర్లను టార్గెట్ చేస్తూ సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ రియానీ ఎన్1 జీటీను మార్కెట్లోకి విడుదల చేసింది. చాలా స్లిమ్ అండ్ స్లీక్ డిజైన్‌తో, చూడ్డానికి ఎంతో స్టైలిష్‌గా ఉండేలా దీని రూపురేఖలను తీర్చిదిద్దారు. హెవీ డిజైన్ ఎలిమెంట్స్ ఏమీ లేకుండా, చాలా తేలికపాటి క్లాసిక్ లుక్‌తో ఈ ఈ-బైక్ మన ముందుకు వచ్చింది. నగరాల్లో నివసించే ఆఫీస్ ఉద్యోగులు, విద్యార్థులు రోజువారీ ప్రయాణాలు సులభంగా సాగించడం కోసం కంపెనీ దీనిని ప్రత్యేకంగా డిజైన్ చేసింది.
సాధారణ ఎలక్ట్రిక్ బైకులతో పోలిస్తే ఈ రియానీ ఎన్1 జీటీ మోడల్లో ఒక విభిన్నమైన టెక్నాలజీని ఉపయోగించారు. ఇందులో సాధారణ ఇనుప చైన్‌కు బదులుగా అత్యంత మన్నికైన గేట్స్ కార్బన్ బెల్ట్ డ్రైవ్ సిస్టమ్‌ను అమర్చారు. దీనివల్ల చైన్ తుప్పు పట్టడం, లూజ్ అవ్వడం లేదా తరచూ ఆయిల్ వేయాల్సిన అవసరం ఉండదు. అంటే దీని మెయింటెనెన్స్ ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్‌లో ఎటువంటి సంక్లిష్టమైన గేర్ సిస్టమ్ లేదు. ఇది సింగిల్ స్పీడ్ మెకానిజంతో నడుస్తుంది. అందువల్ల ఎలాంటి గందరగోళం లేకుండా కేవలం యాక్సిలరేటర్ ఇస్తూ బైక్‌ను హ్యాపీగా నడుపుకోవచ్చు.
టెక్నికల్ స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. ఈ అర్బన్ ఎలక్ట్రిక్ బైక్‌లో శక్తివంతమైన 360Wh బ్యాటరీని అమర్చారు. ఈ బ్యాటరీని బైక్ నుంచి చాలా ఈజీగా విడదీయవచ్చు (రిమూవబుల్ బ్యాటరీ). దీనివల్ల అపార్ట్మెంట్లలో ఉండేవారు బ్యాటరీని సులభంగా ఇంటికి తీసుకెళ్లి చార్జ్ చేసుకోవచ్చు. ఇందులో ఉపయోగించిన మివైస్ ఎమ్080 హబ్ మోటార్ 250W పవర్, 45Nm గరిష్ట టాక్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఒక్కసారి పూర్తిగా చార్జ్ చేస్తే ఈ బైక్ గరిష్టంగా 100 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. ముఖ్యంగా ఎత్తైన కొండ ప్రాంతాలు లేదా ఫ్లైఓవర్ల పైకి ఎక్కేటప్పుడు ఈ మోటార్ రైడర్‌కు అదనపు సపోర్టును అందిస్తుంది.
OnePlus : మధ్యతరగతి బడ్జెట్లో వన్‌ప్లస్ కొత్త సిరీస్ ఫోన్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే
రైడర్ల సేఫ్టీ కోసం ఇందులో ప్రముఖ బ్రాండ్ టెక్ట్రోకు చెందిన పవర్ఫుల్ హైడ్రాలిక్ డిస్క్ బ్రేకులను అమర్చారు. దీనివల్ల అత్యవసర సమయాల్లో బ్రేక్ వేసినా బైక్ స్కిడ్ అవ్వకుండా వెంటనే ఆగిపోతుంది. రోజువారీ అవసరాలకు తగ్గట్లుగా రాత్రి వేళల్లో ప్రయాణించడానికి ప్రకాశవంతమైన ఎల్ఈడీ లైటింగ్ సిస్టమ్, బురద చింది పడకుండా ఉండేందుకు వీలుగా చక్కని ఫెండర్లను జత చేశారు. ఈ ఎలక్ట్రిక్ బైక్ బరువు కేవలం 19.7 కిలోగ్రాములు మాత్రమే. కనెక్టివిటీ కోసం ఇందులో బ్లూటూత్ 4.0 సపోర్ట్ ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా ఈ బైక్ కండిషన్‌ను ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకోవచ్చు.
ప్రస్తుతానికి ఈ సరికొత్త ఎలక్ట్రిక్ బైక్‌ను కంపెనీ యూరోపియన్ దేశాల్లో మాత్రమే ప్రవేశపెట్టింది. అక్కడ దీని ధరను 2,599 యూరోలుగా నిర్ణయించారు. దీనిని మన భారత కరెన్సీలోకి మార్చి లెక్కిస్తే దాదాపు రూ. 2,85,000 వరకు ఉంటుంది. ఇది లైట్ బ్లూ, బ్లాక్, డార్క్ బ్లూ అనే మూడు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ప్రస్తుతం ఈ మోడల్ యూరప్‌లోని రియానీ అధికారిక వెబ్సైట్లో బుకింగ్స్, అమ్మకాలకు అందుబాటులో ఉంది.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Cyberpunk 2077 Gets New Quests, Gameplay Features and Mod Support With Edgerunners 2 Update