మే 8వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ మెగా అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2026లో ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, మైక్రోవేవ్ ఓవెన్లపై ఆఫర్లు ఉన్నాయి
Amazon Great Summer Sale 2026: ఎండలు మండిపోతున్న వేళ కస్టమర్లకు చల్లని వార్త చెబుతూ అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2026 సిద్ధమైంది. మే 8వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ మెగా సేల్‌లో హోమ్ అప్లయన్సెస్‌పై అదిరిపోయే ఆఫర్లను అమెజాన్ ప్రకటించింది. ముఖ్యంగా ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, మైక్రోవేవ్ ఓవెన్లపై కళ్లు చెదిరే తగ్గింపులు ఉండనున్నాయి. కేవలం ధర తగ్గింపు మాత్రమే కాకుండా బ్యాంక్ ఆఫర్లు, నో-కాస్ట్ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉండటంతో కొత్త వస్తువులు కొనాలనుకునే వారికి ఇది మంచి అవకాశం.
ఈ సేల్‌లో రిఫ్రిజిరేటర్లపై భారీగా ధరలు తగ్గాయి. ముఖ్యంగా పెద్ద ఫ్యామిలీల కోసం ఉపయోగపడే 653 లీటర్ల శాంసంగ్ స్మార్ట్ రిఫ్రిజిరేటర్ అసలు ధర రూ.1,21,000 ఉండగా, సేల్‌లో కేవలం రూ.79,990కే లభించనుంది. అలాగే హైయర్ 602 లీటర్ల మోడల్ రూ.1,09,390 నుంచి ఏకంగా రూ.60,990కి పడిపోయింది. అంటే దాదాపు రూ.48 వేల వరకు ఆదా చేసుకోవచ్చు. డబుల్ డోర్, సైడ్ బై సైడ్ ఫ్రిజ్‌ల కోసం ఎదురుచూసే వారికి ఇదే బెస్ట్ టైమ్.
వేసవి తాపం నుంచి ఉపశమనం పొందాలనుకునే వారి కోసం ఏసీలపై కూడా అమెజాన్ భారీ డిస్కౌంట్లు ఇస్తోంది. పానాసోనిక్ 1.5 టన్ 5 స్టార్ ఏసీ రూ.44,990కే లభించనుండగా, డైకిన్ 1.5 టన్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ కేవలం రూ.36,990కే అందుబాటులోకి రానుంది. వాషింగ్ మెషీన్ల విషయానికి వస్తే, బాష్ 9 కేజీల ఫ్రంట్ లోడ్ మెషీన్ రూ.60,990 నుంచి రూ.32,990కి తగ్గింది. దాదాపు సగం ధరకే బ్రాండెడ్ వాషింగ్ మెషీన్ సొంతం చేసుకోవచ్చు. ఎలికా వంటి కిచెన్ చిమ్నీలపై కూడా 50 శాతానికి పైగా తగ్గింపు ఉంది.
| Product Name | List Price | Effective Sale Price | Buying Link |
|---|---|---|---|
| Samsung 653L, 3 Star, Smart Refrigerator (RS76CG8003B1HL) | Rs. 1,21,000 | Rs. 79,990 | Buy Now |
| Haier 602L 3Star Refrigerator (HRS-682KS) | Rs. 1,09,390 | Rs. 60,990 | Buy Now |
| Bosch 9 kg 5 Star Front-Load Fully-Automatic Washing Machine | Rs. 60,990 | Rs. 32,990 | Buy Now |
| LG Smart Choice, 9Kg, Fully-Automatic Front Load Washing Machine (FHP1209Z5M) | Rs. 53,990 | Rs. 40,990 | Buy Now |
| Panasonic 1.5 Ton 5 Star Split AC (CU-NU18BKY5WX) | Rs. 63,500 | Rs. 44,990 | Buy Now |
| Daikin 1.5 Ton 3 Star, Inverter Split AC (MTKL50XV16) | Rs. 56,100 | Rs. 36,990 | Buy Now |
| Panasonic 20L Solo Microwave Oven (NN-ST26JMFDG) | Rs. 7,490 | Rs. 6,850 | Buy Now |
| Elica 60cm 1500 m3/hr BLDC Filterless Autoclean Kitchen Chimney | Rs. 28,990 | Rs. 13,490 | Buy Now |
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్‌లో ధరల తగ్గింపుతో పాటు అదనపు డిస్కౌంట్లు కూడా ఉన్నాయి. హెచ్‌డిఎఫ్‌సి క్రెడిట్ కార్డులు లేదా ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ వాడే వారికి క్యాష్‌బ్యాక్ ఆఫర్లు ఉంటాయి. అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు సేల్ ఒకరోజు ముందే ప్రారంభం కావడమే కాకుండా అదనపు కూపన్ డిస్కౌంట్లు కూడా లభిస్తాయి. పాత వస్తువులను మార్చుకోవాలనుకునే వారికి ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా ప్రకటించారు.
ప్రకటన
ప్రకటన
Google's Android Show I/O Edition: How to Watch Livestream, What to Expect
Shift Up Says It Will Self-Publish Stellar Blade 2 to Reach Broad Audience From Day One
India’s Smartphone Market Declined by 4.1 Percent in the First Quarter Amidst Low Consumer Demand, RAM Shortage: IDC