CMF Watch 3 Proను ఇప్పుడు ఇండియాలో లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది.
Nothing CMF Watch 3 Pro : టెక్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నథింగ్ సబ్‌బ్రాండ్ CMF, ఇప్పుడు మరో సంచలనానికి సిద్ధమైంది. గతేడాది గ్లోబల్ మార్కెట్‌లో విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న CMF Watch 3 Proను ఇప్పుడు ఇండియాలో లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. కేవలం రెండు రోజుల్లో, అంటే మే 6వ తేదీన ఈ వాచ్ భారత మార్కెట్లోకి అడుగుపెట్టబోతోంది. స్టైలిష్ లుక్, అదిరిపోయే బ్యాటరీ బ్యాకప్‌తో రాబోతున్న ఈ వాచ్ ఇప్పుడు టెక్ ప్రియుల్లో ఆసక్తిని రేపుతోంది.
ఈ కొత్త స్మార్ట్‌వాచ్ డిజైన్ విషయంలో CMF ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ఇది రౌండ్ మెటల్ డయల్‌తో చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. ఇందులో 1.43-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను అమర్చారు. 60Hz రిఫ్రెష్ రేట్, 670 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో ఎండలో కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. గ్లోబల్ వేరియంట్ లాగే ఇది కూడా డార్క్ గ్రే, లైట్ గ్రే, ఆరెంజ్ కలర్ ఆప్షన్లలో లభించే అవకాశం ఉంది.
రన్నింగ్ చేసే వారికి ఈ వాచ్ ఒక పర్ఫెక్ట్ పార్టనర్ అని చెప్పవచ్చు. ఇందులో AI-పవర్డ్ రన్నింగ్ కోచ్‌ను అందించారు. అలాగే ఖచ్చితమైన లొకేషన్ ట్రాకింగ్ కోసం డ్యూయల్-బ్యాండ్ మల్టీ-సిస్టమ్ జీపీఎస్‌ను కూడా చేర్చారు. సుమారు 120కి పైగా వాచ్ ఫేస్‌లు, కస్టమైజ్ చేసుకునే ఆప్షన్లు ఇందులో ఉండటం విశేషం. ఫిట్‌నెస్ ఫ్రీక్స్ కోసం హార్ట్ రేట్ మానిటరింగ్, స్లీప్ ట్రాకింగ్, SpO2 (బ్లడ్ ఆక్సిజన్) మానిటరింగ్, స్ట్రెస్ లెవల్ ట్రాకింగ్ వంటి అడ్వాన్స్‌డ్ హెల్త్ ఫీచర్లు కూడా ఉన్నాయి.
స్మార్ట్‌వాచ్ యూజర్లు ప్రధానంగా కోరుకునేది మంచి బ్యాటరీ లైఫ్. ఈ విషయంలో CMF వాచ్ 3 ప్రో ఎక్కడా తగ్గదు. ఇందులో 350mAh బ్యాటరీని అమర్చారు. సాధారణ వాడకంలో ఇది 13 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ ఇస్తుందని కంపెనీ క్లెయిమ్ చేస్తోంది. ఒకవేళ హెవీగా వాడితే 10 రోజులు, ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే (AOD) ఫీచర్ ఆన్ చేసి ఉంచితే 4 రోజుల పాటు ఛార్జింగ్ వస్తుంది. అలాగే దీనికి IP68 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ కూడా ఉంది.
గ్లోబల్ మార్కెట్‌లో ఈ వాచ్ ధర సుమారు 99 యూరోలు (మన కరెన్సీలో దాదాపు రూ.11,000)గా ఉంది. అయితే భారత మార్కెట్‌లో దీని ధర రూ.8,000 నుంచి రూ.10,000 మధ్య ఉండవచ్చని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మే 6న జరిగే లాంచ్ ఈవెంట్‌లో పూర్తి ధర, సేల్ వివరాలు వెల్లడి కానున్నాయి. అదిరిపోయే లుక్, అదిరిపోయే ఫీచర్లు కావాలనుకునే వారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.
ప్రకటన
ప్రకటన
GTA 6 Third Trailer Rumours Gather Steam After Sony Asks PS4 Users to Upgrade to PS5 Ahead of Launch
Samsung Launches Certified Re-Newed Programme in India; Offers Refurbished Galaxy S25, Galaxy A56 Models