Flipkart Summer Sale 2026 : ఐఫోన్ లవర్లకు పండగే పండగ.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భారీగా తగ్గిన ఐఫోన్ 17 ధరలు

ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తన సమ్మర్ సేల్‌ను మే 9 నుంచి ప్రారంభం అవ్వగా దీంట్లో ఐఫోన్ 17తో పాటు ఐఫోన్ 16 సిరీస్‌పై తక్కువ ధరలను ప్రకటించింది.

Flipkart Summer Sale 2026 : ఐఫోన్ లవర్లకు పండగే పండగ.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భారీగా తగ్గిన ఐఫోన్ 17 ధరలు

ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భారీగా తగ్గిన ఐఫోన్ 17 ధరలు

ముఖ్యాంశాలు
  • ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తన సమ్మర్ సేల్‌ను మే 9 నుంచి ప్రార
  • ఐఫోన్ 17 ప్రో లేదా ఐఫోన్ 17 ప్రో మాక్స్‌పై దాదాపు రూ.25 వేల వరకు భారీ తగ్
  • ఐఫోన్ 16e అనే లేటెస్ట్ బడ్జెట్ ఫోన్ కూడా రూ.55,900కే విక్రయానికి సిద్ధంగా
ప్రకటన

Flipkart Summer Sale 2026: ఐఫోన్ ప్రేమికులకు కిక్కిచ్చే న్యూస్ తీసుకొచ్చాము. తక్కువ ధరలో ఐ ఫోన్ కొనాలి అనుకుంటే మాత్రం ఇంత మంచి అవకాశం అయితే ఉండదనే చెప్పాలి. సొంతంగా ఒక ఐఫోన్ కొనుక్కోవాలని కలలు కనే వారికి అదిరిపోయే గుడ్ న్యూస్. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తన సమ్మర్ సేల్‌ను మే 9 నుంచి ప్రారంభించింది. ఈ సేల్‌లో భాగంగా ఆపిల్ లేటెస్ట్ మోడల్ అయిన ఐఫోన్ 17తో పాటు ఐఫోన్ 16 సిరీస్‌పై ఎన్నడూ లేనంత తక్కువ ధరలను ప్రకటించింది. ప్లస్ మెంబర్‌షిప్ ఉన్న వారికి 24 గంటల ముందే ఈ ఆఫర్లు అందుబాటులోకి వచ్చేశాయి.

ఐఫోన్ 17పై భారీ డిస్కౌంట్

గతేడాది సెప్టెంబర్‌లో లాంచ్ అయిన ఐఫోన్ 17 (256GB) ధర ప్రస్తుతం మార్కెట్లో రూ.82,900గా ఉంది. అయితే ఫ్లిప్‌కార్ట్ సమ్మర్ సేల్‌లో దీనిని కేవలం రూ.71,999కే సొంతం చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లు కలిపి ఈ ధరకు లభిస్తుందని తెలుస్తోంది. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్, మెరుగైన కెమెరా క్వాలిటీ కోరుకునే వారికి ఇది బెస్ట్ డీల్ అని చెప్పవచ్చు.

ప్రో మోడల్స్ కొనేవారికి జాక్‌పాట్

మీరు ఒకవేళ ప్రీమియం ఫ్లాగ్‌షిప్ మోడల్స్ అయిన ఐఫోన్ 17 ప్రో లేదా ఐఫోన్ 17 ప్రో మాక్స్‌పై కన్నేసినట్లయితే, ఇదే సరైన సమయం. రూ.1,34,900 ధర ఉన్న ఐఫోన్ 17 ప్రో ఇప్పుడు రూ.1,09,900కే అందుబాటులోకి రానుంది. అలాగే టాప్ ఎండ్ మోడల్ ఐఫోన్ 17 ప్రో మాక్స్‌ను రూ.1,49,900 నుంచి రూ.1,24,900కే కొనుగోలు చేయవచ్చు. అంటే దాదాపు రూ.25 వేల వరకు భారీ తగ్గింపు లభిస్తోంది.

ఐఫోన్ ఎయిర్, ఇతర మోడల్స్

ఆపిల్ నుంచి అత్యంత పలచని ఫోన్‌గా పేరు తెచ్చుకున్న ఐఫోన్ ఎయిర్ ధర కూడా గణనీయంగా తగ్గింది. సాధారణంగా రూ.1,19,900 పలికే ఈ ఫోన్, సేల్‌లో రూ.95,900కే లభించనుంది. అలాగే బడ్జెట్ ఐఫోన్ కోరుకునే వారి కోసం ఐఫోన్ 17e మోడల్‌ను రూ.60,900కే ఆఫర్ చేస్తున్నారు. స్టైలిష్ లుక్, లైట్ వెయిట్ కావాలనుకునే వారు ఐఫోన్ ఎయిర్‌ను ఎంచుకోవచ్చు.

ఐఫోన్ 16, 15లపై అదిరిపోయే ఆఫర్లు

కొత్త ఫోన్లే కాకుండా గతేడాది మోడల్స్ అయిన ఐఫోన్ 16 ధర రూ.58,900కు పడిపోయింది. ఐఫోన్ 16 ప్లస్ రూ.73,900కే లభిస్తోంది. ఇంకా తక్కువ ధరలో కావాలనుకుంటే ఐఫోన్ 15 రూ.51,900కే దొరుకుతుంది. ఐఫోన్ 16e అనే లేటెస్ట్ బడ్జెట్ ఫోన్ కూడా రూ.55,900కే విక్రయానికి సిద్ధంగా ఉంది. నచ్చిన మోడల్‌ను ఎంచుకోవడానికి ఫ్లిప్‌కార్ట్ సమ్మర్ సేల్ ఒక మంచి వేదిక కానుంది.

#తాజా కథనాలు
  1. Nothing CMF Watch 3 Pro : నథింగ్ నుంచి మరో క్రేజీ స్మార్ట్‌వాచ్..ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే
  2. ChatGPT : ఓపెన్ ఏఐపై క్రిమినల్ ఎంక్వయిరీ.. షూటింగ్‌కు ప్లాన్ వేయడానికి ChatGPT సాయం చేసిందా..?
  3. iPhone 18 Pro: శామ్సంగ్ & ఇతరేతర కంపెనీలకు పెద్ద దెబ్బేసిన యాపిల్
  4. Flipkart Summer Sale 2026 : ఐఫోన్ లవర్లకు పండగే పండగ.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భారీగా తగ్గిన ఐఫోన్ 17 ధరలు
  5. Amazon Great Summer Sale 2026 : అమెజాన్ సమ్మర్ సేల్.. రూ.1.30 లక్షల ఫోన్ ఇప్పుడు కేవలం రూ.95 వేలకే
  6. Amazon Great Summer Sale 2026 : అమెజాన్ సమ్మర్ సేల్ ధమాకా.. స్మార్ట్ టీవీలపై కళ్లు చెదిరే ఆఫర్లు
  7. Biggest E commerce platform Amazon announced Great Summer Sale check the Sale date bank offers and deal
  8. Apple Could Launch These New Devices Once John Ternus Takes Over
  9. Xiaomi 17T Key Specifications Revealed Via Benchmarking Site
  10. Vivo X500 Pro Max Tipped to Feature 200-Megapixel Periscope Telephoto Lens
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »