iPhone 18 Pro: శామ్సంగ్ & ఇతరేతర కంపెనీలకు పెద్ద దెబ్బేసిన యాపిల్

యాపిల్ కంపెనీ తన నెక్ట్స్ జనరేషన్ స్మార్ట్‌ఫోన్  ఐఫోన్ 18 ప్రో సిరీస్‌ను అత్యంత దూకుడుగా మార్కెట్లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది.

iPhone 18 Pro: శామ్సంగ్ & ఇతరేతర కంపెనీలకు పెద్ద దెబ్బేసిన యాపిల్
ముఖ్యాంశాలు
  • ఐఫోన్ 18 ప్రో, ప్రో మాక్స్ ధరలు ఐఫోన్ 17 సిరీస్ ధరలతో సమానంగా ఉండవచ్చు
  • ఐఫోన్ 17 ప్రో మోడల్స్ భారత్‌లో రూ.1,34,900 ప్రారంభ ధరతో అందుబాటులోకి వచ్చ
  • ఐఫోన్ 18 సిరీస్‌లో ఏఐ ఫీచర్లపై ఎక్కువ దృష్టి పెట్టవచ్చని సమాచారం
ప్రకటన

iPhone 18 Pro : యాపిల్ కంపెనీ తన నెక్ట్స్ జనరేషన్ స్మార్ట్‌ఫోన్  ఐఫోన్ 18 ప్రో సిరీస్‌ను అత్యంత దూకుడుగా మార్కెట్లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మెమరీ చిప్స్, ఇతర విడిభాగాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నప్పటికీ, యాపిల్ మాత్రం ధరలను నియంత్రణలో ఉంచాలని భావిస్తోంది. ప్రముఖ మార్కెట్ అనలిస్ట్ జెఫ్ పు సమాచారం ప్రకారం.. ఐఫోన్ 18 ప్రో, ప్రో మాక్స్ మోడళ్ల ధరలు వాటి పాత మోడల్స్ (ఐఫోన్ 17 సిరీస్) ధరలతో సమానంగా ఉండవచ్చు లేదా స్వల్ప మార్పులతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దీనివల్ల ప్రీమియం ఆండ్రాయిడ్ ఫోన్ల మార్కెట్‌కు భారీ ముప్పు పొంచి ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

గతేడాది సెప్టెంబర్‌లో విడుదలైన ఐఫోన్ 17 ప్రో మోడల్స్ భారత్‌లో రూ.1,34,900 ప్రారంభ ధరతో అందుబాటులోకి వచ్చాయి. ప్రో మాక్స్ మోడల్ రూ.1,49,900 నుంచి మొదలైంది. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం పెరగడం వల్ల ర్యామ్, స్టోరేజ్ చిప్స్ కొరత ఏర్పడి ధరలు పెరిగాయి. దీనివల్ల చాలా కంపెనీలు తమ ఫోన్ల ధరలను భారీగా పెంచాయి. కానీ, యాపిల్ ముందస్తుగానే పెద్ద మొత్తంలో విడిభాగాలను కొనుగోలు చేయడం వల్ల, పెరిగిన ధరల భారాన్ని కస్టమర్లపై వేయకుండా తానే భరించే స్థితిలో ఉందని తెలుస్తోంది. దీనివల్ల రాబోయే ఐఫోన్ 18 సిరీస్ ధరలు అందరికీ అందుబాటులో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.

టెక్నికల్ పరంగా చూస్తే, ఐఫోన్ 18 ప్రో మోడల్స్‌లో మెరుగైన కెమెరా సెటప్, కొత్త ఏ-సిరీస్ చిప్‌సెట్‌ను వాడనున్నారు. అయితే ధరల విషయంలో మాత్రం యాపిల్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించనుంది. ప్రీమియం ఆండ్రాయిడ్ ఫోన్ల ధరలు కూడా ఇప్పుడు రూ.1.20 లక్షల నుంచి రూ.1.50 లక్షల మధ్యలో ఉన్నాయి. ఇప్పుడు ఐఫోన్ కూడా అదే ధరకే వస్తే, చాలామంది కస్టమర్లు ఆండ్రాయిడ్ వైపు కాకుండా ఐఫోన్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. దీనివల్ల శామ్సంగ్ వంటి దిగ్గజ కంపెనీల మార్కెట్ వాటా తగ్గే ప్రమాదం ఉందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

యాపిల్ వ్యూహం ప్రకారం.. ఐఫోన్ 18 సిరీస్‌లో హార్డ్‌వేర్ అప్‌గ్రేడ్స్ కంటే సాఫ్ట్‌వేర్, ఏఐ ఫీచర్లపై ఎక్కువ దృష్టి పెట్టవచ్చని సమాచారం. తయారీ ఖర్చులను తగ్గించుకోవడానికి కొన్ని మార్పులు చేసినా, యూజర్ ఎక్స్‌పీరియన్స్ విషయంలో మాత్రం ఎక్కడా తగ్గకూడదని టిమ్ కుక్ బృందం గట్టిగా నిర్ణయించుకుంది. మొత్తంమీద ఈ ఏడాది చివర్లో రాబోయే ఐఫోన్ 18 ప్రో సిరీస్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఒక పెను సంచలనాన్ని సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

#తాజా కథనాలు
  1. Nothing CMF Watch 3 Pro : నథింగ్ నుంచి మరో క్రేజీ స్మార్ట్‌వాచ్..ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే
  2. ChatGPT : ఓపెన్ ఏఐపై క్రిమినల్ ఎంక్వయిరీ.. షూటింగ్‌కు ప్లాన్ వేయడానికి ChatGPT సాయం చేసిందా..?
  3. iPhone 18 Pro: శామ్సంగ్ & ఇతరేతర కంపెనీలకు పెద్ద దెబ్బేసిన యాపిల్
  4. Flipkart Summer Sale 2026 : ఐఫోన్ లవర్లకు పండగే పండగ.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భారీగా తగ్గిన ఐఫోన్ 17 ధరలు
  5. Amazon Great Summer Sale 2026 : అమెజాన్ సమ్మర్ సేల్.. రూ.1.30 లక్షల ఫోన్ ఇప్పుడు కేవలం రూ.95 వేలకే
  6. Amazon Great Summer Sale 2026 : అమెజాన్ సమ్మర్ సేల్ ధమాకా.. స్మార్ట్ టీవీలపై కళ్లు చెదిరే ఆఫర్లు
  7. Biggest E commerce platform Amazon announced Great Summer Sale check the Sale date bank offers and deal
  8. Apple Could Launch These New Devices Once John Ternus Takes Over
  9. Xiaomi 17T Key Specifications Revealed Via Benchmarking Site
  10. Vivo X500 Pro Max Tipped to Feature 200-Megapixel Periscope Telephoto Lens
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »