నిందితుడు ఒక గ్లాక్ పిస్టల్ ఫోటోను అప్‌లోడ్ చేయగా, దానిని ఎలా పేల్చాలో ChatGPT వివరించినట్లు సమాచారం.
ChatGPT : టెక్నాలజీ మనిషికి సాయం చేయాలి కానీ, ప్రాణాలు తీయడానికి మార్గం చూపకూడదు. కానీ అమెరికాలోని ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీలో గత ఏడాది జరిగిన ఘోర కాల్పుల ఘటనలో ఇప్పుడు ఒక దిగ్భ్రాంతికర విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుడు ఫీనిక్స్ ఇక్నర్, కాల్పులకు ముందు ChatGPTతో చాట్ చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో నిందితుడికి చాట్‌బాట్ కీలక సమాచారాన్ని అందించిందని వార్తలు రావడంతో, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భద్రతపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.
ది వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం.. నిందితుడు కాల్పులు జరపడానికి కేవలం నాలుగు నిమిషాల ముందు ChatGPTని ఒక వింత ప్రశ్న అడిగాడు. జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించాలంటే నేను ఎంతమంది నా తోటి విద్యార్థులను చంపాలి? అని అడగ్గా, చాట్‌బాట్ ఆ ప్రశ్నను నిరోధించాల్సింది పోయి, సాధారణంగా ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది చనిపోతే (షూటర్‌ను కాకుండా) దానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుంది అని సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సమాధానం విన్న దర్యాప్తు అధికారులు సైతం విస్తుపోతున్నారు.
కేవలం ప్రశ్నలకు సమాధానం ఇవ్వడమే కాకుండా, తుపాకులను ఎలా వాడాలో కూడా చాట్‌బాట్ అతనికి వివరించిందని ఆరోపణలు వస్తున్నాయి. నిందితుడు ఒక గ్లాక్ పిస్టల్ ఫోటోను అప్‌లోడ్ చేయగా, దానిని ఎలా పేల్చాలో ChatGPT వివరించినట్లు సమాచారం. అలాగే రెమింగ్టన్ 12-గేజ్ షాట్‌గన్ వాడకంపై కూడా అతను సందేహాలు అడిగినట్లు ట్రాన్స్‌క్రిప్ట్స్ వెల్లడిస్తున్నాయి. ఈ చాటింగ్ జరిగిన కొద్దిసేపటికే అతను వర్సిటీలో కాల్పులు జరిపి ఇద్దరిని చంపగా, మరో ఆరుగురు గాయపడ్డారు.
నిందితుడు కాల్పులకు ముందు తాను తీవ్రమైన డిప్రెషన్‌లో ఉన్నానని, ఆత్మహత్య ఆలోచనలు వస్తున్నాయని కూడా ChatGPTతో చెప్పినట్లు సమాచారం. సాధారణంగా ఇలాంటి సున్నితమైన విషయాలను చాట్‌బాట్లు గుర్తించి అధికారులకు సమాచారం ఇవ్వాలి లేదా యూజర్‌కు హెల్ప్ లైన్ నంబర్లు సూచించాలి. కానీ, నిందితుడి విషయంలో అవేమీ జరగలేదని, కనీసం ఆ చాటింగ్‌ను ఫ్లాగ్ కూడా చేయలేదని రిపోర్టులు చెబుతున్నాయి. దీనిపై ఓపెన్ ఏఐ స్పందిస్తూ.. నిందితుడి చర్యలకు తాము బాధ్యులం కాదని, ఘటన తర్వాత అధికారులకు పూర్తి సహకారం అందించామని తెలిపింది.
ఈ ఘటనపై ఫ్లోరిడా అటార్నీ జనరల్ జేమ్స్ ఉత్మీర్ గత ఏప్రిల్‌లోనే క్రిమినల్ ఇన్వెస్టిగేషన్‌కు ఆదేశించారు. ఒక దారుణమైన నేరంలో చాట్‌బాట్ పాత్ర ఎంతవరకు ఉంది? దీనికి ఓపెన్ ఏఐ బాధ్యత వహించాల్సి ఉంటుందా? అనే కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నారు. టెక్నాలజీ సంస్థలు తమ ఏఐ మోడల్స్ నేరాలకు ఉపయోగపడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాయనే దానిపై ఇప్పుడు సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. అక్టోబర్ 19న జరగబోయే తదుపరి విచారణలో మరిన్ని కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.
ప్రకటన
ప్రకటన
GTA 6 Third Trailer Rumours Gather Steam After Sony Asks PS4 Users to Upgrade to PS5 Ahead of Launch
Samsung Launches Certified Re-Newed Programme in India; Offers Refurbished Galaxy S25, Galaxy A56 Models