చదువుకోవడానికి ఎంతో ఉపయోగపడే ఐప్యాడ్‌లు, మ్యాక్‌బుక్‌లను చాలా తక్కువ ధరకే సొంతం చేసుకునేందుకు యాపిల్ ఈ సువర్ణావకాశాన్ని కల్పించింది.
Apple
Apple : ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం యాపిల్ భారతీయ మార్కెట్లో తన మోస్ట్ పాపులర్ వార్షిక సేల్ బ్యాక్ టు స్కూల్‌ను అధికారికంగా ప్రారంభించింది. పేరుకు తగినట్లుగానే ఈ ప్రత్యేక సేల్‌ను విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యాసంస్థల సిబ్బందిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ డిజైన్ చేసింది. చదువుకోవడానికి ఎంతో ఉపయోగపడే ఐప్యాడ్‌లు, మ్యాక్‌బుక్‌లను చాలా తక్కువ ధరకే సొంతం చేసుకునేందుకు యాపిల్ ఈ సువర్ణావకాశాన్ని కల్పించింది. యాపిల్ అధికారిక వెబ్‌సైట్ లేదా అఫీషియల్ స్టోర్స్ ద్వారా ఈ ఆఫర్లను యాక్సెస్ చేసుకోవచ్చు.
ఆగస్టు 27 వరకు అదిరిపోయే ఆఫర్లు
ఈ ఏడాదికి సంబంధించిన యాపిల్ బ్యాక్ టు స్కూల్ సేల్ జూలై 16 నుంచి ప్రారంభమై, ఆగస్టు 27 వరకు నిరంతరాయంగా కొనసాగనుంది. ఈ సేల్ కాలంలో యాపిల్ ప్రొడక్ట్స్‌పై నేరుగా లభించే ప్రైస్ డిస్కౌంట్లతో పాటు అదనంగా క్యాష్‌బ్యాక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. కేవలం విద్యార్థులు, ఉపాధ్యాయులే కాకుండా తల్లిదండ్రులు కూడా తమ పిల్లల చదువుల కోసం ఈ సేల్‌ను ఉపయోగించుకుని యాపిల్ డివైజ్‌లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్‌లో కేవలం డిస్కౌంట్లే కాకుండా ఖరీదైన యాపిల్ యాక్సెసరీస్ ఉచితంగా లభించడం విశేషం.
యాపిల్ ఐప్యాడ్‌లపై క్రేజీ డీల్స్
విద్యార్థులకు నోట్స్ రాసుకోవడానికి ఎంతో ఉపయోగపడే ఐప్యాడ్ సిరీస్‌పై యాపిల్ అద్భుతమైన డీల్స్ ఇస్తోంది. ఈ సేల్‌లో సరికొత్త ఐప్యాడ్ ఎయిర్ ప్రారంభ ధర రూ.83,900గా ఉంది. దీనితో పాటు వివిధ బ్యాంక్ కార్డులపై అదనపు డిస్కౌంట్లు పొందవచ్చు. ఇక హై-ఎండ్ మోడల్ అయిన ఐప్యాడ్ ప్రో 2025ను రూ.1,27,900 ప్రారంభ ధరతో సొంతం చేసుకోవచ్చు. వీటి కొనుగోలుపై కంపెనీ ఎంతో ఖరీదైన యాపిల్ పెన్సిల్‌ను పూర్తిగా ఉచితంగా ఇస్తోంది. వీటితో పాటు ఎయిర్‌ట్యాగ్స్, ఎయిర్‌పాడ్స్ 4 పై కూడా ప్రత్యేక తగ్గింపులు ఉన్నాయి.
మ్యాక్‌బుక్ ఎయిర్ కొంటే ఎయిర్‌పాడ్స్ ఫ్రీ
ల్యాప్‌టాప్ ప్రియుల కోసం అత్యాధునిక ఎమ్5 చిప్‌తో వచ్చే సరికొత్త మ్యాక్‌బుక్ ఎయిర్ మోడల్‌ను ఈ సేల్‌లో చాలా తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. దీని కొనుగోలుపై కస్టమర్లకు యాపిల్ ఒక క్రేజీ ఆఫర్ ఇస్తోంది. ఈ ల్యాప్‌టాప్ కొంటే రూ.5,000 విలువైన ఎయిర్‌పాడ్స్ 4ను ఉచితంగా పొందవచ్చు లేదా నాలుగు యాపిల్ ఎయిర్‌ట్యాగ్స్‌ను ఉచితంగా సొంతం చేసుకోవచ్చు. వినియోగదారులు తమకు నచ్చిన ఆఫర్‌ను ఎంచుకునే వెసులుబాటు ఉంది. అలాగే విడిగా కొనాలనుకుంటే ఎయిర్‌పాడ్స్ ప్రో 3 ని ఈ సేల్‌లో కేవలం రూ.13,000కే అందిస్తున్నారు.
Lenovo : ల్యాప్‌టాప్ మార్కెట్లో సరికొత్త విప్లవం.. ప్రపంచంలోనే మొదటి ఇంక్‌జెట్ ప్రింటెడ్ OLED ల్యాప్‌టాప్ రిలీజ్
ప్రొఫెషనల్స్ కోసం మ్యాక్‌బుక్ ప్రో సిరీస్
కోడింగ్, గ్రాఫిక్స్ లేదా హెవీ టాస్క్స్ చేసే విద్యార్థుల కోసం మ్యాక్‌బుక్ ప్రో ఎమ్5 చిప్ మోడల్ ధర రూ.2,27,900గా నిర్ణయించబడింది. అలాగే అత్యంత పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చే ఎమ్5 ప్రో మాక్స్ మోడల్ ప్రారంభ ధర రూ.4,62,900గా ఉంది. వీటి కొనుగోలుపై కూడా కస్టమర్లకు ఉచితంగా ఎయిర్‌పాడ్స్ 4 లేదా నాలుగు ఎయిర్‌ట్యాగ్‌లను ఉచితంగా బహుమతిగా ఇస్తున్నారు. ఒకవేళ మీ బడ్జెట్ తక్కువగా ఉంటే, బేస్ మోడల్ అయిన మ్యాక్‌బుక్ నియోను కేవలం రూ.69,900 ప్రారంభ ధరకే కొనుగోలు చేయవచ్చు.
ఎవరెవరు ఈ ఆఫర్లకు అర్హులు?
ఈ బ్యాక్ టు స్కూల్ 2026 ఆఫర్లు అందరికీ వర్తించవు. ప్రస్తుతం కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులు, కొత్తగా అడ్మిషన్ పొందిన స్టూడెంట్స్ దీనికి అర్హులు. అలాగే విద్యార్థుల తరపున కొనుగోలు చేసే తల్లిదండ్రులు, పాఠశాలలు, కాలేజీలలో పనిచేసే అన్ని స్థాయిల ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లు, సిబ్బంది ఈ తగ్గింపులను పొందవచ్చు. దీనికోసం ఆన్‌లైన్‌లో UNiDAYS వెబ్‌సైట్ ద్వారా లేదా యాపిల్ వెరిఫికేషన్ సిస్టమ్ ద్వారా మీ గుర్తింపును ధృవీకరించుకోవాలి. ఒకవేళ నేరుగా యాపిల్ స్టోర్‌కు వెళ్లి కొనాలనుకుంటే వాలిడ్ స్టూడెంట్ ఐడీ కార్డ్, కాలేజ్ అడ్మిషన్ లెటర్ లేదా అర్హతను నిరూపించే ఏదైనా ఇతర పత్రాన్ని చూపించాల్సి ఉంటుంది.
ప్రకటన
ప్రకటన