Huge discount on Motorola Edge 70 in Flipkart: ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో మోటరోలా ఎడ్జ్ 70 (8GB + 256GB) వేరియంట్ రూ.27,999 ధరతో లిస్ట్ చేయబడింది. అంటే లాంచ్ ధర కంటే నేరుగా రూ. 2,000 తగ్గింది
Photo Credit: Motorola
Motorola Edge 70
Massive discount on Motorola Edge 70 in Flipkart: కొత్త ఫోన్ కొనాలనుకునే వారికి ముఖ్యంగా కెమెరా ప్రియులకు ఇదొక సూపర్ చాన్స్. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో మోటరోలా ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మోటరోలా ఎడ్జ్ 70 భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. గతేడాది డిసెంబర్‌లో రూ.29,999 ప్రారంభ ధరతో లాంచ్ అయిన ఈ మోడల్ ఇప్పుడు చాలా తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చింది. అద్భుతమైన ట్రిపుల్ 50 మెగాపిక్సెల్ కెమెరా సెటప్, సూపర్ స్లిమ్ డిజైన్ కలిగిన ఈ మొబైల్‌ను బడ్జెట్ ధరలోనే సొంతం చేసుకునేందుకు ఫ్లిప్‌కార్ట్ మంచి వేదికను కల్పించింది.
ధర, ఆఫర్ల వివరాలల్లోకి వెళ్తే.. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో మోటరోలా ఎడ్జ్ 70 (8GB + 256GB) వేరియంట్ రూ.27,999 ధరతో లిస్ట్ చేయబడింది. అంటే లాంచ్ ధర కంటే నేరుగా రూ.2,000 తగ్గింది. దీనితో పాటు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి పేమెంట్ చేస్తే అదనంగా రూ.1,400 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అప్పుడు ఈ ఫోన్ ఎఫెక్టివ్ ధర కేవలం రూ.26,599 అవుతుంది. ఒకవేళ మీ వద్ద పాత స్మార్ట్‌ఫోన్ ఉంటే, దానిని ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా గరిష్టంగా రూ.21,000 వరకు అదనపు తగ్గింపు పొందవచ్చు. అయితే ఈ ఎక్స్ఛేంజ్ విలువ మీరు ఇచ్చే పాత మొబైల్ మోడల్, దాని వర్కింగ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది.
ఈ మొబైల్ ప్రధాన ఆకర్షణ దీని కెమెరా సెటప్ అనే చెప్పాలి. ఇందులో సెల్ఫీలతో సహా మూడు వైపులా 50 మెగాపిక్సెల్ కెమెరాలనే అమర్చారు. ఫోన్ వెనుక వైపు OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్ట్ ఉన్న 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు, వైడ్ షాట్స్, క్లోజప్ ఫోటోల కోసం మరో 50 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ ప్లస్ మ్యాక్రో కెమెరాను ఇచ్చారు. ఇక ముందు భాగంలో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం అద్భుతమైన క్వాలిటీ గల 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను జత చేశారు. యూట్యూబ్ వ్లాగర్స్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేసేవారికి ఈ కెమెరా సెటప్ ఒక వరమనే చెప్పవచ్చు.
Redmi K100 : మొబైల్ మార్కెట్లో రెడ్‌మి సంచలనం.. ఏకంగా 9,000 mAh మెగా బ్యాటరీతో సరికొత్త ఫోన్
డిజైన్ మరియు డిస్‌ప్లే పరంగా మోటరోలా ఎడ్జ్ 70 ఫోన్ ఎంతో ప్రీమియంగా ఉంటుంది. కేవలం 5.99 మిమీ మందం, 159 గ్రాముల బరువుతో చాలా తేలికగా, అల్ట్రా స్లిమ్ లుక్‌తో చేతిలో ఇమిడిపోతుంది. ఇందులో 6.7 ఇంచుల సూపర్ హెచ్‌డీ (2712 x 1220 పిక్సెల్స్) ఎక్స్‌ట్రీమ్ అమోలెడ్ ఫ్లాట్ డిస్‌ప్లేను అమర్చారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, స్క్రీన్ ప్రొటెక్షన్ కోసం గొరిల్లా గ్లాస్ 7i సపోర్టును కలిగి ఉంది. పర్ఫార్మెన్స్ కోసం క్వాల్‌కామ్ సంస్థకు చెందిన శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్‌ను వాడారు. దీనికి తోడు 8GB రామ్, 256GB వేగవంతమైన యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ అందుబాటులో ఉంది.
మోటరోలా ఎడ్జ్ 70 అల్ట్రా స్లిమ్ మొబైల్‌లో 68W టర్బోపవర్ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000mAh బ్యాటరీని అమర్చారు. అంతేకాదు, ఈ రేంజ్ ఫోన్లలో చాలా అరుదుగా కనిపించే 15W వైర్‌లెస్ చార్జింగ్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. సాఫ్ట్‌వేర్ పరంగా ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఓఎస్‌పై పనిచేస్తుంది. దీనికి 3 ఆండ్రాయిడ్ అప్‌గ్రేడ్స్, 4 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్లను కంపెనీ ఆఫర్ చేస్తోంది. ఫోన్ ఎంత రఫ్ గా వాడినా డ్యామేజ్ అవ్వకుండా ఉండటానికి MIL-STD 810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, నీటిలో పడినా పాడవకుండా ఉండేందుకు IP69, IP68 డస్ట్ అండ్ వాటర్ ప్రొటెక్షన్ రేటింగ్ ఇచ్చారు. ఈ మొబైల్‌లో బ్లూటూత్ 5.4, వై-ఫై 6E, ఎన్‌ఎఫ్‌సీ, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ వంటి అన్ని అధునాతన కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి.
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹44,652
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Haier M70 Mini LED 65-inch
Starts from ₹74,990
CMF Buds Neo True Wireless Stereo (TWS) Earphones
Starts from ₹2,199
Xiaomi TV FX Mini LED 65
Starts from ₹64,999
iPhone 18 Pro Series’ A20 Pro Chipset Appears on Multiple Benchmarking Platforms Showing Performance Gains