ప్రీమియం స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల విపణిలో ఆధిపత్యం చెలాయిస్తున్న యాపిల్‌కు ఐఫోన్, మ్యాక్‌బుక్, సర్వీసెస్ బిజినెస్ విభాగాల నుంచి భారీగా ఆదాయం సమకూరింది.
Apple : ప్రపంచ ప్రసిద్ధ ఐఫోన్ తయారీ సంస్థ యాపిల్ జూన్ త్రైమాసికంలో మైండ్ బ్లాకింగ్ ఫలితాలను నమోదు చేసింది. గత సంవత్సరంతో పోలిస్తే కంపెనీ రెవెన్యూ ఏకంగా 16 శాతం పెరిగి 109.4 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.10.43 లక్షల కోట్లు) చేరింది. కంపెనీ చరిత్రలోనే జూన్ త్రైమాసికంలో నమోదు చేసిన అత్యంత బలమైన ప్రదర్శన ఇది అని యాపిల్ ప్రకటించింది.
ఐఫోన్, మ్యాక్‌బుక్ సేల్స్ రచ్చ
ప్రీమియం స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల విపణిలో ఆధిపత్యం చెలాయిస్తున్న యాపిల్‌కు ఐఫోన్, మ్యాక్‌బుక్, సర్వీసెస్ బిజినెస్ విభాగాల నుంచి భారీగా ఆదాయం సమకూరింది. ఐఫోన్ విక్రయాలు 22 శాతం పెరిగి 54.3 బిలియన్ డాలర్లను అందుకోగా, మ్యాక్‌బుక్ రెవెన్యూ 29 శాతం పెరిగి 10.4 బిలియన్ డాలర్లకు చేరుకుంది. కంపెనీ సీఈఓ టిమ్ కుక్ మాట్లాడుతూ.. "జూన్ త్రైమాసికంలో మా సేవలు, ఐఫోన్, మ్యాక్‌బుక్ విభాగాలు డబుల్ డిజిట్ గ్రోత్ సాధించాయి" అని వెల్లడించారు. ముఖ్యంగా భారతదేశంలో యాపిల్ ఆల్-టైమ్ రికార్డు రెవెన్యూ సాధించగా, అమెరికా, చైనా, జపాన్‌లలోనూ గణనీయమైన వృద్ధి కనిపించింది.
లాభాల పంట.. ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో రికార్డు
ఈ త్రైమాసికంలో యాపిల్ నికర లాభం 29.8 బిలియన్ డాలర్లుగా (దాదాపు రూ.2.84 లక్షల కోట్లు) నమోదైంది. కంపెనీ గ్రోస్ మార్జిన్ 50.1 శాతంగా నమోదు కావడానికి టారిఫ్ రీఫండ్ కూడా కొంత మేర దోహదపడింది. ఇక కంపెనీ ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో 34.4 బిలియన్ డాలర్లతో ఆల్-టైమ్ జూన్ క్వార్టర్ రికార్డును నెలకొల్పడం గమనార్హం.
ITR Filing : ఐటీఆర్ ప్రాసెస్ చాలా సింపుల్.. కొన్ని నిమిషాల్లోనే ఆన్లైన్లో పూర్త్యయ్యేలా ఈజీ స్టెప్స్ ఇవే
త్వరలోనే ఐఫోన్ ఆల్ట్రా' ఫోల్డబుల్ ఫోన్
స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో వేగంగా విస్తరిస్తున్న ఫోల్డబుల్ సెగ్మెంట్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు యాపిల్ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఈ నయా మోడల్‌ను ఐఫోన్ ఆల్ట్రా అని పిలిచే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఫోల్డబుల్ విపణిలో శామ్సంగ్ అగ్రస్థానంలో ఉండగా, యాపిల్ ఐఫోన్ ఆల్ట్రా, రాబోయే ఐఫోన్ 18 సిరీస్‌లతో ఈ మార్కెట్ మరింత ఊపందుకోనుంది. ఈ ఏడాది ఫోల్డబుల్ ఫోన్ల షిప్మెంట్లు 30 శాతానికి పైగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy S26 FE Camera Specifications Leaked Ahead of Expected Launch, May Reuse Its Predecessor's Main Rear Camera