Realme C100X Launched in India: మార్కెట్లోకి రియల్‌మీ C100x లాంచ్.. రెడ్‌మీ, శామ్‌సంగ్ బడ్జెట్ ఫోన్లకు గట్టి పోటీ

Realme C100X launched and Comparison with Redmi 15A 5G & Samsung Galaxy F70e 5G: రియల్‌మీ C100x మోడల్ 4GB+64GB వేరియంట్ ధర రూ.14,499గా ఉంది.

Realme C100X Launched in India: మార్కెట్లోకి రియల్‌మీ C100x లాంచ్.. రెడ్‌మీ, శామ్‌సంగ్ బడ్జెట్ ఫోన్లకు గట్టి పోటీ

Photo Credit: Realme/Redmi/Samsung

Realme C100x vs Redmi 15A 5G vs Samsung Galaxy F70e 5G

ముఖ్యాంశాలు
  • మార్కెట్లోకి రియల్‌మీ C100x లాంచ్
  • 8000mAh బ్యాటరీతో రియల్‌మీ కొత్త ఫోన్
  • రియల్‌మీ C100x దెబ్బకి పోటీదారులు ఖంగుతిన్న్ వైనం
ప్రకటన

Realme C100X Launched Comparison with Redmi 15A and Samsung Galaxy F70e: భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో బడ్జెట్ విభాగంలో పోటీ తీవ్రరూపం దాల్చింది. ప్రముఖ టెక్ దిగ్గజం రియల్‌మీ తన కొత్త స్మార్ట్‌ఫోన్  రియల్‌మీ C100xను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ ఫోన్ ఎంట్రీతో ఇప్పటికే మార్కెట్లో మంచి ఆధిక్యంలో ఉన్న రెడ్‌మీ 15A 5G, శామ్‌సంగ్ గెలాక్సీ F70e 5G ఫోన్లకు గట్టి పోటీ ఎదురుకానుంది. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు కోరుకునే వినియోగదారులను ఆకట్టుకునేలా ఈ మూడు ఫోన్లు రూపుదిద్దుకున్నాయి. అయితే వినియోగదారులు ఏ ఫోన్ కొంటే లాభమో తెలుసుకోవడానికి ఈ మూడింటి ఫీచర్లు, ధరల పూర్తి సమాచారం తెలుసుకుందాం.

ధరకు తగ్గ ఫీచర్లు.. ఏది చౌక..?

ధర విషయానికి వస్తే, రియల్‌మీ C100x మోడల్ 4GB+64GB వేరియంట్ ధర రూ.14,499గా ఉంది. అదే సమయంలో రెడ్‌మీ 15A 5G మోడల్ 4GB+64GB వేరియంట్‌ను రూ.12,999కే అందిస్తుండగా, 4GB+128GB వేరియంట్ రూ.14,499కి అందుబాటులో ఉంది. మరోవైపు శామ్‌సంగ్ గెలాక్సీ F70e 5G మోడల్ 4GB+128GB వేరియంట్ రూ.13,999 వద్ద మరియు 6GB+128GB వేరియంట్ రూ.14,999 వద్ద లభిస్తున్నాయి. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ స్టోరేజ్ కోరుకునే వారికి రెడ్‌మీ, శామ్‌సంగ్ మోడళ్లు మంచి ఎంపికగా నిలుస్తున్నాయి.

డిస్ప్లే, ప్రాసెసర్ పవర్..

డిస్ప్లే పరంగా చూస్తే రెడ్‌మీ 15A 5G లో అతిపెద్ద 6.9 ఇంచుల HD+ డిస్ప్లే (810 నిట్స్ ప్రకాశం) ఇవ్వగా, రియల్‌మీ C100x లో 6.8 ఇంచుల HD+ LCD డిస్ప్లే లభిస్తుంది. ఇది 900 నిట్స్ అత్యధిక ప్రకాశంతో వెలుతురులోనూ స్పష్టంగా కనిపిస్తుంది. శామ్‌సంగ్ F70e 5G లో 6.7 ఇంచుల HD+ స్క్రీన్ లభిస్తుంది. ఈ మూడు ఫోన్లూ 120Hz రిఫ్రెష్ రేట్‌తో స్మూత్ స్క్రీనింగ్ అనుభూతిని ఇస్తాయి. ప్రాసెసింగ్ విషయానికి వస్తే రియల్‌మీ C100x లో యూనిసోక్ T7250, రెడ్‌మీ 15A 5Gలో యూనిసోక్ T8300, అలాగే శామ్‌సంగ్ F70e 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఆక్టాకోర్ చిప్‌సెట్లు పనిచేస్తాయి.

Xiaomi Camera : కరెంట్, వైఫైతో పనిలేదు.. సోలార్ ఎనర్జీతో పనిచేసే షావోమీ సరికొత్త స్మార్ట్ సెక్యూరిటీ కెమెరా

రాక్షస బ్యాటరీ.. ఛార్జింగ్ స్పీడ్..

ఈ పోలికలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ప్రధాన అంశం బ్యాటరీ పవర్. రియల్‌మీ C100x ఏకంగా 8,000mAh భారీ బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో సరికొత్త రికార్డు సృష్టిస్తోంది. రోజులకు రోజూ ఛార్జింగ్ లేకుండా వాడేవారికి ఇది తిరుగులేని ఎంపిక. దీనికి పోటీగా రెడ్‌మీ 15A 5G లో 6,300mAh బ్యాటరీ (15W ఛార్జింగ్), శామ్‌సంగ్ F70e 5G లో 6,000mAh బ్యాటరీ (25W ఛార్జింగ్) మాత్రమే లభిస్తున్నాయి.

కెమెరా, ఆపరేటింగ్ సిస్టమ్..

ఫోటోగ్రఫీ పరంగా రియల్‌మీ C100x లో 50MP AI రియర్ కెమెరా, 5MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. శామ్‌సంగ్ F70e 5G లో కూడా 50MP ప్రధాన కెమెరాతో పాటు 2MP డెప్త్ సెన్సార్,  మెరుగైన 8MP సెల్ఫీ కెమెరా అందించారు. రెడ్‌మీ 15A 5G లో 32MP ప్రధాన కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా కలవు. ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే ఈ మూడు ఫోన్లు సరికొత్త ఆండ్రాయిడ్ 16 ఆధారిత కస్టమ్ యూజర్ ఇంటర్‌ఫేస్‌లతో (రియల్‌మీ UI 7.0, హైపర్‌ఓఎస్ 3.0, వన్ UI 8) పనిచేస్తాయి. ఆడియో జాక్, టైప్-సి పోర్ట్, జిపిఎస్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు మూడింట్లోనూ సమానంగా ఉన్నాయి.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »