ఉజ్జ్వల యోజన కింద కొత్త గ్యాస్ కనెక్షన్ పొందాలనుకునే మహిళలకు కొన్ని నిర్దిష్ట అర్హతలు ఉండాలి.
Photo Credit: Pexels/ Harsh Kukadiya
PMUY
PM Ujjwala Yojana: కేంద్ర ప్రభుత్వం దేశంలో పేదరికంలో ఉన్న మహిళల సంక్షేమం కోసం 2016 మే 1న ప్రధానమంత్రి ఉజ్జ్వల యోజనను ప్రారంభించింది. కర్రల పొయ్యి నుంచి వచ్చే పొగ వల్ల మహిళలు అనేక శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారని భావించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఈ విప్లవాత్మకమైన పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ వర్గాలతో పాటు సమాజంలోని ఇతర పేద వర్గాలకు చెందిన మహిళలకు ఉచితంగా వంటగ్యాస్ కనెక్షన్ అందిస్తున్నారు. కనెక్షన్ ఇవ్వడమే కాకుండా సిలిండర్ కొనుగోలుపై ప్రభుత్వ సబ్సిడీ ద్వారా ఆర్థిక సహాయం కూడా చేకూరుస్తోంది.
ఉజ్జ్వల కనెక్షన్ పొందడానికి అర్హతలు ఇవే
ఉజ్జ్వల యోజన కింద కొత్త గ్యాస్ కనెక్షన్ పొందాలనుకునే మహిళలకు కొన్ని నిర్దిష్ట అర్హతలు ఉండాలి. ముఖ్యంగా దరఖాస్తుదారు మహిళ అయి ఉండాలి, ఆమె వయస్సు 18 సంవత్సరాలు దాటాలి. ఆ కుటుంబం పేరు మీద దేశంలోని ఏ ఇతర చమురు సంస్థ నుంచి కూడా ఎలాంటి గ్యాస్ కనెక్షన్ ఉండకూడదు. దరఖాస్తుదారు విధిగా పేద కుటుంబానికి చెందినవారై ఉండటంతో పాటు, నిర్దేశించిన ఫార్మాట్ ప్రకారం దారిద్య్ర ధ్రువీకరణ పత్రాన్ని అందజేయాల్సి ఉంటుంది.
సిద్ధం చేసుకోవాల్సిన ముఖ్యమైన పత్రాలు
ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవడానికి కొన్ని ప్రాథమిక పత్రాలు తప్పనిసరిగా సమర్పించాలి. కేవైసీ దరఖాస్తు ఫారంతో పాటు గుర్తింపు కార్డు, నివాస ధ్రువీకరణ పత్రాలు అవసరం. కుటుంబ వివరాలు తెలిపే రేషన్ కార్డు, దరఖాస్తుదారుతో పాటు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వయోజన సభ్యుడి గుర్తింపు కార్డు జతచేయాలి. వీటితో పాటు సబ్సిడీ నగదు జమ కావడానికి బ్యాంక్ పాస్‌బుక్ కాపీ లేదా క్యాన్సిల్డ్ చెక్, స్వయం సమర్పిత డిక్లరేషన్ పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి. వలస కార్మికులకు ప్రభుత్వం ప్రత్యేక నిబంధనల ప్రకారం స్వయం ధ్రువీకరణకు అవకాశం కల్పించింది.
Apple: ఆపిల్ లవర్లకు అదిరిపోయే ఫ్రీడమ్ ఆఫర్.. అతితక్కువ ఈఎంఐకే ఐఫోన్, మ్యాక్‌బుక్
ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకునే సులువైన విధానం
ఈ పథకం కోసం అధికారిక పోర్టల్ అయిన పోర్టల్‌ను సందర్శించి చాలా తేలికగా అప్లై చేసుకోవచ్చు. వెబ్‌సైట్ హోమ్‌పేజీలో కొత్త ఉజ్జ్వల కనెక్షన్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత స్క్రీన్‌పై కనిపించే ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందూస్థాన్ పెట్రోలియం సంస్థలలో మీకు నచ్చిన కంపెనీని ఎంచుకోవాలి. అక్కడ మీ మొబైల్ నంబర్‌తో లాగిన్ అయి, మీ వ్యక్తిగత వివరాలు, అడ్రస్, బ్యాంక్ ఖాతా సమాచారంతో ఆన్‌లైన్ కేవైసీ ఫారాన్ని పూర్తి చేయాలి. రేషన్ కార్డు, ఫోటో కాపీలను అప్‌లోడ్ చేసి ఫారాన్ని సబ్మిట్ చేసిన తర్వాత వచ్చే రెఫరెన్స్ నంబర్‌ను జాగ్రత్తగా దాచుకోవాలి. చివరిగా ప్రింటవుట్ తీసుకుని, ఒరిజినల్ పత్రాలతో సమీపంలోని గ్యాస్ డిస్ట్రిబ్యూటర్‌కు వెళ్లి వెరిఫికేషన్ పూర్తి చేస్తే కనెక్షన్ మంజూరవుతుంది.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹59,909
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
God of War Laufey Pre-Orders Begin September 29; Digital Deluxe Edition, New Combat Details Revealed
Ai+ Pulse 2 FE Launched in India Alongside Ai+ NovaTab, Nova LapTab 5G Tablets: Price, Specifications