మీ అనుమతి లేకుండా ఫోటోలు, వీడియోలు డౌన్లోడ్ కాకుండా ఉండాలంటే ముందుగా వాట్సాప్ ఓపెన్ చేయాలి.
Photo Credit: Pexels/Anton
WhatsApp : ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ఉపయోగిస్తున్న వాట్సాప్ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్‌లో మనకు తెలియకుండానే నిండిపోయే స్టోరేజ్ పెద్ద సమస్యగా మారింది. వాట్సాప్‌లో బై-డిఫాల్ట్‌గా ఉండే ఆటో-సేవింగ్ ఫీచర్ వల్ల గ్రూపులు, చాట్ల నుంచి వచ్చే వేలాది ఫోటోలు, వీడియోలు నేరుగా ఫోన్ గ్యాలరీలోకి డౌన్లోడ్ అయిపోతాయి. దీనివల్ల స్మార్ట్‌ఫోన్ మెమరీ వేగంగా నిండిపోవడమే కాకుండా, ఫోన్ స్లో అవ్వడం, ప్రైవసీ సమస్యలు ఎదురవ్వడం జరుగుతుంది. అయితే చిన్న సెట్టింగ్ మార్చడం ద్వారా దీనికి సులభంగా చెక్ పెట్టవచ్చు.
మీడియా ఆటో-డౌన్లోడ్ ఎలా ఆఫ్ చేయాలి?
మీ అనుమతి లేకుండా ఫోటోలు, వీడియోలు డౌన్లోడ్ కాకుండా ఉండాలంటే ముందుగా వాట్సాప్ ఓపెన్ చేయాలి. పై భాగాన కుడివైపున ఉండే త్రీ డాట్స్ పై టాప్ చేసి సెట్టింగ్స్ ఎంచుకోవాలి. ఆ తర్వాత స్టోరేజ్ అండ్ డేటా ఆప్షన్‌లోకి వెళ్లాలి. అక్కడ మీడియా ఆటో-డౌన్లోడ్ సెక్షన్ క్రింద వెన్ యూజింగ్ మొబైల్ డేటా , వెన్ కనెక్టెడ్ ఆన్ వైఫై అనే ఆప్షన్లు ఉంటాయి. వాటిపై క్లిక్ చేసి ఫోటోస్, ఆడియో, వీడియోస్, డాక్యుమెంట్స్ బాక్సుల్లో ఉన్న టిక్ మార్కులను తీసేయాలి. దీనివల్ల మీరు క్లిక్ చేస్తేనే ఫైల్ డౌన్లోడ్ అవుతుంది.
గ్యాలరీలో కనపడకుండా ఉండేందుకు మీడియా విజిబిలిటీ ఆఫ్
డౌన్లోడ్ అయిన ఫైల్స్ ఫోన్ గ్యాలరీలో కనిపించకుండా ఉండేందుకు మరో ప్రత్యేకాధికారం ఉంది. వాట్సాప్ సెట్టింగ్స్‌లోని చాట్స్ ఆప్షన్‌కి వెళ్లి మీడియా విజిబిలిటీని టోగుల్ ఆఫ్ చేయాలి. ఇలా చేయడం ద్వారా వాట్సాప్‌లోని ఫోటోలు కేవలం యాప్‌లోనే ఉంటాయి, ఫోన్ గ్యాలరీని ఆక్రమించవు. ఇది మీ వ్యక్తిగత ప్రైవసీని కాపాడటంలో, గ్యాలరీ క్లీన్‌గా ఉంచడంలో బాగా ఉపయోగపడుతుంది.
WhatsApp : ఇక వెబ్‌లోనూ కాల్స్, ఒక డివైజ్ నుంచి మరో డివైజ్‌కి విజిట్.. వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్
ప్రత్యేక చాట్లు లేదా గ్రూపులకు విడివిడిగా సెట్టింగ్స్
మీరు అన్ని చాట్లకు కాకుండా, కేవలం కొన్ని నిర్దిష్టమైన వాట్సాప్ గ్రూపులు లేదా కాంటాక్టుల నుంచి వచ్చే ఫోటోలే గ్యాలరీకి రాకుండా నిరోధించవచ్చు. ఇందుకోసం సదరు వ్యక్తి లేదా గ్రూప్ చాట్ ఓపెన్ చేసి పైనున్న పేరుపై క్లిక్ చేయాలి. అక్కడ క్రిందికి స్క్రోల్ చేస్తే మీడియా విజిబిలిటీ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి Noని ఎంచుకుని OK కొడితే సరిపోతుంది. ఆ తర్వాత గ్యాలరీ రీఫ్రెష్ చేస్తే ఇకపై ఆ గ్రూప్ గురించిన మీడియా ఫోన్లో దానంతటదే సేవ్ కాదు.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Reddit to Require Users to Log in to Browse Platform, Testing to Begin Soon
Samsung Galaxy Fit 4 Features Allegedly Revealed Through Companion App Teardown