భారతీయ రైల్వే అభివృద్ధి చేసిన నేషనల్ రైల్ ఎంక్వైరీ సిస్టమ్ (NTES) ప్రయాణికులకు పూర్తిగా లైవ్ సమాచారాన్ని అందిస్తుంది.
Photo Credit: Pexels/Anirudh
Indian Railways NTES App
Indian Railways NTES App: భారతదేశంలో ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులు రైలు మార్గం ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకుంటారు. అతి తక్కువ ఖర్చుతో కూడిన ప్రయాణ సాధనంగా రైల్వే గుర్తింపు పొందింది. అయితే అనేకసార్లు రైల్వే స్టేషన్‌కు చేరుకున్న తర్వాత ఆఖరి నిమిషంలో రైలు రావలసిన ప్లాట్‌ఫారమ్‌ను మారుస్తుంటారు. దీనివల్ల ప్రయాణికులు లగేజీతో ఒక ప్లాట్‌ఫారమ్ నుంచి మరొక ప్లాట్‌ఫారమ్‌కు పరుగులు తీయాల్సి వస్తుంది. స్టేషన్‌లో చేసే మైక్ అనౌన్స్‌మెంట్లు ఘోషలో స్పష్టంగా వినబడకపోవడం కూడా ఇబ్బంది కలిగిస్తుంది. ఈ సమస్యకు పరిష్కారంగా ఇండియన్ రైల్వేస్ అందించే టెక్నాలజీ ద్వారా రైలు ఏ ప్లాట్‌ఫారమ్‌పైకి వస్తుందో ముందే సులభంగా తెలుసుకోవచ్చు.
NTES అంటే ఏమిటి?
భారతీయ రైల్వే అభివృద్ధి చేసిన నేషనల్ రైల్ ఎంక్వైరీ సిస్టమ్ (NTES) ప్రయాణికులకు పూర్తిగా లైవ్ సమాచారాన్ని అందిస్తుంది. దీని ద్వారా రైలు ప్రస్తుత రన్నింగ్ స్టేటస్, ఏ స్టేషన్‌కు ఎంత సమయానికి చేరుకుంటుంది. ఏ ప్లాట్‌ఫారమ్‌పైకి వస్తుంది అనే విషయాలను తెలుసుకోవచ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులు NTES యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు లేదా NTES అధికారిక వెబ్‌సైట్ ద్వారా కూడా ఈ వివరాలు పొందవచ్చు.
NTES మొబైల్ యాప్ ఎలా ఉపయోగించాలి?
* ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్ నుంచి NTES యాప్‌ను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోండి.
* యాప్‌ను ఓపెన్ చేసిన తర్వాత హోమ్‌పేజీలో కనిపించే Spot Your Train ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
* అక్కడ మీ రైలు నంబర్ లేదా రైలు పేరును నమోదు చేసి, Show Instance పై టాప్ చేయాలి.
* స్క్రీన్‌పై మీ రైలుకు సంబంధించిన వివరాలు కనిపిస్తాయి. అక్కడ రూట్ మ్యాప్‌పై టాప్ చేయడం ద్వారా రైలు ఏ స్టేషన్‌లో ఉందో, ఏ ప్లాట్‌ఫారమ్‌పైకి రాబోతోందో లైవ్‌గా తెలుసుకోవచ్చు.
Amazon Great Freedom Sale: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ధమాకా.. రూ. 20 వేల లోపే వన్‌ప్లస్ కొత్త స్మార్ట్‌ఫోన్
NTES వెబ్‌సైట్ ద్వారా వివరాలు తెలుసుకోవడం ఎలా?
* మీ బ్రౌజర్‌లో NTES అధికారిక పోర్టల్ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి.
* హోమ్‌పేజీలో ఎడమ వైపున ఉన్న ప్యానెల్ జాబితా నుంచి Spot Your Train ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
* ఇచ్చిన బాక్స్‌లో మీ రైలు పేరు లేదా నంబర్‌ను నమోదు చేసి, డ్రాప్‌డౌన్ జాబితా నుంచి సంబంధిత రైలును ఎంచుకోవాలి.
* ఆ తర్వాత మీ ప్రయాణ ప్రారంభ తేదీని ఎంచుకోవాల్సి ఉంటుంది.
* వెంటనే రైలు లైవ్ రన్నింగ్ స్టేటస్‌తో పాటు ప్లాట్‌ఫారమ్ నంబర్, పూర్తి రూట్ మ్యాప్ స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹59,909
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999