Photo Credit: HP
ప్రముఖ టెక్ బ్రాండ్ HP తన HP Victus స్పెషల్ ఎడిషన్ ల్యాప్‌టాప్‌లను దేశీయ మార్కెట్‌లోకి విడుదల చేసింది. ప్రధానంగా కాలేజీ విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రత్యేక ఎడిషన్ ల్యాప్‌టాప్‌లను విడుదల చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. వేగవంతమైన పనితీరు, మంచి గేమింగ్ సామర్థ్యాలను అందిస్తుందని వెల్లడించింది. ఈ ల్యాప్‌టాప్‌లలో 4GB వీడియో RAMతో Nvidia GeForce RTX 3050A జీపీయూని చేర్చడానికి కంపెనీ Nvidiaతో కలిసి పనిచేసింది. కంపెనీ HP గేమింగ్ గ్యారేజ్‌కి ఉచిత యాక్సెస్‌తో పాటు ఎస్పోర్ట్స్ మేనేజ్‌మెంట్, గేమ్ డెవలప్‌మెంట్‌పై ఆన్‌లైన్ ప్రొఫెషనల్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌ను కూడా అందిస్తోంది. మరెందుకు ఆలస్యం.. HP Victus స్పెషల్ ఎడిషన్ ల్యాప్‌టాప్‌లకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందామా?!
దేశీయ మార్కెట్‌లో ఈ కొత్త HP Victus ల్యాప్‌టాప్ ప్రారంభ ధర రూ. 65,999గా కంపెనీ నిర్ణయించింది. విభిన్న స్పెసిఫికేషన్‌లతో అనేక మోడల్‌లు అందుబాటులో ఉన్నప్పటికీ కంపెనీ ఆ మోడల్‌లను అధికారికంగా ప్రకటించలేదు. ఈ ల్యాప్‌టాప్ అట్మాస్ఫియరిక్ బ్లూతో ఒకే కలర్ ఆప్షన్‌లో అందుబాటులో ఉంది. ఇది కంపెనీ వెబ్‌సైట్, ఆఫ్‌లైన్ స్టోర్‌లు, అలాగే ఇతర ప్రధాన అవుట్‌లెట్‌ల నుండి కొనుగోలు చేయవచ్చు. అదనంగా, వినియోగదారులు రూ. 6,097 ధర ఉన్న హైపర్‌ఎక్స్ క్లౌడ్ స్టింగర్ 2 హెడ్‌సెట్‌ను స్పెషల్ ఆఫర్‌లో భాగంగా కేవలం రూ. 499కి సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్ పైన పేర్కొన్న సేల్స్ టచ్ పాయింట్‌లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.
ఈ HP Victus స్పెషల్ ఎడిషన్ ల్యాప్‌టాప్ HP Victus 16 యొక్క రీప్యాక్డ్ వెర్షన్‌గా మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇది 144Hz రిఫ్రెష్ రేట్‌తో 15.6-అంగుళాల పూర్తి-HD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అలాగే, 4GB వీడియో RAMతో Nvidia GeForce RTX 3050A GPUతో పాటు 12th జనరేషన్ కోర్ ప్రాసెసర్‌లను అందించారు. ఈ ల్యాప్‌టాప్ గరిష్టంగా 16GB RAM మరియు విభిన్న స్టోరేజ్ వేరియంట్‌లతో వస్తుంది. కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం.. Nvidia సహకారంతో వేగవంతమైన GPU జోడించడం వలన వినియోగదారులు గేమింగ్ సమయంలో రే ట్రేసింగ్ సామర్థ్యాలను ఉపయోగించుకోవచ్చు.
GPU వినియోగదారులను AI ఫీచర్‌లను ఉపయోగించడానికి లేదా పరికరంలో AI మోడల్‌లను సులభంగా ఆపరేట్ చేయటానికి అనుమతిస్తుంది. ఈ HP Victus స్టూడెంట్-ఫోకస్డ్ ల్యాప్‌టాప్ కనుక 70Whr బ్యాటరీతో బ్యాకప్ అందిస్తున్నారు. దీని బరువు 2.29kg వరకూ ఉంటుంది. దీంతోపాటు ఫుల్ సైజ్ బ్యాక్‌లిట్ కీబోర్డును దీనిలో అమర్చారు. న్యూమరిక్ కీప్యాడ్‌ను కూడా అందించారు. ల్యాప్‌టాప్ ఒమెన్-బ్రాండెడ్ టెంపెస్ట్ కూలింగ్ సొల్యూషన్‌తో పాటు హీట్ మేనేజ్‌మెంట్ కోసం IR థర్మోపైల్ సెన్సార్‌తో వస్తుందని కంపెనీ స్పష్టం చేసింది. ఈ ఫీచర్స్ మీకు నచ్చితే వెంటనే కొనుగోలు చేసి, ఆఫర్‌లో హైపర్‌ఎక్స్ క్లౌడ్ స్టింగర్ 2 హెడ్‌సెట్‌ను కూడా సొంతం చేసుకోండి!
ప్రకటన
ప్రకటన