Lava Blaze AMOLED 2 5G అనే ఈ కొత్త మోడల్ త్వరలోనే మార్కెట్లోకి రానుంది. ఈ కొత్త ఫోన్ ధర గరిష్టంగా రూ. 15, 000 ఉంటుందని కంపెనీ పేర్కొంది.
Photo Credit: lava
లావా బ్లేజ్ AMOLED 2 5G డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది
ఫోన్స్, ల్యాప్ టాప్స్ లేని ఇళ్లు ఇండియాలో దాదాపు కనిపించకపోవచ్చు. ఇక ఫోన్లలో అయితే కొత్త కొత్త మోడల్స్ వస్తూనే ఉంటాయి. రోజుకో కొత్త మోడల్ ఇండియన్ మార్కెట్లోకి వచ్చి వినియోగదారుల్ని అబ్బుర పర్చుతుంటాయి. ఇక లావా నుంచి ఇప్పటికే ఎన్నో కొత్త మోడల్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలో Lava Blaze AMOLED 2 5G అనే కొత్త మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేయబోతోన్నారు.లావా బ్లేజ్ AMOLED 2 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ గురించి సోషల్ మీడియా పోస్ట్‌లో టీజ్ చేసింది. ఈ కొత్త మోడల్ డిజైన్, కీలక స్పెసిఫికేషన్‌లను ముందే చెప్పేసింది. ఈ మోడల్ ఫోన్ తెలుపు రంగులో ఉంటుందట. బ్యాక్ సైడ్ ప్యానెల్ ఫ్లాట్‌గా ఉంటుందట. కంపెనీ లోగోని ప్యానెల్ దిగువ ఎడమ మూలకు పెట్టినట్టుగా తెలిపారు. దీర్ఘచతురస్రాకార కెమెరా మాడ్యూల్ పైభాగంలో పెట్టారు. ఈ మోడల్ అత్యంత స్లిమ్‌గా, సన్నగా ఉంటుందని కంపెనీ పేర్కొంది.
లావా కంపెనీ తాజాగా తమ సోషల్ మీడియా ఖాతాలో ఈ కొత్త మోడల్ గురించి పోస్ట్ వేశారు. ఈ స్మార్ట్‌ఫోన్ లావా బ్లేజ్ AMOLED 2 5G డిజైన్, కీలక స్పెసిఫికేషన్‌లను ప్రకటించేసింది. అయితే ఈ కొత్త మోడల్ రిలీజ్ డేట్‌ను మాత్రం ఇంకా ప్రకటించలేదు. అయితే త్వరలోనే ఈ న్యూ మోడల్ స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్లోకి రానుందని చెప్పేశారు. జూలై చివరలో లావా బ్లేజ్ డ్రాగన్ 5Gతో పాటు లాంచ్ అవుతుందని గతంలో భావించిన సంగతి తెలిసిందే
లావా బ్లేజ్ AMOLED 2 5G తెలుపు రంగు బ్యాక్ ప్యానెల్‌తో రానుంది. నలుపు రంగులో దీర్ఘచతురస్రాకారంలో కెమెరాను ఫిక్స్ చేశారు. వెనుక ప్యానెల్‌లో LED ఫ్లాష్‌తో పాటు డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కూడా ఉంది. లావా లోగో దిగువ ఎడమ మూలలో ఫిక్స్ చేశారు. వెనుక ప్యానెల్ పాలరాయి లాంటి నమూనాను కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది.
లావా బ్లేజ్ AMOLED 2 5G పూర్తి-HD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 7060 చిప్‌సెట్‌తో రానుంది. ఇది 2.6GHz గరిష్ట క్లాక్ స్పీడ్‌ను అందిస్తుందని తెలుస్తోంది. ఇది 6GB LPDDR5 RAM, 6GB వర్చువల్ మెమరీతో పాటు 128GB UFS 3.1 ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో రానుంది.
లావా బ్లేజ్ AMOLED 2 5G రూ. 15,000 కంటే తక్కువ ధరతో ఇండియన్ మార్కెట్లోకి రానుందని తెలుస్తోంది. లావా ఈ హ్యాండ్‌సెట్‌ను రెండు రంగులలో అందిస్తుంది. ఫెదర్ వైట్, మిడ్‌నైట్ బ్లాక్ రంగుల్లో రానుంది.
ఫోటోలు, వీడియోల కోసం ఈ కొత్త మోడల్‌లో ఏఐ ఫీచర్స్ ఉన్నాయని తెలుస్తోంది. AI- ఆధారిత 50-మెగాపిక్సెల్ సోనీ సెన్సార్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. లావా బ్లేజ్ AMOLED 2 5G USB టైప్-C కేబుల్ ద్వారా 33W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ పవర్‌తో రానుంది. ఈ న్యూ మోడల్ ఫోన్ ఆండ్రాయిడ్ 15తో నడుస్తుంది. రాబోయే హ్యాండ్‌సెట్ లీనియా డిజైన్‌తో 7.55mm మందాన్ని కలిగి ఉంటుంది. ఇక సేఫ్టీ విషయంలో ఇది ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్ కూడా ఉంది.
ప్రకటన
ప్రకటన