చైనీస్ టెక్ బ్రాండ్ షియోమి తన ఆదిపత్యాన్ని దేశీయ మార్కెట్‌లో కొనసాగించేందుకు ప్రాణాళిక సిద్ధం చేస్తోంది. జూలై 19న షియోమి CEO లీ జున్ వార్షిక ప్రసంగం సందర్భంగా ఈ విషయం దృవీకరించినట్లయింది. షియోమి మిక్స్ ఫ్లిప్, షియోమి మిక్స్ ఫోల్డ్ 4, రెడ్‌మి కె70 అల్ట్రా, వాచ్ ఎస్4 స్పోర్ట్, బడ్స్ 5తోపాటు స్మార్ట్ బ్యాండ్ 9 లాంటి అనేక ఇతర ఉత్పత్తులు మార్కెట్‌లోకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ ఏడాది షియోమి కంపెనీకి ఇది అతిపెద్ద ఈవెంట్‌లలో ఒకటిగా నిలుస్తుందని టెక్ దిగ్గజాలు భావిస్తున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనకు ముందే రాబోయే షియోమి మిక్స్ ఫ్లిప్ హ్యాండ్‌సెట్ యొక్క డిజైన్, చిప్‌సెట్, కెమెరా ట్యూనింగ్‌తో సహా కొన్ని ఇంట్రస్టింగ్ వివరాలను బహిర్గతమయ్యాయి. ఈ కొత్త మోడల్స్ మునుపటి వెర్షన్‌ల కంటే ఆప్‌డేటెడ్ వెర్షన్‌లతో లాంచ్ అవ్వబోతున్నాయనడంలో సందేహమే లేదు. మరెందుకు ఆలస్యం షియోమి నుంచి వస్తోన్న మిక్స్ ఫ్లిప్ విశేషాలను తెలుసుకుందామా?!
షియోమి మిక్స్ ఫ్లిప్ స్పెసిఫికేషన్స్
ట్విట్టర్ వేదికగా షియోమి CEO లీ జున్ రాబోయే షియోమి మిక్స్ ఫ్లిప్ మోడల్ గురించిన అనేక వివరాలను వెల్లడించిన విషయం తెలిసిందే. దీనికి స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 చిప్ వినియోగించినట్లు తెలిపారు. అలాగే, ఇటీవల విడుదలైన Motorola Razr 50 అల్ట్రా మోడల్ ఔటర్ డిస్‌ప్లే మాదిరిగానే రెండు సెన్సార్‌లను కలిగి ఉన్న వెనుక కెమెరా మాడ్యూల్ చుట్టూ పెద్ద కవర్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. షియోమి 14 అల్ట్రా మాదిరిగానే లైకా- డ్యూయల్డ్ ఇంజనీరింగ్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉన్నట్లు కనిపిస్తుంది. దీనికి దిగువ లెన్స్‌తో LED ఫ్లాష్ ఉంటుంది. అలాగే, హ్యాండ్‌సెట్ దిగువన స్పీకర్ గ్రిల్, మైక్రోఫోన్, USB టైప్-సి పోర్ట్‌తోపాటు SIM ట్రే ఉంది. పవర్, వాల్యూమ్ బటన్‌లు కుడి వైపున ఉండేలా డిజైన్ చేయబడింది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు అన్ని వైపులా యాంటినా బ్యాండ్‌లు కనిపిస్తాయి.సెల్ఫీకి ప్రాధాన్యత ఉండేలా
షియోమి మిక్స్ ఫ్లిప్ ఫోన్‌ను వైట్, పర్పుల్, బ్లాక్ వంటి కలర్ వేరియంట్‌లలో లాంచ్ చేయవచ్చని టీజర్ ఆధారంగా భావిస్తున్నారు. షియోమి మిక్స్ ఫ్లిప్ 1.5K రిజల్యూషన్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. కెమెరా పరంగా చూస్తే.. ఇది 50-మెగాపిక్సెల్ OV50E ప్రైమరీ సెన్సార్, 2x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 60-మెగాపిక్సెల్ OV60A సెకండరీ సెన్సార్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను అందిస్తున్నారు. దీని ముందు భాగంలో సెల్ఫీకి ప్రాధాన్యత ఉండేలా 32-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్‌ను పొందుపరిచారు. ఈ కెమెరాలను 45 డిగ్రీలు మరియు 135 గిగ్రీల మధ్య ఏ కోణంలోనైనా ఉపయోగించుకునే అవకాశం ఉంది.
ఎక్స్‌టర్నల్ స్క్రీన్..
అలాగే, ఎక్స్‌టర్నల్ స్క్రీన్ విషయానికి వస్తే.. 4.01-అంగులాల ఓఎల్ఈడీ టీసీఎల్ సీ8+, 1392*1208 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2500 నిట్స్ బ్రైట్నెస్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, షావోమి డ్రాగన్ క్రిస్టల్ గ్లాస్‌ను అందించారు. డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారితంగా హైపర్ఓఎస్ 1.0 కస్టమ్ స్కిన్‌పై పని చేయనుంది. ర్యామ్, స్టోరేజీను పరిశీలిస్తే.. ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్‌తోపాటు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ టెక్నాలజీ జోడించారు. ఈ హ్యాండ్‌సెట్ పవర్ బ్యాకప్ కోసం 4,780 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్‌కి సపోర్ట్ చేయనుంది. మొత్తంగా ఈ చైనీస్ టెక్ బ్రాండ్ షియోమి మన దేశీయ మార్కెట్‌లో సంచలనంగా నిలిచేందుకు ఇది మరో అవకాశంగా భావిస్తున్నట్లు కనిపిస్తుంది. మరి వినియోగదారులు ఈ మోడల్స్ విషయంలో ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
మరింత చదవడం: