Photo Credit: Alcatel
అల్కాటెల్ V3 అల్ట్రా 6.8-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంటుందని ఊహిస్తున్నారు
త్వరలోనే మన దేశంలో Alcatel కంపెనీ తమ Alcatel V3 Ultra మోడల్‌ను ప్రారంభించనున్న విషయం తెలిసిందే. అయితే, మార్కెట్ వర్గాలు ఆ లాంఛ్ తేదీ కోసం చూస్తుండగా, కొత్త ఆల్ట్రాకు సంబంధించిన కీలక విషయాలు బహిర్గతం అయ్యాయి. టీసీఎల్‌కు చెందిన ఈ బ్రాండ్ Alcatel V3 Ultraతోపాటు మరో రెండు మోడల్స్‌ను కూడా పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది. తాజాగా వచ్చిన టీజర్‌ను బట్టీ ఈ V3 Ultra ఫోన్ డిస్‌ప్లే సరికొత్త ఫీచర్స్‌ను కనబరుస్తోంది. అలాగే, ఈ మోడల్ స్మార్ట్ ఫోన్‌లు ప్రముఖ ఆన్‌లైన్ ప్లాట్‌ఫాం అయిన ఫ్లిప్‌కార్డ్ ద్వారా అమ్మకానికి రానున్నాయి. దీనికి సంబంధించిన కీలక విషయాలను తెలుసుకుందాం.ప్రీమియం ఆఫర్‌గా,తాజాగా, గిజ్‌మో చైనా నివేదికను బట్టీ.. Alcatel సంస్థ మన దేశంలో Alcatel V3 క్లాసిక్, Alcatel V3 ప్రో, Alcatel V3 ఆల్ట్రా అనే మూడు V సిరీస్ స్మార్ట్ ఫోన్‌లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. అలాగే, భారత్‌లో ఈ Alcatel V3 Ultra లైనప్‌లో ప్రీమియం ఆఫర్‌గా వచ్చే అవకాశాలు ఉన్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అంతే కాదు, ఈ మోడల్ మన దేశంలో సుమారుగా రూ. 30,000 కంటే తక్కువ ధర ఉండే విభాగంలో లభించే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నాయి.
రాబోయే కొత్త Alcatel V3 Ultra ఫోన్ అడ్వాన్స్‌డ్ ఐ ప్రొటక్షన్ ఫీచర్‌తో వచ్చే అవకాశాలు ఉన్నట్లు పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. అలాగే, V3 Ultra హ్యాండ్‌సెట్‌లు త్వరలోనే ప్రారంభం కానున్నట్లు కంపెనీ ఫౌండర్ మరియు టెక్ అడ్వైజర్ అయిన మాధవ్ శేత్ ఇప్పటికే ధృవీకరించారు. చూసేందుకు, చదివేందుకు మరియు స్క్రోలింగ్‌కు అనుకూలమైన ప్రత్యేకమైన డిస్‌ప్లే మోడ్‌లను ఈ మోడల్‌కు అందించినట్లు టీజర్ ద్వారా స్పష్టమైంది. దీనికి స్టైలస్ సపోర్ట్ కూడా ఉంది. అంతే కాదు, ఇది ట్రిపుల్ రియల్ కెమెరా యూనిట్‌తో రావొచ్చు.
ఇక, Alcatel V3 Ultra స్మార్ట్ ఫోన్‌ల అమ్మకాల విషయానికి వస్తే, ప్రముఖ ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులోకి రానున్నట్లు కంపెనీ నిర్థారించింది. అయితే, టీసీఎల్ యాజమాన్య NXTPAPER డిస్‌ప్లే ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లోని లిస్ట్‌లో ఉండనున్నట్లు తెలుస్తోంది. అలాగే, ఈ స్మార్ట్ ఫోన్‌ల ప్రొడక్షన్ కోసం డిక్సన్ టెక్నాలజీ అనుబంధ సంస్థ అయిన ప్యాడ్జెట్ ఎలక్ట్రానిక్స్‌తో Alcatel చేతులు కలిపింది.
మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం.. ఈ 6.8 అంగుళాల డిస్‌ప్లేతో Alcatel V3 Ultra వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే, ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, 5,010mAh బ్యాటరీతో రూపొందించబడి ఉండవచ్చు. దీనికి, 108 మెగాపిక్సెల్ ప్రైమరీ వెనుక కెమెరాను అందించే అవకాశాలు ఉన్నాయి. మే 27 ఉదయం 11 గంటలకు మన దేశంలో దీనిని లాంఛ్ చేసే అవకాశాలు ఉన్నట్లు కూడా మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ప్రకటన
ప్రకటన