Photo Credit: Motorola
Moto G పవర్ 5G (2025) (చిత్రంలో) జనవరిలో USలో ఆవిష్కరించబడింది
ప్రముఖ మొబైల్ బ్రాండ్ moto ఎప్పటికప్పుడు స్పెషల్ ఫీచర్స్ తో కొత్త కొత్త మొబైల్ హ్యాండ్సెట్స్ మార్కెట్లోకి తీసుకువస్తూ ఉంటుంది. రీసెంట్ గా moto బ్రాండ్ కి చెందిన moto g86 పవర్ 5g మొబైల్ ఫోన్ త్వరలో మార్కెట్లోకి రానుంది. ఈ ఫోన్ కు సంబంధించిన లీకెడ్ డీటెయిల్స్ ఈ ఫోన్ పైన ఎక్స్పెక్టేషన్స్ పెంచేసాయి. ఈ ఫోన్ మోడల్ డిజైన్, ప్రమోషనల్ ఇమేజెస్, కలర్ ఆప్షన్స్ అన్నీ కూడా ఎట్రాక్టివ్గా ఉన్నాయి. ఈ ఫోన్ రేర్ ప్యానల్ ఫినిష్ తో, నాలుగు కలర్ వేరియంట్స్ లో అందుబాటులోకి రానుంది.డిజైన్ & కలర్ ఆప్షన్స్,moto g86 పవర్ 5g మొబైల్ ఫోన్ లీకెడ్ ప్రమోషనల్ ఇమేజెస్ చూస్తే ఈ ఫోన్ నాలుగు కలర్స్ లో అందుబాటులో ఉన్నట్టు తెలుస్తోంది. పేల్ రెడ్, లావెండర్, ఆలివ్ గ్రీన్, బ్లూ గ్రే కలర్స్ తో ఈ హ్యాండ్ సెట్ మార్కెట్లోకి లాంచ్ అవ్వనుంది. దీంతోపాటు ఈ మోడల్ ఎకో లెదర్ బ్యాక్ పెనల్ తో వస్తుంది .
అలాగే ఈ moto g86 పవర్ 5g మొబైల్ ఫోన్ మిడిల్ ఫ్రేమ్, ఫ్రంట్ ప్యానెల్ ఫ్లాట్ గా ఉన్నాయి. ఫోన్ డిస్ ప్లే విషయానికి వస్తే స్లిమ్ బెజిల్స్ , థిక్కర్ చిన్, డిస్ ప్లేకి పైన సెంటర్డ్ హోల్-పంచ్ స్లాట్ కనిపిస్తుంది.
ఈ మొబైల్ ఫోన్ వెనుక భాగంలో సమాంతరంగా, స్వల్పంగా పైకి ఉండే కెమెరా బంప్ ఉంటుంది. వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ ఫోన్ కి రైట్ సైడ్ ఎడ్జ్ లో ఉంటాయి. అలాగే టాప్ ఎడ్జ్ లో "డాల్బీ ఆట్మాస్" బ్రాండింగ్ కనిపిస్తుంది.
కీ ఫీచర్స్:
moto g86 పవర్ 5g మొబైల్ ఫోన్ కీ ఫీచర్స్ తో అందుబాటులోకి రానుంది. 2712 x 1220 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్ తో 6. 67 ఇంచ్ poled డిస్ ప్లేతో వస్తోంది. 120hz రిఫ్రెష్ రేట్, 7i ప్రొటెక్షన్ కార్నింగ్స్ గొరిల్లా గ్లాస్, 7300 soc మీడియా టెక్ డైమెన్సిటీ, 8gb లేదా 12gb ర్యామ్ సపోర్ట్ ఇందులో ఉన్నాయి. అలాగే 128gb, 256gb ఆన్ బోర్డ్ స్టోరేజ్ వేరియంట్, ఆండ్రాయిడ్ 15 బేస్డ్ హలో UI, రెండు సంవత్సరాల పాటు OS అప్గ్రేడ్స్, నాలుగు సంవత్సరాలు బై మంత్లీ సెక్యూరిటీ అప్డేట్స్ తో ఈ హ్యాండ్ సెట్ రానుంది.
అలాగే లీకైన సమాచారం ప్రకారం moto g86 పవర్ 5g మొబైల్ ఫోన్లో బ్యాక్ కెమెరా 50 మెగాపిక్సెల్ సోనీ లిటియా 600 సెన్సార్, f/1. 88 అప్పెర్చర్ & OIS సపోర్టుతో వస్తోంది. దీనికి అదనంగా f/2. 2 అప్పెర్చర్ తో 8 మెగాపిక్సల్ మాక్రో కెమెరా కూడా ఉంది. అలాగే సెల్ఫీస్, వీడియో కాల్స్ కి ప్రత్యేకంగా f/2. 2 అప్పెర్చర్ తో 32 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా సెన్సార్ తో పాటు వస్తుంది. ఈ ఫోన్ సేమ్ moto g86 5g వేరియంట్ కి సిమిలర్ ఫీచర్స్ కలిగి ఉంది.
మార్కెట్ కి అనుగుణంగా moto g86 పవర్ 5g సింగిల్ సిమ్, డ్యూయల్ సిమ్ వేరియంట్స్ లో అందుబాటులోకి రానుంది. ఈ రెండు వెర్షన్స్ కూడా 5. 4 బ్లూటూత్ కనెక్టివిటీతో వస్తున్నాయి. ఈ మొబైల్ ఫోన్లో డాల్బీ అట్మాస్ సపోర్ట్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ సెట్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే 6720 mAH బ్యాటరీకి, 33W టర్బో పవర్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తున్నారు. దీంతో ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ అవైలబుల్ ఉంటుంది. ఈ ఫోన్ బరువు వచ్చేసి సుమారు 198 గ్రాములు ఉండొచ్చు, 61. 21 x 74. 74 x 8. 65mm సైజులో రావచ్చు. ఈ ఫీచర్స్ తో పాటు MIL-std-810h డ్యూరబిలిటీ సర్టిఫికేషన్, ip68, ip69
ప్రకటన
ప్రకటన