Photo Credit: Lava
లావా షార్క్ 4G (చిత్రంలో) 50-మెగాపిక్సెల్ ప్రైమరీ వెనుక కెమెరాను కలిగి ఉంది
మన దేశంలో Lava Shark 5G మోడల్ త్వరలోనే విడుదల కానుంది. తాజాగా, ఈ మోడల్‌కు సంబంధించిన లాంఛ్ తేదీతోపాటు కీలకమైన స్పెసిఫికేషన్స్‌ను కంపెనీ అధికారింగా ప్రకటించింది. ఈ ఏడాది మార్చి నెలలో విడుదలైన Lava Shark 4G మాదిరిగా డిజైన్ లాంగ్వేజ్ దీనికి కూడా ఉంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే, గతంలో వచ్చిన 4G వేరియంట్‌కు యూనిసోక్ T606 ప్రాసెసర్, 18W వైర్డు ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీ, 50- మెగాపిక్సెల్ ప్రైమరీ రియల్ కెమెరాను కూడా అందించారు. ధరతోపాటు స్పెసిఫికేషన్స్ చూసేద్దాం రండి!ధర రూ. 10000 కంటే తక్కువగా,ఇండియాలో ఈ కొత్త Lava Shark 5G స్మార్ట్ ఫోన్ మే 23న విడుదల కానున్నట్లు కంపెనీ ఓ పత్రికా ప్రకటన ద్వారా వెల్లడించింది. దీని AnTuTu స్కోర్ 4,00,000 కంటే ఎక్కువగా ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ హ్యాండ్‌సెట్ LPDDR4X ర్యామ్‌కి సపోర్ట్ చేస్తుంది. అలాగే, మన దేశంలో దీని ధర రూ. 10000 కంటే తక్కువగా ఉంటుంది. 13- మెగాపిక్సెల్ ఏఐ బ్యాక్డ్ మెయిన్ రియల్ కెమెరా సెన్సార్‌ను రాబోయే Lava Shark 5G కి అటాచ్ చేయనున్నారు. అలాగే, ఇది దుమ్ము, నీటి నియంత్రణకు ఐపీ54 రేటింగ్‌ను కలిగి ఉంది.
రాబోయే Lava Shark 5G స్మార్ట్ ఫోన్ డ్యూయల్ రియల్ కెమెరాతో రానున్నట్లు గతంలోనే లీక్ అయ్యింది. అలాగే, ఈ మోడల్ కెమెరా ఐలాండ్‌లో ఉంచిన రౌండ్ ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్ చుట్టూ రింగ్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. అంతే కాదు, ఇది గోల్డ్, బ్లూ కలర్ ఆప్షన్‌లలో కొనుగోలుకు అందుబాటులో ఉండనున్నాయి. అయితే, డిజైన్ విషయంలో సరికొత్తగా ఉన్నట్లు మర్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
గీక్ బెంచ్ లిస్ట్ ఆధారంగా, ఈ Lava Shark 5G హ్యాండ్‌సెట్ 4జీబీ ర్యామ్‌తో అటాచ్ చేయబడిన యూనిసోక్ T765 ప్రాసెసర్ ద్వారా శక్తిని గ్రహిస్తుంది. అలాగే, ఇది 64జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజీకి సపోర్ట్ చేస్తుంది. అంతే కాదు, ఈ మోడల్ ఫోన్ ఆడ్రాయిడ్ 15 అవుట్ ఆఫ్ ది బాక్స్‌లో రన్ అవుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గత మోడల్స్‌తో పోల్చి చూస్తే, దీనికి అందించిన ఫీచర్స్ అప్‌గ్రేడ్ అయినట్లుగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు.
ఈ ఏడాది మార్చిలో మన దేశంలో విడుదలైన Lava Shark 4G వేరియంట్ ధర రూ. 6,999గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 120 హెచ్‌జెడ్‌తో 6.7 అంగుళాల హెచ్‌డీ +డిస్‌ప్లే, 50 మెగాపిక్సెల్ ప్రధాన వెనుక కెమెరా, 8- మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. అలాగే, యూనిసోక్https://www.gadgets360.com/tags/mobiles T606 ప్రాసెసర్, 18W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీతో దీనిని రూపొందించారు. ఈ ఫోన్ దుమ్ము, నీటి నియంత్రణకు ఐపీ54 రేటింగ్‌ను కలిగి ఉంది.
ప్రకటన
ప్రకటన