Photo Credit: Nothing
కెమెరా కోసం శీఘ్ర షట్టర్ బటన్‌ను పొందడానికి ఫోన్ 3a ఏదీ ఆటపట్టించబడలేదు
ఈ ఏడాది మార్చి 4న Nothing Phone 3a సిరీస్ లాంఛ్ కాబోతుంది. అయితే, విడుదలకు ముందు రాబోయే స్మార్ట్ ఫోన్‌ల గురించిన కీలక అంశాలను కంపెనీ ప్రకటించింది. ఈ హ్యాండ్‌సెట్‌లు స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో రూపొందించినట్లు కంపెనీ సీఈఓ కార్ల్ పీ వెల్లడించారు. గతంలో వచ్చిన Nothing Phone 2a సిరీస్ మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్‌ల ద్వారా శక్తిని పొందింది. రాబోయే సిరీస్ గణనీయమైన CPU, న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ (NPU) అప్‌గ్రేడ్‌లను పొందనున్నట్లు ఈ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ స్పష్టం చేసింది. రెండోది ఆన్-డివైస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రాసెసింగ్‌ను మరింత మెరుగుపరుస్తుంది. ఈ సిరీస్‌కు సంబంధించిన పలు ఆసక్తికరమైన అంశాలను తెలుసుకుందాం.
త్వరలో రాబోయే Nothing Phone 3a సిరీస్ కోసం మీడియాటెక్ నుండి వైదొలగాలని నిర్ణయించినట్లు సిఈఓ ఒక కమ్యూనిటీ పోస్ట్‌లో ప్రకటించారు. ఫోన్ (3a)తో తాము క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ సిరీస్‌కి తిరిగి వెళ్తున్నట్లు ప్రకటించడం సంతోషంగా ఉందని తెలిపారు. ఆయన ఈ ఫోన్‌లకు సంబంధించిన ఎలాంటి వివరాలూ వెల్లడించనప్పటికీ, CPU 25 శాతం వేగంగా ఉంటుందని, ఫోన్ 2a ప్లస్ కంటే NPU 72 శాతం వేగంగా ఉంటుందని మాత్రం స్పష్టం చేశారు. అయితే, ఈ ప్రకటనతో రాబోయే సిరీస్ స్మార్ట్ ఫోన్‌ల పని తీరుపై మార్కెట్ వర్గాలలో పెద్ద ఎత్తున ఆసక్తి నెలకొంది.
గతంలో వచ్చిన నివేదిక ప్రకారం.. Nothing Phone 3aలో స్నాప్‌డ్రాగన్ 7s Gen 3 ప్రాసెసర్‌ను అందించవచ్చు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.8-అంగుళాల ఫుల్-HD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని కూడా వెల్లడైంది. అలాగే, ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా నథింగ్ OS 3.1తో కూడా రావచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇది గ్లిఫ్ ఇంటర్‌ఫేస్‌ను కూడా నిలుపుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
ముఖ్యంగా, ఈ Nothing Phone 3a హ్యాండ్‌సెట్ కుడి వైపున అదనపు బటన్‌ను కలిగి ఉంటుందని వార్తలు వస్తున్నాయి. అయితే, ఇది కెమెరా కోసం కావచ్చని అంచనా వేస్తున్నారు. ఇదే విషయమై, అది ఒక యాక్షన్ బటన్ కూడా కావచ్చని, ఆన్-డివైస్ AI కోసం ఉపయోగించడం లేదా మల్టీ-టోగుల్ ఫంక్షన్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. అయితే, దీనిపై కంపెనీ ఎలాంటి ప్రకటన కూడా వెలువరించలేదు.
అంతే కాదు, Nothing Phone 3a సిరీస్‌ను చెన్నైలోని తమ తయారీ ప్లాంట్‌లో అసెంబుల్ చేస్తామని కంపెనీ ప్రకటించింది. అలాగే, ఈ డెవలప్‌మెంట్‌లో 500 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారని, వీరిలో 95 శాతం మంది మహిళలు పనిచేస్తున్నారని కంపెనీ వెల్లడించింది. అసెంబుల్ చేయబడిన యూనిట్లు భారతదేశంలో ప్రత్యేకంగా విక్రయించబడతాయా లేదా ఇతర మార్కెట్లకు కూడా ఎగుమతి చేయబడతాయా అనేదానిపై ఇప్పటి వరకూ అయితే ఎలాంటి సమాచారం లేదు.
ప్రకటన
ప్రకటన