ఇండియాలో మే 27న Alcatel V3 5G సిరీస్ లాంఛ్‌.. పూర్తి వివ‌రాలు ఇవే

రాబోయే Alcatel V3 5G సిరీస్ కు సంబంధించిన కీల‌క‌మైన ఫీచ‌ర్స్‌తోపాటు డిజైన్‌, క‌ల‌ర్ ఆప్ష‌న్‌లను కూడా విడుద‌ల‌కు ముందుగానే బ‌హిర్గం చేసింది. ఇవి ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులోకి రానున్నాయి

ఇండియాలో మే 27న Alcatel V3 5G సిరీస్ లాంఛ్‌.. పూర్తి వివ‌రాలు ఇవే

Photo Credit: Alcatel

ఆల్కాటెల్ V3 ప్రో 5G నలుపు మరియు ఆకుపచ్చ రంగులలో రానుంది

ముఖ్యాంశాలు
  • ఈ లైనప్ TCL యాజమాన్య NXTPAPER టెక్నాలజీతో రానుంది
  • Alcatel V3 ప్రో 5G బ్లాక్‌, గ్రీన్ క‌ల‌ర్ ఆప్ష‌న్‌ల‌లో ల‌భించ‌నుంది
  • Alcatel V3 ఆల్ట్రా 5G ఫోన్ 108 మెగాపిక్సెల్ ప్రైమైరీ రియ‌ల్ సెన్సార్‌తో వ
ప్రకటన

ఈ మే నెల 27న‌ ఇండియాలో Alcatel V3 5G సిరీస్ విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్ప‌టికే ఈ లైన‌ప్‌లో Alcatel V3 5G ఆల్ట్రా మోడ‌ల్ వ‌స్తున్న‌ట్లు కంపెనీ స్ప‌ష్టం చేసింది. తాజాగా, TCL క‌మ్యూనికేష‌న్ ద్వారా అందుబాటులోకి వ‌స్తోన్న ఈ ఫ్రెంచ్ మొబైల్ బ్రాండ్ Alcatel V3 ప్రో 5G, Alcatel V3 క్లాసిక్‌ 5G వేరియంట్‌ల‌ను అధికారికంగా మార్కెట్‌కు ప‌రిచ‌యం చేసింది. అంతేకాదు, రాబోయే ఈ మోడ‌ల్స్‌కు సంబంధించిన కీల‌క‌మైన ఫీచ‌ర్స్‌తోపాటు డిజైన్‌, క‌ల‌ర్ ఆప్ష‌న్‌లను కూడా విడుద‌ల‌కు ముందుగానే బ‌హిర్గతం చేసింది. మూడు వేరియంట్‌లు కూడా ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులోకి రానున్నాయి.ఐ ప్రొటక్ష‌న్ ఫీచ‌ర్స్‌కు,కంపెనీ ఫ్లిప్‌కార్ట్ యాప్‌లోని లైవ్ మైక్రోసైట్ రాబోయే Alcatel V3 ప్రో 5G బ్లాక్‌, గ్రీన్ క‌ల‌ర్ ఆప్ష‌న్‌ల‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంద‌ని ప్ర‌క‌టించింది. ఈ ఫోన్ 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌, NXTPAPER టెక్నాల‌జీతో కూడిన 6.7 అంగుళాల డిస్‌ప్లేతో ల‌భించ‌నుంది. ఇది క‌ల‌ర్ పేప‌ర్ మోడ్‌తోపాటు రెగ్యుల‌ర్‌, ఇంక్ పేప‌ర్‌, మాక్స్ ఇంక్ మోడ‌ల్‌ల‌కు స‌పోర్ట్ చేస్తుంది. కొత్త V3 ప్రో 5G డిస్‌ప్లే లో లైట్‌, యాంటీ గ్లేర్ ఫీచ‌ర్ లాంటి ఐ ప్రొటక్ష‌న్ ఫీచ‌ర్స్‌కు స‌పోర్ట్ చేస్తుంద‌ని కంపెనీ స్ప‌ష్టం చేసింది.

మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెస‌ర్‌

రాబోయే Alcatel V3 క్లాసిక్‌ 5G వేరియంట్ వైట్ క‌ల‌ర్ ఆప్ష‌న్‌లో రానున్న‌ట్లు మార్కెట్‌లో పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. అలాగే, ఈ ఫోన్ 120 హెచ్‌జెడ్ రిఫ్రెస్ రేట్‌, NXTPAPER డిస్‌ప్లేతోపాటు క్లియ‌ర్ క‌ల‌ర్స్‌, ఆక‌ర్ష‌ణీయ‌మైన కాంట్రాస్ట్‌కు స‌పోర్టు చేయ‌నుంది. దీనిని మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెస‌ర్‌తో 18 W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5200mAh బ్యాట‌రీతో రూపొందించారు. ఈ స్మార్ట్ ఫోన్‌కు 50 మెగాపిక్సెల్ ప్రైమ‌రీ రియ‌ల్ కెమెరాతోపాటు 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు.

ఫుల్ హెచ్‌డీ+ స్క్రీన్‌తో

కొత్త Alcatel V3 ఆల్ట్రా 5G మోడ‌ల్ హైప‌ర్ బ్లూ, ఓష‌న్ గ్రేతోపాటు షాంపైన్ గోల్డ్ క‌ల‌ర్ ఆప్ష‌న్‌ల‌తో మార్కెట్‌లోకి రానున్న‌ట్లు కంపెనీ స్ప‌ష్టం చేసింది. అలాగే, ప్రోతోపాటు క్లాసిక్ మోడ‌ల్ మాదిరిగానే ఆల్ట్రా వెర్ష‌న్ కు సైతం NXTPAPER డిస్‌ప్లేను అందించారు. ఈ డిస్‌ప్లే 6.8 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ స్క్రీన్‌తో వ‌స్తుంది. మాక్స్ ఇంక్ మోడ్‌లో హ్యాండ్‌సెట్‌ను ఒక్క‌సారి ఛార్జ్ చేస్తే, ఏడు రోజుల వ‌ర‌కూ బ్యాట‌రీ లైఫ్ ఉంటుంది.

ఈ నెల 27న మ‌న దేశంలో

Alcatel V3 5G సిరీస్ ఈ నెల 27న మ‌న దేశంలో విడుద‌ల కానుంది. కొత్త Alcatel V3 ఆల్ట్రా 5G ఫోన్ 108 మెగాపిక్సెల్ ప్రైమ‌రీ రియ‌ల్ సెన్సార్‌తోపాటు 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను క‌లిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 8జీబీ ర్యామ్‌, 128జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజీకి స‌పోర్ట్ చేస్తుంది. అలాగే, 33 W ఫాస్ట్ ఛార్జింగ్ మ‌ద్ద‌తులో 5010mAh బ్యాట‌రీని అందించారు.

సంబంధిత వార్తలు

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. Redmi Note 17 Launching on August 6th 2026: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రెడ్‌మి సరికొత్త సంచలనం.. భారత్‌లో ఆగస్టు 6న రెడ్‌మి నోట్ 17 లాంచ్!
  2. Full Page Screenshot in iPhones: ఐఫోన్ యూజర్లకు అదిరిపోయే ట్రిక్.. ఒకే ఫైల్‌లో మొత్తం వెబ్‌పేజీని భద్రపరుచుకునే స్మార్ట్ ఫీచర్
  3. OnePlus Exit Rumors form India: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో వన్‌ప్లస్ సంచలనం.. భారత్‌లో వ్యాపారం బంద్ కానుందా?
  4. Social Media Curfew in United Kingdom: టీనేజర్ల రక్షణ కోసం బ్రిటన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. సోషల్ మీడియాపై రాత్రి వేళల్లో కర్ఫ్యూ
  5. Belkin 10K Power Bank: ఒకేసారి రెండు డివైజ్‌లు చార్జ్ చేసుకునే సదుపాయం.. బడ్జెట్ ధరలోనే అదిరిపోయే పవర్‌బ్యాంక్!
  6. Google Pixel 11 Launching on August 12: స్మార్ట్‌ఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఆగస్టు 12న గూగుల్ పిక్సెల్ 11 సిరీస్ గ్రాండ్ లాంచ్
  7. iQOO Z11 Lite launching: కాలేజ్ స్టూడెంట్స్ కోసం ఐకూ బంపర్ ఆఫర్.. జూలై 24న మార్కెట్లోకి సరికొత్త iQOO Z11 Lite
  8. ISRO Scientist Mass Resignations: ఇస్రో శాస్త్రవేత్తల వరుస రాజీనామాలు.. రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం, కొత్త రూల్స్ జారీ!
  9. Xiaomi Smart Camera C401 launched: చిన్న మూలపైనా డేగ కన్ను వేస్తుంది.. మోడరన్ సెక్యూరిటీ కెమెరాను తెచ్చిన షియోమీ!
  10. Apple Back to School Sale 2026: విద్యార్థులు, ఉపాధ్యాయులకు యాపిల్ బంపర్ ఆఫర్.. దేశంలో బ్యాక్ టు స్కూల్ సేల్ షురూ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »