Photo Credit: Redmi
Redmi 14R (pictured) arrives as the successor to the Redmi 13R
ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ Redmi తన Redmi 14R మోడల్ హ్యాండ్‌సెట్‌లను స్వదేశంలో లాంచ్ చేసింది. ఈ తాజా బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ 8GB వరకు RAM, 256GB వరకు ఇన్‌బిల్ట్ స్టోరేజీతోపాటు Snapdragon 4 Gen 2 ప్రాసెసర్‌ను అందించారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14లో రన్ అవుతుంది. అలాగే, 18W ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తూ.. 5,160mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. Redmi 13R కెమెరా విషయానికి వస్తే.. 13-మెగాపిక్సెల్ వెనుక కెమెరా, 5-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో అందుబాటులోకి వస్తోంది.
Redmi 14R ధరల విషయానికి వస్తే.. 4GB RAM, 128GB స్టోరేజీ ఉన్న బేస్ మోడల్ CNY 1,099 (సుమారు మన కరెన్సీలో రూ. 13,000) నుండి ప్రారంభమవుతుంది. ఇది వరుసగా CNY 1,499 (దాదాపు రూ. 17,700), CNY 1,699 (దాదాపు రూ. 20,100) ధరలతో 6GB+128GB, 8GB+128GB కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉంది. మరో వేరియంట్ 8GB+256GB ధర CNY 1,899 (దాదాపు రూ. 22,500)గా ఉంటుంది.ఈ కొత్త Redmi 14R చైనాలోని కంపెనీ వెబ్‌సైట్ ద్వారా డీప్ ఓషన్ బ్లూ, లావెండర్, ఆలివ్ గ్రీన్, షాడో బ్లాక్ రంగులలో అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్ భారతదేశంతో సహా గ్లోబల్ మార్కెట్‌లలో కూడా ప్రవేశపెట్టబడుతుందా లేదా అనేది ప్రస్తుతానికి కంపెనీ ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడించలేదు.
Redmi 14R హ్యాండ్‌సెట్‌లో డ్యూయల్ సిమ్ (నానో) కలిగి ఉండి, Android 14-ఆధారిత HyperOSపై నడుస్తుంది. ఇది 600నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.68-అంగుళాల HD+ LCD స్క్రీన్‌తో అందిస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది గరిష్టంగా 8GB RAMతో జత చేయబడింది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. హ్యాండ్‌సెట్‌లో సెకండరీ సెకండరీ సెన్సార్‌తో పాటు 13-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను అందించారు. మెరుగైన సెల్ఫీలు మరియు వీడియో కాల్‌ల కోసం ముందు భాగంలో వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్‌లో ఉన్న 5-మెగాపిక్సెల్ కెమెరాను అమర్చారు. దీని అమ్మకాలపై ఈ కెమెరా విభాగం కీలకపాత్ర పోషించవచ్చు.
అలాగే, Redmi 14Rలో 256GB వరకు ఇన్‌బిల్ట్ స్టోరేజీని అందించారు. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే.. 5G, 4G LTE, Wi-Fi, బ్లూటూత్, GPS, USB టైప్-C పోర్ట్‌తోపాటు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. దీనికి భద్రత దృష్ట్యా బయోమెట్రిక్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో రూపొందించారు. ఈ Redmi 14R 18W ఛార్జింగ్‌కు సపోర్ట్‌తో 5,160mAh బ్యాటరీ సామర్థ్యంతో విడుదల చేశారు. అయితే, భారత్‌లో ఈ మోడల్ హ్యాండ్‌సెట్ విడుదలపై ఎలాంటి ప్రకటనా లేకపోవడంతో కొనుగోలుదారుల్లో మరింత ఆసక్తి నెలకొంది. అందుకు కారణం ఇప్పటికే దేశీయ మార్కెట్‌లో Redmi స్మార్ట్‌ఫోన్‌లకు మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే!
ప్రకటన
ప్రకటన