Photo Credit: Oppo
Oppo Find N5 చైనాలో Oppo వాచ్ X2తో పాటుగా ప్రారంభమవుతుందని భావిస్తున్నారు
వచ్చే వారం గ్లోబల్ మార్కెట్‌లలో Oppo Find N5 స్మార్ట్ ఫోన్ లాంఛ్ కానుంది. అనేక టీజర్ల తర్వాత కంపెనీ తమ తదుపరి ఫోల్డబుల్ ఫోన్ చైనాతోపాటు ఇతర మార్కెట్‌లలో అదే తేదీన వస్తుందని స్పష్టం చేసింది. రాబోయే Find N5 హ్యాండ్‌సెట్ 3D-ప్రింటెడ్ టైటానియం అల్లాయ్ హింజ్‌ను కలిగి ఉంటుంది. అలాగే, ఇది ట్రిపుల్ ఔటర్ కెమెరా సెటప్‌తో రానున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. కంపెనీ ఫోల్డబుల్ ఫోన్ డిజైన్‌ను మూడు రంగులలో వస్తుండగా, వీటిలో ఒకటి చైనా వెలుపల విడుదల కాకపోవచ్చు.
రాబోయే Oppo Find N5 స్మార్ట్ ఫోన్ ఫిబ్రవరి 20న సింగపూర్‌లో జరిగే ఈవెంట్‌లో లాంఛ్ అవుతుంది. ఈ కార్యక్రమం అక్కడ సాయంత్రం 7 గంటలకు (భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:30 గంటలకు) ప్రారంభం కానున్నట్లు కంపెనీ వెల్లడించింది. అంటే, ఈ ఫోల్డబుల్ ఫోన్ చైనాతోపాటు ప్రపంచ మార్కెట్లలో ఒకేసారి లాంచ్ అవుతుంది. అలాగే, చైనాలో జరగనున్న కార్యక్రమంలో Oppo Watch X2 ను కూడా లాంచ్ చేస్తామని సంస్థ గతంలోనే ప్రకటించింది.
Weiboలో కంపెనీ పోస్ట్ చేసిన టీజర్ ప్రకారం.. Oppo Find N5 హ్యాండ్‌సెట్ జాడే వైట్, శాటిన్ బ్లాక్, ట్విలైట్ పర్పుల్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులోకి రానుంది. అయితే, YouTubeలో స్మార్ట్ ఫోన్ గ్లోబల్ లాంఛ్ ఈవెంట్ కోసం వచ్చిన టీజర్‌లో పర్పుల్ వేరియంట్ అయితే కనిపించడం లేదు. Oppo Find N5 ఫోన్‌కు సంబంధించి లీకైన స్క్రీన్‌షాట్ ద్వారా కొన్ని స్పెసిఫికేషన్‌లు బహిర్గతమయ్యాయి. ఇది Qualcomm నుండి ఇటీవల లాంఛ్ అయిన సెవెన్-కోర్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తోపాటు 512GB స్టోరేజీ, 16GB RAMతో అటాచ్ చేయబడి ఉంటుంది.
Oppo Find N5 స్మార్ట్ ఫోన్ బయట ట్రిపుల్ కెమెరా సెటప్‌తో రానుంది. అలాగే, ఇందులో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు 50-మెగాపిక్సెల్, 8-మెగాపిక్సెల్ సెన్సార్‌లు వరుసగా టెలిఫోటో, అల్ట్రావైడ్ కెమెరాలుగా ఉంటాయి. ఇది కవర్ స్క్రీన్‌పై ఒకటి, ఇన్నర్ డిస్‌ప్లేపై ఒకటి ఇలా రెండు 8-మెగాపిక్సెల్ కెమెరాలను కూడా కలిగి ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీని ద్వారా హై క్వాలిటీ ఇమేజ్‌లను అందుకోవచ్చని భావిస్తున్నాయి.
ఇది కంపెనీ ColorOS 15 యూజర్ ఇంటర్‌ఫేస్‌తో పాటు, Find N5 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 15 పై రన్ అవుతుందని కూడా ప్రచారంలో ఉంది. అలాగే, లీక్ అయిన స్క్రీన్‌షాట్ ద్వారా 80W (వైర్డ్), 50W (వైర్‌లెస్) ఛార్జింగ్ సపోర్ట్‌తో 5600mAh బ్యాటరీతో దీనిని రూపొందించినట్లు కూడా తెలుస్తోంది. ఈ లీక్ అయిన స్క్రీన్‌షాట్‌ను సరిపోల్చడం ద్వారా ఫిబ్రవరి 20న ఈ మోడల్ అరంగేట్రానికి కొన్ని రోజుల ముందే, రాబోయే Oppo Find N5 ఫోన్‌ని కొనుగోలుదారులు చాలా దగ్గరగా పరిశీలించి అవకాశం కల్పించాయి.
ప్రకటన
ప్రకటన