Photo Credit: Honor
చైనాలో హానర్ మ్యాజిక్ 7 RSR Porsche డిజైన్‌ను లాంచ్ చేసింది. ఈ న్యూ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ Qualcomm స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఎక్స్‌ట్రీమ్ ఎడిషన్ ప్రాసెసర్‌తో వస్తోంది. అలాగే, వైర్డు, వైర్‌లెస్ ఛార్జింగ్ రెండింటికీ సపోర్ట్ చేస్తూ 5850mAh బ్యాటరీని అందించారు. ఇది 200-మెగాపిక్సెల్ టెలిఫోటో షూటర్‌తో సహా ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌తో లభిస్తుంది. దుమ్ము, నీటిని నియంత్రించేందుకు IP68, IP69 రేటింగ్‌లను కలిగి ఉంటుంది. హానర్ మ్యాజిక్ 7 RSR Porsche డిజైన్ స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
హానర్ మ్యాజిక్ 7 RSR Porsche డిజైన్ 16GB+512GB వెర్షన్ ధర CNY 7,999 (దాదాపు రూ. 93,000), 24GB+1TB వెర్షన్ ధర CNY 8,999 (సుమారు రూ. 1,05,000)గా ఉంది. అగేట్ గ్రే, ప్రోవెన్స్ పర్పుల్ షేడ్స్‌లో ఇది లభిస్తుంది. Android 15-ఆధారిత MagicOS 9.0 స్కిన్‌పై రన్ అవుతోంది. ఈ ఫోన్ 6.8-అంగుళాల ఫుల్-HD+ (1,280 x 2,800 పిక్సెల్‌లు) LTPO OLED స్క్రీన్‌తో గరిష్టంగా 120Hz రిఫ్రెష్ రేట్, 453ppi పిక్సెల్ 10 నిట్ గ్లోబల్ డెన్సిటీ, 60 డెన్సిటీని కలిగి ఉంటుంది. 24GB వరకు RAM, 1TB స్టోరేజీతో వస్తోంది.
ఈ ఫోన్ స్విస్ SGS మల్టీ-స్కేనారియో గోల్డ్ లేబుల్ ఫైవ్-స్టార్ గ్లాస్ స్క్రాచ్, డ్రాప్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్‌ను పొందినట్లు కంపెనీ చెబుతోంది. దీని గ్లోరీ కింగ్ కాంగ్ జెయింట్ రైనో గ్లాస్ కోటింగ్ హానర్ కింగ్ కాంగ్ జెయింట్ రైనో గ్లాస్ అదే వెయిట్ క్యారియర్‌తో ఉన్న సాధారణ గ్లాస్ కంటే 10 రెట్లు స్క్రాచ్-రెసిస్టెంట్, 10 రెట్లు డ్రాప్-రెసిస్టెంట్ సామర్థ్యం ఉంటుందని స్పష్టం చేసింది.
కెమెరా విషయానికి వస్తే.. ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను అందించారు.
కెమెరా సెటప్‌లో 50-మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 100x డిజిటల్ జూమ్, 3x ఆప్టికల్ జూమ్‌కు సపోర్ట్‌తో 200-మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. వెనుక కెమెరా యూనిట్ మెరుగైన ఫోకస్ కోసం 1200-పాయింట్ LiDAR అర్రే ఫోకసింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ముందు భాగంలో 50-మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 3D డెప్త్ కెమెరాను అందించారు. 5G, Wi-Fi 7, బ్లూటూత్ 5.4, GPS/AGPS, గెలీలియో, GLONASS, Beidou, NFC, OTGతోపాటు USB టైప్-C పోర్ట్ ఉన్నాయి.
ఈ ఫోన్‌కు 3D ఫేస్ అన్‌లాకింగ్ ఫీచర్‌తో పాటు బయోమెట్రిక్స్ కోసం 3D అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు. ఇది టూ-వే బీడౌ శాటిలైట్ టెక్స్ట్ మెసేజింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. గ్రౌండ్ నెట్‌వర్క్ సిగ్నల్ లేనప్పుడు శాటిలైట్ సిస్టమ్ ద్వారా కమ్యూనికేట్ చేయడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. అయితే, ఈ ఫీచర్ చైనా మార్కెట్‌కే పరిమితం అయ్యే అవకాశం ఉంది.
ప్రకటన
ప్రకటన