Photo Credit: Honor
కొత్త మోడల్ Honor X7c 4G స్మార్ట్‌ఫోన్ విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదు. అయినప్పటికీ, ఈ 4G హ్యాండ్‌సెట్ కీలక ఇమేజ్‌లు, స్పెసిఫికేషన్‌లు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఇమేజ్‌లలో ఇది నలుపు, ఆకుపచ్చ, తెలుపు రంగులలో కనిపిస్తోంది. అలాగే, స్నాప్‌డ్రాగన్ 685 ప్రాసెసర్‌తో పనిచేయడంతోపాట ఈ స్మార్ట్‌ఫోన్ 108-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 5,200mAh బ్యాటరీతో రూపొందించినట్లు తెలుస్తోంది. Honor X7c ఇప్పటికే మార్కెట్‌లో విడుదలైన Honor X7bకి కొనసాగింపుగా వస్తున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. మరెందుకు ఆలస్యం.. Honor X7c 4G హ్యాండ్‌సెట్‌కు సంబంధించిన పలు కీలక విషయాలను తెలుసుకుందామా?!
Honor X7c మోడల్‌కు సంబంధించిన ఫోటోలు, స్పెసిఫికేషన్‌లను 91Mobiles షేర్ చేసింది. ముందుగా చెప్పుకున్నట్లే లీక్ అయిన ఇమేజ్‌ల ఆధారంగా ఇది నలుపు, ఆకుపచ్చ, తెలుపు రంగులలో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ఆకుపచ్చ, తెలుపు రంగుల వేరియంట్‌లు టెక్చర్డ్ బ్యాక్ ప్యానెల్‌లను కలిగి ఉండి, వెనుక భాగంలో కెమెరా మాడ్యూల్‌తో పాటు ముందు భాగంలో పంచ్-హోల్ డిస్‌ప్లేను కలిగి ఉంది. అంతకు ముందు లాంచ్ అయిన Honor X7bతో పోలిస్తే, ఈ కొత్త మోడల్‌లో రీడిజైన్ చేయబడిన కెమెరా మాడ్యూల్‌తో అందంగా కనిపిస్తోంది. ఈ కొత్త హ్యాండ్‌సెట్ వైపున పవర్, వాల్యూమ్ బటన్‌లు ఉన్నట్లు ఇమేజ్‌ల ద్వారా స్పష్టంగా తెలుస్తోంది.
ఈ Honor X7c స్మార్ట్‌ఫోన్ Andorid 14-ఆధారిత MagicOS 8.0పై రన్ అవుతుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 261ppi పిక్సెల్ డెన్సిటీ, 20.1:9 యాస్పెక్ట్ రేషియోతో 6.77-అంగుళాల IPS డిస్‌ప్లే (720x1,610 రిజల్యూషన్)ను కలిగి ఉంటుంది. గత ఏడాది విడుదలైన Honor X7b మాదిరిగా స్నాప్‌డ్రాగన్ 685 ప్రాసెసర్‌తో రన్ అవుతుందని అంచనా వేయవచ్చు. అలాగే, 8GB RAM, 256GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో రావచ్చని భావిస్తున్నారు. మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం.. ఈ స్పెసిఫికేషన్స్ అమ్మకాల విసయంలో కీలకం కానున్నాయి.
Honor X7c హ్యాండ్‌సెట్ కెమెరా విభాగం గురించి చూస్తే.. 108-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2-మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంటుంది. సెల్ఫీల కోసం 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉండే అవకాశం ఉంది. భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉందని తెలుస్తోంది. ఇది 35W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,200mAh బ్యాటరీ కలిగి ఉంటుంది. దుమ్ము, నీటి నిరోధకత కోసం IP64-రేటెడ్ బిల్డ్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. ఫోన్‌లోని కనెక్టివిటీ విషయానికి వస్తే.. NFC, బ్లూటూత్ 5.0, Wi-Fi 5, USB టైప్-C, 3.5mm ఆడియో జాక్ ఉండే అవకాశం ఉంది. 166.9 x 76.8 x 8.1 మిమీ పరిమాణంతో 191 గ్రాముల బరువు కలిగి ఉంటుంది. లాంచ్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడినప్పుడే ఈ మోడల్ స్పెసిఫికేషన్స్‌పై పూర్తి సమాచారం తెలుస్తుంది.
ప్రకటన
ప్రకటన